Back to Lyrics
Tagore

Tagore

2003 · 6 songs

Telugu

చిన్నగ  చిన్నగ  చిన్నగ
మది  కన్నులు  విప్పిన  కన్నెగ

నీ  మగసిరికే  వేస్తా  నా  ఓటు  
నా  సొగసిరితో  వేస్తా  ఆ  ఓటు 

మెల్లగ  మెల్లగ  మెల్లగ   
మరు  మల్లెల  మబ్బుల  జల్లుగ  

ముని  మాపులలో  వేసేయ్  నీ  ఓటు   
ముసి  నవ్వులతో  వేసేయ్  ఆ  ఓటు  

నా  ప్రేమదేశాన్ని  ప్రతి  రోజు  పాలించే  
నా  రాణీ  వాసాన్ని  రేపగలు  రక్షించే  
నీ  గుండెలకే  వేస్తా  నా  ఓటు  
గుడి  హారతినై  వేస్తా  ఆ  ఓటు 

చిన్నగ  చిన్నగ  చిన్నగ  
మది  కన్నులు  విప్పిన  కన్నెగ   

నీ  మగసిరికే  వేస్తా  నా  ఓటు  
నా  సొగసిరితో  వేస్తా  ఆ  ఓటు

అనుకోకుండా  వచ్చి  తనిఖీ  చేయాలి 
అందాలలో  నువ్వే  మునకే  వేయాలి 
అధికారాన్నే  ఇచ్చి  కునుకే  మారాలి 
అవకాశాన్నే  చూసి  ఇరుకై  పోవాలి 

ఎద  సభలో  ఎన్నో  ఎన్నో  ఊసులు  చెప్పాలి 
రసమయ  సభలో  చెప్పినవన్నీ  చేసుకుపోవాలి 
ప్రతి  పక్షం  నువ్వై  ఉండి  హద్దులు  పెట్టాలి 
ఆ  రతి  పక్షం  నేనై  ఉండి  యుద్ధం  చేయాలి 

నా  వలపు  కిరీటం  తలపైనే  ధరించు 
నీ  చిలిపి  ప్రతాపం  నిలువెల్లా  చూపించు 

నీ  చెనుకులకే  వేస్తా  నా  ఓటు 
నా  చెమటలతో  వేస్తా  ఆ  ఓటు 

చిన్నగ  చిన్నగ  చిన్నగ  
మది  కన్నులు  విప్పిన  కన్నెగ   

నీ  మగసిరికే  వేస్తా  నా  ఓటు  
నా  సొగసిరితో  వేస్తా  ఆ  ఓటు

నా  సుకుమారం  నీకు  సింహాసనంగా 
నా  కౌగిళ్ళే  నీకు  కార్యాలయంగా
నీ  నయగారం  నాకో  ధనాగారంగా 
ఈ  సరసాలే  ఇంకో  సామ్రాజ్యమవగా

సమయానికి  కళ్లెం  వేసే  కాలం  వచ్చింది 
ఆ  స్వర్గానికి  గొళ్ళెం  తీసే  మార్గం  తెలిసింది 
కామునికే  మైకం  కమ్మే  యాగం  జరిగింది 
గోపాలునికే  పాఠం  చెప్పే  యోగం  దక్కింది 

ఆ  పాల  పుంతనే  వలవేసి  వరించే 
ఈ  పూల  పుంతలో  పులకింతలు  పుట్టించే 

నీ  రసికతకే  వేస్తా  నా  ఓటు 
నా  అలసటతో  వేస్తా  ఆ  ఓటు 

చిన్నగ  చిన్నగ  చిన్నగ  
మది  కన్నులు  విప్పిన  కన్నెగ 

నీ  మగసిరికే  వేస్తా  నా  ఓటు  
నా  సొగసిరితో  వేస్తా  ఆ  ఓటు

మెల్లగ  మెల్లగ  మెల్లగ   
మరు  మల్లెల  మబ్బుల  జల్లుగ  

ముని  మాపులలో  వేసేయ్  నీ  ఓటు   
ముసి  నవ్వులతో  వేసేయ్  ఆ  ఓటు

English

Chinnaga chinnaga chinnaga 
Madhi kannulu vippina kannega

Nee magasirike
Vestaa naa votu 
Naa sogasirito
Vestaa Aa Votu 

Mellaga mellaga mellaga 
Maru mallela mabbula jallugaa 

Muni maapulalo
Vesey nee votu 
Musi navvulato
Vesey aa votu 

Naa premadeshanni
Prati roju paalinche 
Naa raani vaasaanni
Repagalu rakshinche 

Nee gundelake
Vestaa naa votu 
Gudi haaratinai
Vestaa aa votu 

Chinnaga chinnaga chinnaga 
Madhi kannulu vippina kannegaa 

Nee magasirike
Vestaa naa votu 
Naa sogasirito
Vestaa aa votu

Anukokundaa vacchi
Taniki cheyyaali
Andaalalo nuvve
Munake veyyaali

Adhikaaraanne icchi
Kunuke maaraali
Avakaashaanne choosi
Irukai povaali

Yeda sabhalo enno enno
Oosulu cheppaali
Rasamaya sabhalo
Chepinavanni chesukupovali

Prati paksham nuvvai undi
Haddulu pettaali
Aa rati paksham nenai undi
Yuddam cheyaali

Naa valapu kireetam
Talapaine dharinchu
Nee chilipi prataapam
Niluvellaa choopinchu

Nee chenukulake
Vestaa naa votu
Naa chematalato
Vestaa aa votu

Chinnaga chinnaga chinnaga 
Madhi kannulu vippina kannegaa 

Nee magasirike
Vestaa naa votu 
Naa sogasirito
Vestaa aa votu

Naa sukumaaram
Neeku simhaasanamgaa
Naa kougille
Neeku kaaryalayamgaa

Nee nayagaaram
Naako dhanaagaaramgaa
Ee sarasaale
Inko saamraajyamavagaa

Samayaaniki kallem vese
Kaalam vacchindi
Aa swargaaniki gollem teese
Margam telisindi

Kaamunike maikam kamme
Yaagam jarigindi
Gopalunike paatam cheppe
Yogam dakkindi

Aa paala puntane
Valavesi varinche
Ee poola puntalo
Pulakintalu puttinche

Nee rasikatake
Vestaa naa votu
Naa alasatato
Vestaa aa votu

Chinnaga chinnaga chinnaga 
Madhi kannulu vippina kannegaa 

Nee magasirike
Vestaa naa votu 
Naa sogasirito
Vestaa aa votu 

Mellaga mellaga mellaga 
Maru mallela mabbula jallugaa 

Muni maapulalo
Vesey nee votu 
Musi navvulato
Vesey aa votu

Community

Like, share, and discuss

to start a discussion.