Back to Lyrics
Suswagatham

Suswagatham

1998 · 5 songs

Telugu

సుస్వాగతం  నవరాగమ  పలికిందిలే  ఎద  సరిగమ 
ప్రియా  దరహాసమా  ప్రేమ  ఇతిహాసమా 
నీ  తోలి  స్పర్శలో  ఇంత  సుఖ  మైకమ 
ఇది  ప్రణయాలు  చిగురించు  శుభతరుణమా 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 

పిందల్లే  రాలె  పువ్వ  చిన్నిచిన్ని  నవ్వులివ్వ 
నీకోసం  ప్రాణం  పెట్టె  చిన్నవాడి  చేరువ
సుస్వాగతం  నవరాగమ 

అంతెలేని  వేగంతోనే  ప్రేమే  వస్తుంటే 
నేను  ఆనకట్ట  వేయలేని  ఆహ్వానిస్తుంటే 
పట్టే  తప్పే  విరహంలోని  మునిగి  పోతుంటే 
ఇంకా  క్షేమంగానే  జీవిస్తా  నీ  చేయందిస్తుంటే
 
ఆ  చేతులే  నీకు  పూలదండగా  మెడలోన  వేసి  నీ  జత  చేరగా 
నా  చూపు  సూత్రంగా  ముడిపడగా  నాజూకు  చిత్రాల  రాజ్యమేలాగా 
మౌనమే  మాని  గానమై  పలికే  నా  భావన 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 

శిలలాంటి  గుండె  కాస్త  శిల్పమల్లె  మారిపోయే 
చిత్రాల  ప్రేమ  దాచే  సంధ్యవేళ  వేళలో 
సుస్వాగతం  నవరాగమ 

సూరీడున్నాడమ్మా  నిన్నే  చూపడానికి 
రేయి  ఉన్నదమ్మా  కలలో  నిన్నే  చేరడానికి 
మాట  మనసు  సిద్ధం  నీకే  ఇవ్వడానికి 
నా  కళ్ళు  పెదవి  ఉన్నాయ్  నీతో  నవ్వడానికి 

ఏనాడూ  చూశాను  రూపురేఖలు  ఆనాడే  రాశాను  చూపులేఖలూ 
ఏరోజు  లేదమ్మా  ఇన్ని  వింతలూ  ఈవేళ  నా  ముందు  ప్రేమ  పుంతలు 
ఏడూ  వింతలను  మించే  వింత  మన  ప్రేమే  సుమ 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 
ఆ  ఆ  ఆ  పనిసగా  నినిస 

వచ్చింది  పూల  మాసం  చిన్న  వాడి  ప్రేమకోసం 
అందాల  నీలాకాశం  అందచందా  సంబరం 

సుస్వాగతం  నవరాగమ  పలికిందిలే  ఎద  సరిగమ 
ప్రియా  దరహాసమా  ప్రేమ  ఇతిహాసమా 
నీ  తోలి  స్పర్శలో  ఇంత  సుఖ  మైకమ 
ఇది  ప్రణయాలు  చిగురించు  శుభతరుణమా
సుస్వాగతం  నవరాగమ

English

Suswagatam navaragama palikindile yeda sarigama
priya darahaasama prema itihaasama
nee toli sparshalo inta sukha maikama
idi pranayalu chigurinchu shubhatarunama
a a a panisaga ninisa
a a a panisaga ninisa

Pindalle rale puvv chinnichinni navvulivva
neekosam pranam pette chinnavadi cherava
susvagatam navaragama

Antaeleni vegamtone preme vastunte
nenu aanakatta veyalene ahvanistunte
patte tappe virahamlone munigi potunte
inka kshemangane jeevista nee cheyamdistunte

A chetule neeku pooladandaga medalona vese nee jata cheraga
na choopu sukhanga mudipadaga naajooku chitrala rajyamelaga
mouname mani ganamai palike na bhavana
a a a panisaga ninisa
a a a panisaga ninisa

Shilalanti gundae kaasta shilpamalle maaripoye
chitrala prema dache sandhyavela velalo
susvagatam navaragama

Sooreedunnadamma ninne choopadaniki
reyi unnadamma kalalo ninne cheradaniki
mata manasu siddham neeke ivvadaniki
na kallu pedavi unnay neeto navvadaniki

Yenadu chooshaanu roopurekhalu aanaade rashaanu choopulekhaloo
eroju ledamma inni vintalu eevela na mundhu prema puntalu
edu vintalanu minche vinta mana preme suma
a a a panisaga ninisa
a a a panisaga ninisa

Vachhindi poola masam chinna vadi premakosam
andaala neelaakaasam andachanda sambaram

Suswagatam navaragama palikindile yeda sarigama
priya darahaasama prema itihaasama
nee toli sparshalo inta sukha maikama
idi pranayalu chigurinchu shubhatarunama
susvagatam navaragama

Community

Like, share, and discuss

to start a discussion.