Back to Lyrics
Manasantha nuvve

Manasantha nuvve

2001 · 8 songs

Telugu

కిటకిట  తలుపులు  తెరిచిన  కనులకు  సూర్యోదయం
అటు  ఇటు  తిరుగుతూ  అలిసిన  మనసుకు  చంద్రోదయం
రెండూ  కలిసి  ఒకసారే  ఎదురయ్యే  వరమా
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ
కిటకిట  తలుపులు  తెరిచిన  కనులకు  సూర్యోదయం
అటు  ఇటు  తిరుగుతూ  అలిసిన  మనసుకు  చంద్రోదయం

నిన్నిలా  చేరేదాకా  ఎన్నడూ  నిదరే  రాక
కమ్మని  కలలో  అయినా  నిను  చూడలేదే
నువ్విలా  కనిపించాక  జన్మలో  ఎపుడూ  ఇంక
రెప్పపాటైనా  లేక  చూడాలనుండే
నా  కోసమా  అన్వేషణ  నీడల్లె  వెంట  ఉండగా
కాసేపిలా  కవ్వించనా  నీ  మధుర  స్వప్నమై  ఇలా
ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ  ప్రేమ

కిటకిట  తలుపులు  తెరిచిన  కనులకు  సూర్యోదయం
అటు  ఇటు  తిరుగుతూ  అలిసిన  మనసుకు  చంద్రోదయం

కంటి  తడి  నాడు  నేడు  చెంప  తడి  నిండే  చూడు
చెమ్మలో  ఏదో  తేడా  కనిపించలేదా
చేదు  ఎడబాటే  తీరు  తీపి  చిరునవ్వే  చేరి
అమృతం  అయిపోలేదా  ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా  నీ  జ్ఞాపకం  నడిపింది  నన్ను  జంటగా
ఈనాడిలా  నా  పరిచయం  అడిగింది  కాస్త  కొంటెగా
ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ  ప్రేమ

కిటకిట  తలుపులు  తెరిచిన  కనులకు  సూర్యోదయం
అటు  ఇటు  తిరుగుతూ  అలిసిన  మనసుకు  చంద్రోదయం
రెండూ  కలిసి  ఒకసారే  ఎదురయ్యే  వరమా
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ
ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ  ప్రేమ
ప్రేమ  ప్రేమ  ఆ  ప్రేమ  ప్రేమ

English

Kita kita thalapulu terichina kanulaku suryodayam
atu itu thirugutu alasina manasuku chandrodayam
ninnu kalise okasare edurayye varama 
prema prema prema prema 
Kita kita thalapulu terichina kanulaku suryodayam
atu itu thirugutu alasina manasuku chandrodayam
 
Ninnela cheredaka janmalo nidure raka
kammani kalalo aina ninnu chudalede 
nuvvila kanipinchaka janmalo eppudu 
inka reppapataina leka chudalanunde 
naakosama anveshana needalle venta 
undaga kaasipila kavvinchana nee madura swapna ila  
prema prema aa prema prema   

Kita kita thalapulu terichina kanulaku suryodayam
atu itu thirugutu alasina manasuku chandrodayam
 
Kantatadi naado nedo chempa tadimindhe 
chudu chemmalo edo tada kanipincha leda
teepi edubaate theri chilipi chiru 
navve cheri amrutham aipoleda  aveshamantha
innaluga nee gnapakam nadipindi nannu 
jantaga ee nadila nee parichayam adigindi kaastha kontega 
prema prema aa prema prema 

Kita kita thalapulu terichina kanulaku suryodayam
atu itu thirugutu alasina manasuku chandrodayam
ninnu kalise okasare edurayye varama 
prema prema prema aa prema 
prema prema aa prema prema 
prema prema aa  prema prema

Community

Like, share, and discuss

to start a discussion.