Back to Lyrics
Johnny

Johnny

2003 · 7 songs

Telugu

నాలో  నువ్వొక  సగమై
నేనొక  సగమై   
చెరొక  సగమై  నిలిచే 
ఇలా  ఒకరికొకరై
ఒకే  ఒకరై
చివరి  వరకు  కలిసే 

కలసిన  మనసుల  బంధం  పెళ్లి
కమనీయం  ఈ  పెళ్లి 
ఒక  మాటగా  ఒక  బాటగా
ఒక  గూటికి  పయనం  పెళ్లి 

నాలో  నువ్వొక  సగమై
నేనొక  సగమై 
చెరొక  సగమై  నిలిచే 
ఇలా  ఒకరికొకరై
ఒకే  ఒకరై
చివరి  వరకు  కలిసే 

ప్రతీ  చూపు  నీ  వైపే
ప్రతీ  అడుగు  నీ  జతలోనే 
ప్రతీ  నవ్వు  నీతోనే
ప్రతీ  జన్మ  నీ   ఒడిలోనే 

బ్రతుకంత  నీకే  సొంతమే  ఆ 
చితికైనా  నీతో  సిద్ధమే 

అని  పలికిన  మంత్రం  పెళ్లి
అనురాగం  వెదజల్లి 
అక్షింతలే  సాక్షాలుగా
వర్షించిన  మేఘం  పెళ్లి 

నాలో  నువ్వొక  సగమై
నేనొక  సగమై 
చెరొక  సగమై  నిలిచే 
ఇలా  ఒకరికొకరై
ఒకే  ఒకరై
చివరివరకు  కలిసే  హే 

నువ్వేనంట  నా  నేస్తం
నువ్వేనంట  నమ్మిన  దైవం 
నువ్వేనంట  ఆధారం
నువ్వేనంట  ఆశల  తీరం 

నాకంటే  ఇష్టం  నువ్వని  ఆ
నీ  కష్టనష్టం  నాదని 

వివరించిన  సూత్రం  పెళ్లి
విధికైనా  ఎదురెళ్లి 
నా  ప్రాణమే  నీ  ప్రాణమై
వెలిగించే  దీపం  పెళ్లి

English

Nalo nuvvoka sagamai
Nenoka sagamai 
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise

Kalasina manasula bandham pelli
Kamaneeyam ee pelli
Oka maataga oka bataga
Oka gutiki payanam pelli 

Nalo nuvvoka sagamai
Nenoka sagamai 
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise

Prati choopu nee vaipe
Prati adugu nee jatha lone 
Prati navvu neethone
Prathi janma nee vodi lone 

Bratukanta neeke sonthame aa 
Chitikaina neetho siddhame

Ani palikina mantram pelli 
Anuragam vedajalli
Akshintale sakshaluga
Varshinchina megham pelli

Nalo nuvvoka sagamai
Nenoka sagamai 
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise hey

Nuvvenanta naa nestham
Nuvvenanta nammina daivam
Nuvvenanta aadharam
Nuvvenanta aashala theeram 

Naakante istam nuvvani aa 
Nee kastanastam naadani

Vivarinchina sutram pelli
Vidhikaina edurelli
Naa praname nee pranamai
Veliginche deepam pelli

Community

Like, share, and discuss

to start a discussion.