Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

ఓం  ఓం 
తెలుగు  పదానికి  జన్మదినం 
ఇది  జానా  పదానికి  జ్ఞానప్రదం 
ఏడూ  స్వరాలే  ఏడూ  కొండలై  వెలసిన  కలియుగ  విష్ణు  పదం 

అన్నమయ్య  జననం 
ఇది  అన్నమయ్య  జననం 
ఇది  అన్నమయ్య  జననం 

అరిషడ్వర్గము  తెగనరికే  హరిఖడ్గంమిది  నందకము 
బ్రహ్మలోకమున  బ్రహ్మభారతి  నాదాశీస్సులు  పొందినదై 
శివలోకమ్మున  చిద్విలాసమున  ఢమరుధ్వనిలో  గామాకితమై 
దివ్యాసభలలో  నవ్యలాస్యముల  పూబంతులా  చేబంతిగా  ఎగసి 

నీరద  మండల  నారద  తుంబుర  మహతి  గానవు  మహిమలు  తెలిసి 
సితాహిమ  కంధర  యతిరాత్సభలో  తపః  ఫలముగా  తళుక్కుమని 
తల్లి  తనముకై  తల్లడిల్లు  ఆ  లక్క  మాంబ  గర్భాలయములో 
ప్రవేశించే  ఆనందకము  నందనానంద  కారకము 

అన్నమయ్య  జననం 
ఇది  అన్నమయ్య  జననం 
ఇది  అన్నమయ్య  జననం 

పద్మావతియే  పురుడు  పోయగా  పధ్మాసానుడే  ఉసురు  పోయగా 
విష్ణు  తేజమై  నాద  బీజమై  ఆంధ్ర  సాహితి  అమర  కోశమై
అవతరించెను  అన్నమయ్య  అసతోమా  సద్గమయ 
అవతరించెను  అన్నమయ్య  అసతోమా  సద్గమయ 

పాపడుగా  నట్టింట  పాకుతూ  భాగవతము  చెప్పట్టేనయా 
హరినామమ్మును  ఆలకించాక  అరాముద్దలనే  ముట్టడియా 

తెలుగు  భారతికి  వెలుగు  హారతాయి  ఎదలయలో  పద  కవితలు  కలయ 
తాళ్లపాకలో  ఎదిగే  అన్నమయ్య  తమసోమా  జ్యోతిర్గమయా 
తమసోమా  జ్యోతిర్గమయా 
తమసోమా  జ్యోతిర్గమయా

English

Om om
telugu padaaniki janmadinam
idi jaana padaaniki jnaanapadam
edu swaraale edu kondalai velasina kaliyuga vishnu padam

Annamayya jananam
idi annamayya jananam
idi annamayya jananam

Arishadvargamu teganarike harikhadgammidi nandakamu
brahmalokamuna brahmabhaarati naadaasissulu pondinadai
sivalokammuna chidvilaasamuna damarudhvanilo gamakitamai
divyasabhalalo navyalaasyamula poobantula chebantiga egasi

Neerada mandala naarada tumbura mahati gaanavu mahimalu telisi
sitahima kamdara yatiraatsabhalo tapaha Phalammuga taLukumani
talli tanamukai talladillu aa lakka maamba garbhalayammulo
pravesinche aanandakamu nandanaananda kaarakamu

Annamayya jananam
idi annamayya jananam
idi annamayya jananam

Padmaavatiye purudu poyaga padhmaasanude usuru poyaga
vishnu tejamai naada beejamai andhra saahiti amara kosamai
avatarinchenu annamayya asatomaa sadgamaya
avatarinchenu annamayya asatomaa sadgamaya

Paapadugaa nattinta paakutu bhaagavatamu cheppattenayaa
harinaamammunu aalakinchaka aramuddalane muttadayaa

Telugu bhaaratiki velugu haaratai edalayalo pada kavitalu kalaya
taaLLapaakalo edige annamayya tamasomaa jyotirgamaya
tamasomaa jyotirgamaya
tamasomaa jyotirgamaya

Community

Like, share, and discuss

to start a discussion.