Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు
వేసే  పూల  బాణం  కూసే  గాలి  గంధం
పొద్దేలేని  ఆకాశం  హద్దేలేని  ఆనందం
ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు

సిరిగల  చిలకలు  ఇలదిగి  నడచుట  న్యాయమా  ధర్మమా
తొలకరి  మెరుపులు  చిలికిన  చినుకులు  నింగిలో  ఆగునా
చలిమర  గదులలో  సుఖపడు  బతుకులు  వేసవే  కోరునా
అలికున  గుడిసెల  చలువుల  మనసులు  మేడలో  దొరుకునా

అందాల  మేడల్లోనే  అంటదు  కాలికి  మన్ను
బంగారు  పంటలు  పండే  మన్నుకు  చాలదు  మిన్ను
నిరుపేదిల్లు  పొదరిల్లు
ఇలలో  ఉన్న  హరివిల్లు

ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు
వేసే  పూల  బాణం  కూసే  గాలి  గంధం
పొద్దేలేని  ఆకాశం  హద్దేలేని  ఆనందం
ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు

జలజల  పదముల  అలజడి  నదులకు  వంత  నే  పాడనా
మిలమిల  మెరిసిన  తళతళ  తారలు  నింగినే  వీడునా
చెరువుల  కడుపున  విరిసిన  తామర  తేనెలే  పూయునా
మిణుగురు  పురుగుల  మిడిమిడి  వెలుగులు  వెన్నెలై  కాయునా

ఏ  గాలి  మేడల్లోనో  దీపంలా  నే  ఉన్నా
మా  పల్లె  సింగారాలు  నీలో  నేనే  కన్నా
గోదారమ్మ  పరవళ్ళు
తెలుగింటమ్మ  తిరునాళ్ళు

ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు
వేసే  పూల  బాణం  కూసే  గాలి  గంధం
పొద్దేలేని  ఆకాశం  హద్దేలేని  ఆనందం
ఎన్నెన్నో  అందాలు  ఏవేవో  రాగాలు

English

Ennenno andaalu evevo raagaalu
Vese pula baanam kuse gaali gandham
Poddeleni aakaasham haddeleni aanandam
Ennenno andaalu evevo raagaalu

Sirigala chilakalu iladigi nadachuta nyaayamaa dharmamaa
Tolakari merupulu chilikina chinukulu ningilo aagunaa
Chalimara gadulalo sukapadu batukulu vesave korunaa
Alikuna gudisela chaluvula manasulu medalo dorukunaa

Andaala medallone antadu kaaliki mannu
Bangaaru pantalu pande mannuku chaaladu minnu
Nirupedillu podarillu
Ilalo unna harivillu

Ennenno andaalu evevo raagaalu
Vese pula baanam kuse gaali gandham
Poddeleni aakaasham haddeleni aanandam
Ennenno andaalu evevo raagaalu

Jalajala padamula alajadi nadulaku vantha ne paadanaa
Milamila merisina talatala taaralu ningine vidunaa
Cheruvula kadupuna virisina taamara tenele puyunaa
Minuguru purugula midimidi velugulu vennelai kaayunaa

E gaali medallono dipamlaa ne unnaa
Maa palle singaaraalu nilo nene kannaa
Godaaramma paravallu
Telugintamma tirunaallu

Ennenno andaalu evevo raagaalu
Vese pula baanam kuse gaali gandham
Poddeleni aakaasham haddeleni aanandam
Ennenno andaalu evevo raagaalu

Community

Like, share, and discuss

to start a discussion.