Back to Lyrics
Devullu

Devullu

2000 · 7 songs

Telugu

అయ్యప్ప  దేవాయ  నమః  అభయ  స్వరూపాయ  నమః
అయ్యప్ప  దేవాయ  నమః  అభయ  స్వరూపాయ  నమః
హరి  హర  సుపుత్రాయ  నమః  కరుణా  సముద్రాయ  నమః
నిజ  భీర  గంభీర  శభరీ  గిరి  శిఖర  ఘన  యోగ  ముద్రాయ  నమః
పరమాణు  హృదయాంతరాళ  స్థితానంత  బ్రహ్మాండరూపాయ  నమః
అయ్యప్ప  దేవాయ  నమః  అభయ  స్వరూపాయ  నమః

పద్దెనిమిది  పడిమెట్ల  పైకెక్కీ  గుడికేగు
భక్తులకు  ఎదురొచ్చే  బంగారు  స్వామి
ఇరుముడులు  స్పృశియించి  శుభమనుచు  దీవించి
జనకృందముల  చేరే  జగమేలు  స్వామి
తన  భక్తులొనరించు  తప్పులకు  తడబడి
ఒక  ప్రక్క  ఒరిగెనా  ఓంకార  మూర్తి
స్వామియే  శరణం  అయ్యప్ప
స్వాములందరు  తనకు  సాయమ్ము  కాగా
ధీమంతుడై  లేచి  ఆ  కన్నె  స్వామి
పట్టబందము  వీడి  భక్తతటికై
పరుగు  పరుగున  వచ్చె  భువిపైకి  నరుడై
అయ్యప్ప  దేవాయ  నమః  అభయ  స్వరూపాయ  నమః

ఘోర  కీకారణ్య  సంసార  యాత్రికుల
శరణు  ఘోషలు  విని  రోజు  శబరిషా
పాపాలు  దోషాలు  ప్రక్షాళనము  చేయు
పంపానది  తీరా  ఎరుమేలి  వాసా
నియమాల  మాలతో  సుగుణాల  మెట్లపై
నడిపించు  కనిపించు  అయ్యప్ప  స్వామి
మకర  సంక్రాంతి  సజ్యోతిపై  అరుదెంచి
మహిమలను  చూపించు  మణికంఠ  స్వామి
కర్మ  బందము  బాపు  ధర్మ  శాస్త్ర
కలి  భీతి  తొలగించు  భూతాధినేత
అయ్యప్ప  దేవాయ  నమః  అభయ  స్వరూపాయ  నమః

ఆద్యంత  రహితమౌ  నీ  విశ్వరూపము
అజ్ఞాన  తిమిరమ్ము  నణుచు  శుభదీపం
ఈ  నాల్గు  దిక్కులు  పదునాల్గు  భువనాలు
పడిమెట్లుగా  మారె  ఇదో  అపురూపం
అమరులెల్లరు  చేయ  అమృతాభిషేకం
నెరవేర్చుకో  స్వామి  నీదు  సంకల్పం
ఓం      

పదములకు  మ్రొక్కగా  ఒక్కోక్క  లోకం
అందుకో  నక్షత్ర  పుష్పాభిషేకం
పంపానది  తీర  శంపాల  పాతాళ  పాపాత్మ  పరిమార్చు  స్వామి
భక్తులను  రక్షించు  స్వామి
శరణమయ్యప్ప  శరణమయ్యప్ప
శంభు  విష్ణు  తనయ  శరణమయ్యప్ప
శరణమయ్యప్ప  శరణమయ్యప్ప
శంభు  విష్ణు  తనయ  శరణమయ్యప్ప
స్వామియే  శరణమయ్యప్ప
స్వామియే  శరణమయ్యప్ప
ఓం  శాంతి  శాంతి  శాంతిః
ఓం  శాంతి  శాంతి  శాంతిః

English

Ayyappa devaaya namah abhaya swarupaaya namah
Ayyappa devaaya namah abhaya swarupaaya namah
Hari hara suputraaya namah karunaa samudraaya namah
Nija bhira gambira shabhari giri shikara Gana yoga mudraaya namah
Paramaanu hrudayaamtaraala sthitaanamta brahmaamdarupaaya namah
Ayyappa devaaya namah abhaya swarupaaya namah

Paddenimidi padimetla paikekki gudikegu
Bhaktulaku edurocche bamgaaru swaami
Irumudulu sprushiyimchi shubhamanuchu divimchi
Janakrumdamula chere jagamelu swaami
Tana bhaktulonarimchu tappulaku tadabadi
Oka prakka origenaa omkaara murti
Swaamiye sharanam ayyappa
Swaamulamdaru tanaku saayammu kaagaa
Dhimamtudai lechi aa kanne swaami
Pattabamdamu vidi bhaktatatikai
Parugu paruguna vacche bhuvipaiki narudai
Ayyappa devaaya namah abhaya swarupaaya namah

Gora kikaaranya samsaara yaatrikula
Sharanu goshalu vini roju shabarishaa
Paapaalu doshaalu prakshaalanamu cheyu
Pampaanadi tiraa erumeli vaasaa
Niyamaala maalato sugunaala metlapai
Nadipimcu kanipimcu ayyappa swaami
Makara samkraamti sajyotipai arudemchi
Mahimalanu chupimcu manikamtha swaami
Karma bamdamu baapu dharma shaastra
Kali bhiti tolagimchu bhutaadhineta

Ayyappa devaaya namah abhaya swarupaaya namah

Aadyamta rahitamau ni vishwarupamu
Agyaana timirammu nanuchu shubhadipam
I naalgu dikkulu padunaalgu bhuvanaalu
Padimetlugaa maare ido apurupam
Amarulellaru cheya amrutaabhishekam
Neraverchuko swaami nidu samkalpam
OM     

Padamulaku mrokkagaa okkokka lokam
Amduko nakshatra pushpaabhishekam
Pampaanadi tira shampaala paataala paapaatma parimaarchu swaami
Bhaktulanu rakshimchu swaami
Sharanamayyappa sharanamayyappa
Shambhu vishnu tanaya sharanamayyappa
Sharanamayyappa sharanamayyappa
Shambhu vishnu tanaya sharanamayyappa
Swaamiye sharanamayyappa
Swaamiye sharanamayyappa
OM shaanti shaanti shaantih
OM shaanti shaanti shaantih

Community

Like, share, and discuss

to start a discussion.