Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

జాబిలికీ  వెన్నెలకీ  పుట్టిన  పున్నమిలే
గంగలలో  తేనెలలో  కడిగిన  ముత్యములే
ముద్దులోనే  పొద్దుపోయే
కంటి  నిండా  నిద్దరోవే  చంటి  పాడే  జోలలోనే
జాబిలికీ  వెన్నెలకీ  పుట్టిన  పున్నమిలే
గంగలలో  తేనెలలో  కడిగిన  ముత్యములే

వేమనయ్య  నా  గురువే  వేలిముద్ర  నా  చదువే
పాలబువ్వ  నా  పలుకే  హాయి  నిద్ర  పాపలకే
వేమనయ్య  నా  గురువే  వేలిముద్ర  నా  చదువే
పాలబువ్వ  నా  పలుకే  హాయి  నిద్ర  పాపలకే

కూనలమ్మ  నా  పదమే  తేనెకన్నా  తియ్యనిదే
కోనలన్నీ  పాడుకనే  గువ్వ  చిన్న  పాట  ఇదే
రాగముల  తాళములో  నాకసలే  రావులే
పాడుకొను  జ్ఞానమునే  నా  కొసగే  దైవమే

ముద్దులోనే  పొద్దుపోయే
కంటి  నిండా  నిద్దరోవే  చంటి  పాడే  జోలలోనే
జాబిలికీ  వెన్నెలకీ  పుట్టిన  పున్నమిలే
గంగలలో  తేనెలలో  కడిగిన  ముత్యములే

English

Jaabiliki vennelaki puttina punnamile
Gangalalo tenelalo kadigina mutyamule
Muddulone poddupoye
Kanti nindaa niddarove chanti paade jolalone
Jaabiliki vennelaki puttina punnamile
Gangalalo tenelalo kadigina mutyamule

Vemanayya naa guruve velimudra naa chaduve
Paalabuvva naa paluke haayi nidra paapalake
Vemanayya naa guruve velimudra naa chaduve
Paalabuvva naa paluke haayi nidra paapalake

Kunalamma naa padame tenekannaa tiyyanide
Konalanni paadukane guvva chinna paata ide
Raagamula taalamulo naakasale raavule
Paadukonu jnaanamune naa kosage daivame

Muddulone poddupoye
Kanti nindaa niddarove chanti paade jolalone
Jaabiliki vennelaki puttina punnamile
Gangalalo tenelalo kadigina mutyamule

Community

Like, share, and discuss

to start a discussion.