Back to Lyrics
Nee Sneham

Nee Sneham

2002 · 7 songs

Telugu

వేయి  కన్నులతో  వేచి  చూస్తున్నా
తెర  చాటు  దాటి  చేరదా  నీ  స్నేహం
కోటి  ఆశలతో  కోరుకుంటున్నా
కరుణించి  ఆదరించదా  నీ  స్నేహం
ప్రాణమే  నీకు  కానుకంటున్నా
మన్నించి  అందుకోవా  నేస్తమా

ఎప్పటికీ  నా  మదిలో  కొలువున్నది  నువ్వైనా
చెప్పుకునే  వీలుందా  ఆ  సంగతి  ఎపుడైనా
రెప్పదాటి  రాననె  స్వప్నమేమి  కానని
ఒప్పుకుంటే  నేరమా  తప్పుకుంటే  న్యాయమా
ఒక్కసారి  మ్మ్  ఒక్కసారి  ల  ల  ల
ఒక్కసారి  అయినా  చెయ్యి  అందించి  ఈ  వింత  దూరాన్ని  కరిగించుమా
వేయి  కన్నులతో  వేచి  చూస్తున్నా
తెర  చాటు  దాటి  చేరదా  నీ  స్నేహం

ప్రతి  నిమిషం  నీ  ఎదుటే  నిజమై  తిరుగుతూ  లేనా
నీ  హృదయం  ఆ  నిజమే  నమ్మను  అంటూ  ఉన్నా
వీడిపోని  నీడలా  వెంట  ఉంది  నేననీ
చూడలేని  నిన్నెలా  కలుసుకోను  చెప్పుమా
ఎన్ని  జన్మలైనా  పోల్చుకోవేమో  వెదికేది  నీలోని  నన్నేనని

వెయ్యి  కన్నులతో  వేచి  చూస్తున్నా
తెర  చాటు  దాటి  చేరదా  నీ  స్నేహం
కోటి  ఆశలతో  కోరుకుంటున్నా
కరుణించి  ఆదరించదా  నీ  స్నేహం
ప్రాణమే  నీకు  కానుకంటున్నా
మన్నించి  అందుకోవా  నేస్తమా

English

Veyi kannulato vechi choostunna
Tera chaatu daati cheradaa nee sneham
Koti aasalato korukuntunna
Karuninchi aadarinchada nee sneham
Praaname neeku kaanukantunna
Maninchi andukova nestamaa

Eppatiki na madilo koluvunnadi nuvvaina
Cheppukone veelunda aa sangathi epudiana
Reppadaati raanani swapnamemi kanani
Oppukunte nerema
Tappukunte nyayama okkasari mm okkasari la la la
Okkasarina chei andichi ee vintha 
dooranni kariginchumaaaaaaaaaa
Veyi kannulato vechi choostunna
Tera chaatu daati cheradaa nee sneham

Prathi nimusham nee edute nijamai tiruguthu lenaaa
Nee hrudayam aa nijame nammanu antuu unna
Veediponi needala ventaundi nenani
Chudaleni ninnela kalusukonu cheppuma
Enni janmalaina polchukovemo vethikedi neeloni nannenani

Veyi kannulato vechi choostunna
Tera chaatu daati cheradaa nee sneham
Koti aasalato korukuntunna
Karuninchi aadarinchada nee sneham
Praaname neeku kaanukantunna
Maninchi andukova nestamaa

Community

Like, share, and discuss

to start a discussion.