Back to Lyrics

Adavari Matalaku Ardhale Verule

2007 · 6 songs

Telugu

మనసా  మన్నించమ్మా
మార్గం  మళ్ళించమ్మా
నీతో  రాని  నిన్నల్లోనే
శిలవై  ఉంటావా

స్వప్నం  చెదిరిందమ్మా
సత్యం  ఎదురుందమ్మా
పొద్దే  లేని  నిద్దర్లోనే
నిత్యం  వుంటావా

ప్రేమ  ప్రేమ  నీ  పరిచయం
పాపం  అంటే  కాదనలేవా
ప్రేమ  ప్రేమ  నీ  పరిచయం
పాపం  అంటే  కాదనలేవా

ప్రేమాలయంలా  వుంటే  నీ  తలపు
ప్రేమే  దైవంలా  కొలువుంటుందమ్మా
దావానలంలా  తరిమే  నిట్టూర్పు
ప్రేమను  నీ  నుంచి  వెలివేస్తుందమ్మా

అంత  దూరం  ఉంటేనే
చందురుడు  చల్లని  వెలుగమ్మ
చెంతకొస్తే  మంటేలే
అందడని  నిందించొద్దమ్మా

మన  క్షేమం  కోరుకునే
జాబిలే  చెలిమికి  చిరునామా
తన  సౌఖ్యం  ముఖ్యమనే
కాంక్షలో  కలవరపడకమ్మా

ప్రేమ  ప్రేమ  నీ  స్నేహమే
తీయని  శాపం  మన్నిస్తావా

ఒక  చినుకునైన  దాచడు  తనకోసం
నేలకు  నీరిచ్చి  మురిసే  ఆకాశం
నదులన్నీ  తానే  తాగే  ఆరాటం
కడలికి  తీర్చేనా  దాహం  ఏ  మాత్రం

పంజరంలో  బంధించి
ఆపకే  నేస్తాన్నేనాడు
పల్లకిపై  పంపించి
చల్లగ  దీవించవే  నేడు

జ్ఞాపకంలో  తియ్యదనం
చేదుగా  మార్చవ  కన్నీళ్లు
జీవితంలో  నీ  పయనం
ఇక్కడే  ఆపకు  నూరేళ్ళు

ప్రేమ  ప్రేమ  మదిలో  భారం
కరిగించేలా  ఓదార్చవా

English

Manasa manninchamma
Margam mallinchamma
Neetho rani ninnallone
Silavi vuntavaaaa

Swapnam chedirindamma
Satyam yedarundamma
Podde leni niddarlone
Nityam vuntavaaa

Prema prema nee parichayam
Papam ante kadanalevaa
Prema prema nee parichayam
Papam ante kadanalevaa

Premalayamla vunte nee talapu
Preme divamla koluvuntundamma
Davanalamla tarime nitturpu
Premanu nee nunchi velivestundamma

Antha duram vuntene
Chandurudu challani velugamma
Chenthakosthe mantele
Andadani nindinchoddamma

Mana kshemam korukune
Jabile chelimiki chirunamaa
Tana soukhyam mukhyamane
Kankshalo kalavarapadakammaa

Prema prema ne snehame
Teeyani shapam mannistaavaa

Oka chinukunina dachadu tanakosam
Nelaku neerichi murise akasam
Nadulanni taane taage araatam
Kadaliki teerchena daham ye mathram

Panjaramlo bandhinchi
Aapake nesthannenadu
Pallakipi pampinchi
Challaga deevinchave nedu

Gnapakamlo tiyyadanam
Cheduga marchava kanneellu
Jeevithamlo nee payanam
Ikkade aapaku nurellu

Prema prema madilo bharam
Kariginchela odarchavaaa

Community

Like, share, and discuss

to start a discussion.