Back to Lyrics

Adavari Matalaku Ardhale Verule

2007 · 6 songs

Telugu

ఏమైంది  ఈ  వేళ
ఎదలో  ఈ  సందడేలా

మిల  మిల  మిల  మేఘమాలా
చిటపట  చినుకేయు  వేళ
చెలి  కులుకులు  చూడగానే
చిరు  చెమటలు  పోయనేలా

ఏ  శిల్పి  చెక్కెనీ  శిల్పం
సరికొత్తగా  వుంది  రూపం
కనురెప్ప  వేయనీదు  ఆ  అందం
మనసులోన  వింత  మోహం

మరువలేని  ఇంద్ర  జాలం
వానలోన  ఇంత  దాహం

చినుకులలో  వాన  విల్లు
నేలకిలా  జారెనే
తళుకుమనే  ఆమె  ముందు
వెల  వెల  వెల  బోయెనే

తన  సొగసే  తీగలాగా
నా  మనసే  లాగెనే
అది  మొదలు  ఆమె  వైపే
నా  అడుగులు  సాగెనే

నిశీధిలో  ఉషోదయం
ఇవాళిలా  ఎదురే  వస్తే

చిలిపి  కనులు  తాళమేసే
చినుకు  తడికి  చిందులేసే
మనసు  మురిసి  పాట  పాడే
తనువు  మరిచి  ఆటలాడే

ఏమైంది  ఈ  వేళ
ఎదలో  ఈ  సందడేలా

మిల  మిల  మిల  మేఘమాలా
చిటపట  చినుకేయు  వేళ
చెలి  కులుకులు  చూడగానే
చిరు  చెమటలు  పోయనేలా

ఆమె  అందమే  చూస్తే
మరి  లేదు  లేదు  నిదురింక
ఆమె  నన్నిలా  చూస్తే
ఎద  మోయలేదు  ఆ  పులకింత

తన  చిలిపి  నవ్వుతోనే
పెను  మాయ  చేసేనా
తన  నడుము  వొంపులోనే
నెలవంక  పూచెనా

కనుల  ఎదుటే  కలగ  నిలిచా
కలలు  నిజమై  జగము  మరిచా
మొదటి  సారి  మెరుపు  చూసా
కడలిలాగే  ఉరకలేసా

English

Can you feel her
Is your heart speaking to her
Can you feel the love
Yes

Yemaindi ee vela
Yedalo ee sandadela

Mila mila mila meghamala
Chitapata chinukeyu vela
Cheli kulukulu choodagaane
Chiru chematalu poyanela

Ye shilpi chekkenee shilpam
Sarikothaga vundi roopam
Kanureppa veyaneedu aa andam
Manasulona vintha moham

Maruvaleni indra jaalam
Vaanalona intha daaham

Chinukulalo vaana villu
Nelakila jaarene
Thalukumane aame mundu
Vela vela vela boyene

Thana sogase theegalaga
Na manase lagene
Adi modalu aame vaipe
Naa adugulu saagene

Niseedhilo ushodayam
Ivalila yedure vasthe

Chilipi kanulu thaalamese
Chinuku thadiki chindulese
Manasu murisi paatapaade
Thanuvu marichi aatalaade

Yemaindi ee vela
Yedalo ee sandadela

Mila mila mila meghamala
Chitapata chinukeyu vela
Cheli kulukulu choodagane
Chiru chematalu poyanela

Aame andame choosthe
Mari ledu ledu nidurinka
Aame nannila choosthe
Yeda moyaledu aa pulakintha

Thana chilipi navvuthone
Penu maaya chesena
Thana nadumu vompulone
Nelavanka poochena

Kanula yedute kalaga nilicha
Kalalu nijamai jagamu maricha
Modati saari merupu choosa
Kadalilage vurakalesa

Community

Like, share, and discuss

to start a discussion.