Back to Lyrics
Nee Sneham

Nee Sneham

2002 · 7 songs

Telugu

కొంతకాలం  కిందట  బ్రహ్మదేవుని  ముంగిట
రెండు  ఆత్మలు  కోరుకున్నవి  ఓ  వరం
రూపు  రేఖలు  వేరట  ఊపిరొకటే  చాలట
ఆ  వరాన్నే  స్నేహమంటున్నాం  మనం
కంటిపాపని  కాపు  కాసే  జంట  రెప్పల  కాపలాగా
నిండు  చెలిమికి  నువ్వూ  నేను  నీడనివ్వాలి
స్నేహమంటే  రూపులేని  ఊహకాదని  లోకమంతా
నిన్నూ  నన్నూ  చూడగానే  నమ్మితీరాలి
కొంతకాలం  కిందట  బ్రహ్మదేవుని  ముంగిట
రెండు  ఆత్మలు  కోరుకున్నవి  ఓ  వరం

బొమ్మ  బొరుసులేని  నాణేనికి  విలువుంటుందా
మనమిద్దరమూ  పుట్టుండకపోతే  చెలిమికి  విలువుందా
సూర్యుడూ  చంద్రుడూ  లేని  గగనానికి  వెలుగుంటుందా
మన  కన్నులలో  కొలువుండకపోతే  చెలిమికి  వెలుగుందా
గలగలమని  సిరిమువ్వగా  కలతెరుగని  చిరునవ్వుగా
నా  ఎదలయలే  తన  మధురిమలై  పాడాలి  నీ  స్నేహం
కొంతకాలం  కిందట  బ్రహ్మదేవుని  ముంగిట
రెండు  ఆత్మలు  కోరుకున్నవి  ఓ  వరం

వివరిస్తున్నది  అద్దం  మన  అనుబంధానికి  అర్థం
నువ్వు  నాలాగా  నేన్నీలాగా  కనిపించడమే  సత్యం
నువ్వు  చూసే  ప్రతి  స్వప్నం  నా  రాతిరి  దారికి  దీపం
నీ  కల  నిజమై  కనిపించనదే  నిదరించనురా  నేస్తం
గెలుపును  తరిమే  ఆటగా  నిలవని  పరుగులు  తీయగా
మన  ప్రాణాలే  తన  పాదలై  సాగాలి  ఈ  స్నేహం

కొంతకాలం  కిందట  బ్రహ్మదేవుని  ముంగిట
రెండు  ఆత్మలు  కోరుకున్నవి  ఓ  వరం
రూపు  రేఖలు  వేరట  ఊపిరొకటే  చాలట
ఆ  వరాన్నే  స్నేహమంటున్నాం  మనం
కంటిపాపని  కాపు  కాసే  జంట  రెప్పల  కాపలాగా
నిండు  చెలిమికి  నువ్వూ  నేను  నీడనివ్వాలి
స్నేహమంటే  రూపులేని  ఊహకాదని  లోకమంతా
నిన్నూ  నన్నూ  చూడగానే  నమ్మితీరాలి

English

Konthakalam kindhata brahma devuni mungata
Rondu athmalu korukunnai o varam
Roopu rekalu verata oopirokate chalatta
Aa varane sneham antunnam manam
Kanti papanu kapukase jante reppala kapalaga
Nindu chelmi ki nuvvu nenu needanu ivvali
Snehamante roopu leni ooha kaadhani lokamanhta
Ninnu nannu chudagane nammi theerali
Konthakalam kindhata brahma devuni mungata
Rondu athmalu korukunnai o varam

Bomma borusu leni naanaki vilvuntundha
Manam iddaram puttundaki pothe chelmi ki vilvundha
Suryudu chandrudu leni gaganaki velgutundha
Mana kannulalo kolvundakpothe chelmi ki velgundha
Gala gala mani siri muvvaga
Kalatha erugani chiru navvuga
Na yedalayely thana madurimali paadali nee sneham
Konthakalam kindhata brahma devuni mungata
Rondu athmalu korukunnai o varam

Vivaristhunnadhi addam mana anubandaniki artham
Nuvvu naalaga nenu neelaga kannipichadame satyam
Nuvvu chuse prathi swapnam na rathiri dariki deepam
Nee kala nijami kannipinchanidhe nidurinchanu ra nestham
Gelupunu tharme aataga nilvalani parugulu teeyaga
Thana pranale mana padalai saagli nesneham

Konthakalam kindhata brahma devuni mungata
Rondu athmalu korukunnai o varam
Roopu rekalu verata oopirokate chalatta
Aa varane sneham antunnam manam
Kanti papanu kapukase jante reppala kapalaga
Nindu chelmi ki nuvvu nenu needanu ivvali
Snehamante roopu leni ooha kaadhani lokamanhta
Ninnu nannu chudagane nammi theerali

Community

Like, share, and discuss

to start a discussion.