Back to Lyrics
Tagore

Tagore

2003 · 6 songs

Telugu

నేను  సైతం  ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి  ఆహుతిచ్చానూ   
నేను  సైతం  విశ్వవృష్టికి
అశ్రువొక్కటి  ధారపోసాను  

నేను  సైతం  భువన  ఘోషకు
వెర్రి  గొంతుక  విచ్చి  మ్రోశాను 

నేను  సైతం  ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి  ఆహుతిచ్చానూ 

అగ్నినేత్ర  మహోగ్రజ్వాలా
దాచినా  ఓ  రుద్రుడా  
అగ్నిశిఖలను  గుండెలోనా
అణచినా  ఓ  సూర్యుడా  

పరశ్వధమును  చేతబూనిన
పరశురాముని  అంశవా  
హింసనణచగ  ధ్వంస  రచనలు
చేసిన  ఆచార్యుడా

మన్నెం  వీరుడు  రామరాజు
ధనుష్టంకారానివా  
భగత్  సింగ్  కడ  సారి  పలికిన
ఇంక్విలాబ్  శబ్దానివా  

అక్రమాలను  కాలరాసినా
ఉక్కు  పాదం  నీదిరా   
లంచగొండుల  గుండెలో
నిదురించు  సింహం  నీవురా  

ధర్మదేవత  నీడలో  పయనించు
యాత్రే  నీదిరా  
కనులు  గప్పిన  న్యాయదేవత
కంటి  చూపైనావురా 

సత్యమేవ  జగతికి
నిలువెత్తు  సాక్ష్యం  నీవురా  
లక్షలాది  ప్రజల
ఆశాజ్యోతివై  నిలిచావురా 

నేను  సైతం  ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి  ఆహుతిచ్చానూ  
నేను  సైతం  విశ్వవృష్టికి
అశ్రువొక్కటి  ధారపోసాను

నేను  సైతం  భువన  ఘోషకు
వెర్రి  గొంతుక  విచ్చి  మ్రోశాను 
నేను  సైతం  ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి  ఆహుతిచ్చానూ

English

Nenu saitam prapanchaagniki
Samidhanokkati aahuticchaanu 
Nenu saitam vishvavrushtiki
Ashruvokkati dhaaraposaanu 

Nenu saitam bhuvanaghoshaku
Verri gontuka vicchi mroshanuu 

Nenu saitam prapanchaagniki
Samidhanokkati aahuticchaanu

Agninetra mahogra jwaala
Daachinaa o rudrudaa 
Agnishikhalanu gundelona
Anachinaa o sooryudaa 

Parashvadhamunu chetaboonina
Parashuraamuni amshavaa 
Himsananachaga dhvamsa rachanalu
Chesina aachaaryudaa 

Mannem veerudu raamaraaju
Dhanushtankaaraanivaa 
Bhagat singh kada saari palikina
Inkvilaab shabdaanivaa 

Akramaalanu kaalaraasina
Ukku paadam neediraa 
Lanchagondula gundelo
Nidurinchu simham neevuraa 

Dharmadevata needalo payaninchu
Yaatre neediraa
Kanulu gappina nyaayadevata
Kanti choopainaavuraa 

Satyameva jagatiki
Niluvettu saakshyam neevuraa 
Lakshlaadi prajala
Aashaa jyotivai nilichaavuraa

Nenu saitam prapanchaagniki
Samidhanokkati aahuticchaanu 
Nenu saitam vishvavrushtiki
Ashruvokkati dhaaraposaanu 

Nenu saitam bhuvanaghoshaku
Verri gontuka vicchi mrosaanuu 
Nenu saitam prapanchaagniki
Samidhanokkati aahuticchaanu

Community

Like, share, and discuss

to start a discussion.