Back to Lyrics
Devullu

Devullu

2000 · 7 songs

Telugu

మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా
మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా
శివంకరి  శుభంకరి  పూర్ణచంద్ర  కళాదరి
బ్రహ్మ  విష్ణు  మహేశ్వరుల  సృష్టించిన  మూలశక్తి
అష్టాదశ  పీఠాలను  అధిష్టించు  అధిశక్తి
మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా

ఓంకార  రావాల  అలల  కృష్ణా  తీరంలో
ఇంద్రకీల  గిరిపైన  వెలసెను  కృత  యుగములోన
ఈ  కొండపైన  అర్జునుడు  తపమును  కావించెను
పరమశివుని  మెప్పించి  పాశుపతం  పొందెను
విజయుడైన  అర్జునుని  పేరిట  విజయవాడ  అయినది  ఈ  నగరము
జగములన్నీయు  జేజేలు  పలుకగా  కనకదుర్గకైనది  స్థిరనివాసము
మేలిమి  బంగారు  ముద్ద  పసుపు  కలగలిపిన  వెన్నెలమోము
కోటి  కోటి  ప్రభాతాల  అరుణిమయే  కుంకుమ
అమ్మ  మనసుపడి  అడిగి  ధరించిన  కృష్ణవేణి  ముక్కుపుడక
ప్రేమ  కరుణ  వాత్సల్యం  కురిపించే  దుర్గ  రూపం
ముక్కోటి  దేవతలందరికీ  ఇదియే  ముక్తి  దీపం

మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా

దేవీ  నవరాత్రులలో  వేదమంత్ర  పూజలలో
స్వర్ణ  కవచములు  దాల్చిన  కనకదుర్గాదేవి
భవబందాలను  బాపే  బాలా  త్రిపురసుందరి
నిత్యానందము  కూర్చే  అన్నపూర్ణాదేవి
లోకశాంతిని  సంరక్షించే  సుమంత్ర  మూర్తి  గాయత్రి
అక్షయ  సంపదలెన్నో  అవని  జనుల  కందించే  దివ్య  రూపిణి  మహాలక్ష్మి
విద్యా  కవన  గాన  మొసగు  వేదమయి  సరస్వతి
ఆయురారోగ్యాలు  భోగభాగ్యములు  ప్రసాదించే  మహాదుర్గ
శత్రు  వినాసిని  శక్తి  స్వరూపిని  మహిషాసురమర్దిని
విజయకారిణి  అభయ  రూపిణి  శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి  కన్నుల  పండుగ
అమ్మా  నీ  దర్శనం  దుర్గమ్మా  నీ  దర్శనం

మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా
మహా  కనకదుర్గా  విజయ  కనకదుర్గా
పరాశక్తి  లలితా  శివానంద  చరితా

English

Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita 
Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita
Shivankari Shubhankari Poornachandra Kaladhari 
Brahma Vishnu Maheshwarula Srushtinchina Moolashakti 
Ashtadasha Peethaalanu Adhistinchu Aadishakti 
Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita

Omkaara Ravaala Alala Krishnatheeramlo 
Indrakeela Giripaina Velasenu Krutayugamulona

Ee Kondapaina Arjunudu Tapamunu Kaavinchenu 
Paramashivuni Meppinchi Paashupatamu Pondenu 

Vijayudaina Arjuduni Perita Vijayawada Ayinadi Ee Nagaramu 
Jagamulanniyu Jejelu Palukaga 
Kanakadurgakainadi Sthiranivasamu 
Melimi Bangaru Muddapasupu Kalagalipina Vennelamu 
Koti Koti Prabhataala Aarunimayye Kunkuma 
Amma Manasupadi Adigi Dharinchina Krishnaveni Mukkupudaka 
Prema Karuna Vaathsalyam Kuripinche Durgaroopam 
Mukkoti Devatalandariki Idi Ille Puttideepam 
Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita

Devi Navaraatrulalo Vedamantra Poojalalo 
Swarna Kavachamulu Dalchina Kanakadurgadevi 

Bhavabandalanu Baape Bala Tripurasundari 
Nityaannadamu Koorche Annapoornadevi 
Lokashantini Samrakshinche Sumantramoorti Gayathri 
Akshaya Sampadalenno Avani Janula Kandinche 
Divya Roopini Mahalakshmi 
Vidya Kavana Gaana Mosagu Vedamaye Saraswathi

Ayurarogyaalu Bhogabhagyamulu Prasaadinchu Mahadurga 
Shatru Vinasini Shaktiswaroopini Mahishasuramardhini 
Vijayakaarini Abhaya Roopini Sreerajarajeshwari 
Bhaktulandariki Kannula Pandaga 
Amma Nee Darshanam Durgamma Nee Darshanam 

Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita 
Maha Kanaka Durga Vijaya Kanaka Durga 
Paraashakti Lalitha Shivananda Charita

Community

Like, share, and discuss

to start a discussion.