Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

అహో  ఒక  మనసుకు  నేడే  పుట్టిన  రోజు 
అహో  తన  పల్లవి  పాడే  చల్లని  రోజు 
ఇదే  ఇదే  కుహు  స్వరాల  కానుక  
మరో  వసంత  గీతికా  జనించు  రోజు 

అహో  ఒక  మనసుకు  నేడే  పుట్టిన  రోజు 
అహో  తన  పల్లవి  పాడే  చల్లని  రోజు 

మాట  పలుకు  తెలియనిది 
మాటున  ఉండే  మూగ  మాది 
కమ్మని  తలపుల  కావ్యమయే 
కవితలు  రాసే  మౌనమది 

రాగల  రోజుల  ఊహలకి 
స్వాగతమిచ్చే  రాగమాది 
శృతిలయలేరుగాని  ఊపిరికి 
స్వరములు  కూర్చే  గానమది
 
ఋతువుల  రంగులు  మార్చేది 
కల్పనా  కలిగిన  మది  భావం  
బ్రతుకును  పాటగా  మలిచేది  
మనసున  కదిలిన  మృదునాదం 

కలవని  దిక్కులు  కలిపేది 
నింగిని  నెలకి  దింపేది 
తానే  కదా  వారధి 
క్షణాలకే  సారధి  మనస్సనేది
 
అహో  ఒక  మనసుకు  నేడే  పుట్టిన  రోజు 
అహో  తన  పల్లవి  పాడే  చల్లని  రోజు 

చూపులకెన్నడు  దొరకనిది 
రంగు  రూపు  లేని  మాది 
రెప్పలు  తెరవని  కన్నులకు 
స్వప్నలెన్నో  చూపినది 

వెచ్చని  చెలిమిని  పొందినది 
వెన్నెల  కల  గల  నిండుమది 
కాటుక  చీకటి  రాతిరికి 
బాటను  చూపే  నేస్తమది 

చేతికి  అందని  జాబిలిలా 
కాంతులు  పంచె  మణిదీపం 
కొమ్మల  చాటున  కోయిలలా 
కాలం  నిలిపే  అనురాగం
 
అడగని  వరములు  కురిపించి 
అమృతవర్షిణి  అనిపించి 
అమూల్యమైన  పెన్నిధి 
శుభోదయాల  సన్నిధి  మనస్సనేది 

అహో  ఒక  మనసుకు  నేడే  పుట్టిన  రోజు
అహో  తన  పల్లవి  పాడే  చల్లని  రోజు 
ఇదే  ఇదే  కుహు  స్వరాల  కానుక  
మరో  వసంత  గీతికా  జనించు  రోజు

English

Aho Oka Manasuku Nede Puttina Roju
Aho Thana Pallavi Paade Challani Roju
Idhe Idhe Kuhu Swaraala Kaanuka
Maro Vasantha Geethika Janinchu Roju

Aho Oka Manasuku Nede Puttina Roju
Aho Thana Pallavi Paade Challani Roju

Maata Paluku Theliyanidi
Maatuna Unde Mooga Madhi
Kammani Thalapula Kaavyamaye
Kavithalu Raase Mounamadi

Raagala Rojula Uhalaki
Swagathamiche Raagamadi
Shrutilayalerugani Oopiriki
Swaramulu Kurche Gaanamadi

Ruthuvula Rangulu Maarchedi
Kalpana Kaligina Madhi Bhavam
Brathukunu Paataga Malichedi
Manasuna Kadilina Mrudunaadam

Kalavani Dikkulu Kalipedi
Ningini Nelaki Dimpedi
Thane Kadaa Varadhi
Kshanaalake Saradhi Manassanedi

Aho Oka Manasuku Nede Puttina Roju
Aho Thana Pallavi Paade Challani Roju

Chupulakennadu Dorakanidi
Rangu Roopu Leni Madhi
Reppalu Theravani Kannulaku
Swapnalenno Chupinadi

Vechani Chelimini Pondinadi
Vennela Kala Gala Nindumadi
Kaatuka Cheekati Rathiriki
Baatanu Chupe Nesthamadi

Chethiki Andani Jabililaa
Kanthulu Panche Manideepam
Kommala Chaatuna Koyilalaa
Kaalam Nilipe Anuraagam

Adagani Varamulu Kuripinchi
Amruthavarshini Anipinche
Amulyamaina Pennidhi
Shubhodayaala Sannidhi Manassanedi

Aho Oka Manasuku Nede Puttina Roju
Aho Thana Pallavi Paade Challani Roju
Idhe Idhe Kuhu Swaraala Kaanuka
Maro Vasantha Geethika Janinchu Roju

Community

Like, share, and discuss

to start a discussion.