Back to Lyrics

Pelli Chesukundham

1997 · 6 songs

Telugu

మనసున  మనసై  కన్నుల్లో  కలలకు  వెలుగై 
ఊహల్లో  ఊగుతోంది  నువ్వే 
తరగని  వరమై  ఎదలో  సరిగమ  స్వరమై 
పెదాల్లో  పాడుతోంది  నువ్వే 
నీకు  పరిచయమై  తొలి  ప్రేమ  చవిచూసా 
నేను  పరవశమై  హృదయాన్ని  పరిచేసా 
నువ్వే  నా  దైవంలా  భావించ 

మనసున  మనసై  కన్నుల్లో  కలలకు  వెలుగై 
ఊహల్లో  ఊగుతోంది  నువ్వే

ప్రియా  జతలో  సన్నిధిలో  తెలిసెను  సంక్రాంతి  
చెలి  ఒడిలో  మనుగడలో  దొరికెను  సుఖ  శాంతి 
అడగక  ముందే  ఆమణిలా  కనుల  ముందే  మెరిసావు 
గ్రహణము  విడిచే  జాబిలిలా  తళుక్కుమంటూ  వెలిగావు 
ప్రాణంలో  ప్రాణంగా  నిలిచావు

మనసున  మనసై  కన్నుల్లో  కలలకు  వెలుగై 
ఊహల్లో  ఊగుతోంది  నువ్వే

శిలలాంటి  శిధిల  వనం  చిగురులు  తొడిగింది 
కలయికతో  ప్రణయ  రధం  పరుగులు  తీసింది 
పిలిచినా  పలికే  పెన్నిధిలా  వలపు  నిధులే  పంచావు 
అతిధిగా  చేరి  హారతిలా  చలువ  చెలిమి  చిలికావు 
అందించా  అర్పించ  ఆణువణువూ 

మనసున  మనసై  కన్నుల్లో  కాలాలకు  వెలుగై 
ఊహల్లో  ఊగుతోంది  నువ్వే
నీకు  పరిచయమై  తొలి  ప్రేమ  చవిచూసా 
నేను  పరవశమై  హృదయాన్ని  పరిచేసా 
నువ్వే  నా  దైవంలా  భావించ

English

Manasuna manasai kannullo kalalaku velugai
oohallo uguthondi nuvve
Tharagani varamai yedallo sarigama swaramai
pedaallo paaduthondi nuvve
Neeku parichayamai tholi prema chavichusa
Nenu paravasamai hrudayanni parichesa
Nuvve naa daivamla bhavincha

Manasuna manasai kannullo kalalaku velugai
uhallo uguthondi nuvve

Priya jathalo sannidhilo thelisenu sankranthi
Cheli odilo manugadalo dorikenu sukha santhi
Adagaka munde aamanila kanula munde merisaavu
Grahanamu vidiche jabililaa thalukumantu veligavu
Pranamlo prananga nilichavu

Manasuna manasai kannullo kalalaku velugai
uhallo uguthondi nuvve

Silalanti sidhila vanam chigurulu thodigindi
Kalayikatho pranaya radham parugulu theesindi
Pilichina palike pennidhilaa valapu nidhule panchavu
Athidhiga cheri harathilaa chaluva chelime chilikavu
Andincha arpincha anuvanuvu

Manasuna manasai kannullo kalalaku velugai
uhallo uguthondi nuvve
Neeku parichayamai tholi prema chavichusa
Nenu paravasamai hrudayanni parichesa
Nuvve naa daivamla bhavincha

Community

Like, share, and discuss

to start a discussion.