Back to Lyrics
Devullu

Devullu

2000 · 7 songs

Telugu

సిరులునొసగి  సుఖశాంతులు  కూర్చును  షిరిడీ  సాయి  కథ

మధుర  మధుర  మహిమాన్విత  భోద  సాయి  ప్రేమ  సుధ
సిరులునొసగి  సుఖశాంతులు  కూర్చును  షిరిడీ  సాయి  కథ
మధుర  మధుర  మహిమాన్విత  భోద  సాయి  ప్రేమ  సుధ
పారాయణతో  సకల  జనులకి  భారాలను  తొలగించే  గాధ
పారాయణతో  సకల  జనులకి  భారాలను  తొలగించే  గాధ
సిరులునొసగి  సుఖశాంతులు  కూర్చును  షిరిడీ  సాయి  కథ
మధుర  మధుర  మహిమాన్విత  భోద  సాయి  ప్రేమ  సుధ

షిరిడి  గ్రామములో  ఒక  బాలుని  రూపములో  
వేపచెట్టు  కింద  వేదాంతిగా  కనిపించాడు
తన  వెలుగును  ప్రసరించాడు
పగలు  రేయి  ధ్యానం  పరమాత్మునిలో  లీనం
పగలు  రేయి  ధ్యానం  పరమాత్మునిలో  లీనం
ఆనందమే  ఆహారం  చేదు  చెట్టు  నీడయే  గురు  పీఠం
ఎండకు  వానకు  కృంగకు  ఈ  చెట్టు  క్రిందనే  ఉండకు  
సాయి  సాయి  రా  మసీదుకు  అని  మహల్సాపతి  పిలుపుకు
మసీదుకు  మారెను  సాయి  
అదే  అయినది  ద్వారకామయి
అక్కడ  అందరూ  భాయి  భాయి
బాబా  భోదల  నిలయమదోయి  

సిరులునొసగి  సుఖశాంతులు  కూర్చును  షిరిడీ  సాయి  కథ
మధుర  మధుర  మహిమాన్విత  భోద  సాయి  ప్రేమ  సుధ

ఖురాను  బైబులు  గీత  ఒకటని  కులమత  భేదము  వద్దనే
గాలివాన  నొక  క్షణమున  ఆపే  
ఉడికే  అన్నము  చేతితో  కలిపే
రాతి  గుండెలను  గుడులను  చేసె
నీటి  దీపములను  వెలిగించె
పచ్చి  కుండలో  నీటిని  తెచ్చి  పూలమొక్కలకు  పోసి
నిండే  వనమును  పెంచి  మధ్యలో  అఖండ  జ్యోతిని  వెలిగించె
కప్పకు  పాముకు  స్నేహం  కలిపే  తల్లి  భాషకు  అర్దం  తెలిపే
ఆర్తుల  రోగాలను  హరియించే
భక్తుల  బాదలు  తాను  భరించే
ప్రేమ  సహనం  రెండు  వైపులా  ఉన్ననాడే  గురుదక్షిణ  అడిగే
మరణం  జీవికి  మార్పును  తెలిపే
మరణించి  తను  మరలా  బ్రతికె
సాయిరాం  సాయిరాం  సాయిరాం  సాయిరాం
సాయిరాం  సాయిరాం  సాయిరాం  సాయిరాం
సాయిరాం  సాయిరాం  సాయిరాం  

నీదని  నాదని  అనుకోవద్దనె
ధునిలో  ఊది  విభూదిగనిచ్చె
భక్తి  వెల్లువలు  జయ  జయ  ఘోషలు  చావడి  ఉత్సవమై  సాగగా
కంకడ  హారతులందుకొని  కలిపాపాలను  కడుగగా
సకల  దేవతా  స్వరూపుడై  వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై  జగద్గురువై
సత్యం  చాటే  దత్తాత్రేయుడై  భక్తుని  ప్రాణం  రక్షించుటకై
జీవన  సహచరి  అని  చాటిన  తన  ఇటుక  రాయి  తృటిలో  పగులగా
పరిపూర్ణుడై  గురుపౌర్ణమై
భక్తుల  మనసులో  చిరంజీవియై  శరీర  సేవాలంగన  చేసి
దేహము  విడిచెను  సాయి
సమాధి  అయ్యెను  సాయి

సాయిరాం  సాయిరాం  సాయిరాం  సాయిరాం
సాయిరాం  సాయిరాం  సాయిరాం  సాయిరాం
సాయిరాం  సాయిరాం  సాయిరాం  సాయిరాం
అఖిలాండకోటి  బ్రహ్మాండ  నాయకా  
శ్రీ  సమర్థ  సద్గురు  సాయినాధ  మహారాజ్

English

Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha

Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha
Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha
Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha
Paaraayanato sakala janulaki bhaaraalanu tolagimche gaadha
Paaraayanato sakala janulaki bhaaraalanu tolagimche gaadha
Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha
Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha

Shiridi graamamulo oka baaluni rupamulo 
Vepacettu kimda vedaamtigaa kanipimcaadu
Tana velugunu prasarimcaadu
Pagalu reyi dhyaanam paramaatmunilo linam
Pagalu reyi dhyaanam paramaatmunilo linam
Aanamdame aahaaram chedu chettu nidaye guru pitham
Emdaku vaanaku krumgaku e chettu krimdane umdaku 
Saayi Saayi raa masiduku ani mahalsaapati pilupuku
Masiduku maarenu saayi 
Ade ayinadi dwaarakaamayi
Akkada amdaru bhaayi bhaayi
Baabaa bhodala nilayamadoyi 

Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha
Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha

Kuraanu baibulu gita okatani kulamata bhedamu vaddane
Gaalivaana noka kshanamuna aape 
Udike annamu chetito kalipe
Raati gumdelanu gudulanu chese
Niti dipamulanu veligimce
Pacci kumdalo nitini tecchi pulamokkalaku posi
Nimde vanamunu pemci madhyalo akamda jyotini veligimche
Kappaku paamuku sneham kalipe talli bhaashaku ardam telipe
Aartula rogaalanu hariyimche
Bhaktula baadalu taanu bharimche
Prema sahanam remdu vaipulaa unnanaade gurudakshina adige
Maranam jiviki maarpunu telipe
Maranimci tanu maralaa bratike
Saayiraam saayiraam saayiraam saayiraam
Saayiraam saayiraam saayiraam saayiraam
Saayiraam saayiraam saayiraam 

Nidani naadani anukovaddane
Dhunilo Udi vibhudiganicche
Bhakti velluvalu jaya jaya goshalu caavadi utsavamai saagagaa
Kamkada haaratulamdukoni kalipaapaalanu kadugagaa
Sakala devataa swarupudai vedashaastramulakatitudai
Sadguruvai jagadguruvai
Satyam chaate dattaatreyudai bhaktuni praanam rakshimcutakai
Jivana sahachari ani caatina tana ituka raayi trutilo pagulagaa
Paripurnudai gurupaurnamai
Bhaktula manasulo ciramjiviyai sharira sevaalamgana chesi
Dehamu vidichenu saayi
Samaadhi ayyenu saayi

Saayiraam saayiraam saayiraam saayiraam
Saayiraam saayiraam saayiraam saayiraam
Saayiraam saayiraam saayiraam saayiraam
Akilaamdakoti brahmaamda naayakaa
Shri samarda sadguru saayinaadha maharaaj

Community

Like, share, and discuss

to start a discussion.