Back to Lyrics

Pelli Chesukundham

1997 · 6 songs

Telugu

నువ్వేమి  చేసావు  నేరం   
నిన్నెక్కడ  అంటింది  పాపం   
చిన్నబోకుమా 

నువ్వేమి  చేసావు  నేరం   
నిన్నెక్కడ  అంటింది  పాపం   
చిన్నబోకుమా
చేయూతనందించు  సాయం   
ఏనాడు  చేసింది  సంఘం  
గమనించుమా 
కన్నీటి  వర్షానికి  కష్టాలు  చల్లారునా  
మార్గం  చూపే  దీపం  కాదా  ధైర్యం 

నువ్వేమి  చేసావు  నేరం   
నిన్నెక్కడ  అంటింది  పాపం   
చిన్నబోకుమా

జరిగింది  ఓ  ప్రమాదం  ఏముంది  నీ  ప్రమేయం  
దేహానికైనా  గాయం  ఏ  మందు  తోను  మాయం 
విలువైన  నిండు  ప్రాణం  మిగిలిఉండటం  ప్రదానం  
అది  నిలిచినంత  కాలం  సాగాలి  నీ  ప్రయాణం
 
స్త్రీల  తనువులోనే  శీలం  ఉన్నదంటే  
పురుష  స్పర్శ  తోనే  తొలగిపోవునంటే   
ఇల్లాలా  దేహాలలో  శీలమే  ఉండదనా       
భర్తన్న  వాడెవడు  పురుషుడే  కాదన  
శీలం  అంటే  గుణం  అని  అర్థం 

నువ్వేమి  చేసావు  నేరం   
నిన్నెక్కడ  అంటింది  పాపం   
చిన్నబోకుమా

గురివింద  ఈ  సమాజం  పర  నిందా  దాని  నైజం  
తన  కింద  నలుపుతత్వం  కనిపెట్టలేదు  సహజం 
తన  కళ్ళ  ముందు  ఘోరం  కాదనదు  పిరికి  లోకం  
అన్యామన్న  నీపై  మోపింది  పాప  భారం 

పడతి  పరువు  కాచే  చేవలేని  సంఘం   
సిగ్గుపడక  పొగా  నవ్వు  తోంది  చిత్రం 
ఆనాటి  ద్రూపదికి  ఈ  నాటి  నీ  గతికి  
అసలైన  అవమానము  చూస్తున్న  ఆ  కళ్ళది 
అంతేగాని  నీలో  లేదే  దోషం 

నువ్వేమి  చేసావు  నేరం   
నిన్నెక్కడ  అంటింది  పాపం   
చిన్నబోకుమా
చేయూతనందించు  సాయం   
ఏనాడు  చేసింది  సంఘం  
గమనించుమా 
కన్నీటి  వర్షానికి  కష్టాలు  చల్లారిన  
మార్గం  చూపే  దీపం  కాదా  ధైర్యం

English

Nuvvemi Chesavu Neram 
Ninnekkada Antindhi Paapam 
Chinabokumaa

Nuvvemi Chesavu Neram 
Ninnekkada Antindhi Paapam 
Chinabokumaa
Cheyuthanandinchu Saayam 
Yenaadu Chesindi Sangham 
Gamaninchumaa
Kanneeti Varshaniki Kashtaalu Challaruna 
Maargam Choope Deepam Kaada Dhairyam

Nuvvemi Chesavu Neram 
Ninnekkada Antindhi Paapam 
Chinabokumaa

Jarigindhi Oo Pramaadam Emundi Nee Prameyam 
Dehaanikaina Gaayam Ye Mandhu Thonu Maayam
Viluvaina Nindu Praanam Migiliundatam Pradanam 
Adi Nilichinantha Kaalam Saagali Nee Prayaanam

Stree La Tanuvulone Sheelam Unnadante 
Purusha Sparsha Thone Tholagipovunante 
Illaala Dehalalo Sheelame Undadana 
Bharthanna Vaadevadu Purushude Kaadu Anaa
Sheelam Ante Ghunam Ani Artham

Nuvvemi Chesavu Neram 
Ninnekkada Antindhi Paapam 
Chinabokumaa

Gurivinda Ee Samaajam Para Ninda Daani Naijam 
Thana Kinda Naluputhatvam Kanipettaledu Sahajam
Thana Kalla Mundu Ghoram Kaadanadu Piriki Lokam 
Anyaamanna Neepai Mopindhi Paapa Bhaaram

Padathi Paruvu Kaache Chevaleni Sangham 
Siggupadaka Poga Navvu Thondi Chitram
Aanaati Draupadiki Ee Naati Nee Gathiki 
Asalaina Avamaanamu Chusthunna Aa Kalladi
Anthegaani Neelo Ledhe Dosham

Nuvvemi Chesavu Neram 
Ninnekkada Antindhi Paapam 
Chinabokumaa
Cheyuthanandinchu Saayam 
Yenaadu Chesindi Sangham 
Gamaninchumaa
Kanneeti Varshaniki Kashtaalu Challaruna 
Maargham Choope Deepam Kaada Dhairyam

Community

Like, share, and discuss

to start a discussion.