Back to Lyrics
Suswagatham

Suswagatham

1998 · 5 songs

Telugu

ఆలయాన  హారతిలో  ఆఖరి  చితి  మంటలలో 
రెండిటిలో  నిజానికున్నది  ఒకటే  అగ్నిగుణం 
ప్రేమ  అనే  పదాన  ఉన్నది  ఆరని  అగ్నికణం 
దీపాన్ని  చూపెడుతుందో  తాపన  బలిపెడుతుందో 
అమృతమో  హాలాహలమో  ఏమో  ప్రేమ  గుణం 
ఏ  క్షణాన  ఎలాగ  మారునో  ప్రేమించే  హృదయం 

ఆలయాన  హారతిలో  ఆఖరి  చితి  మంటలలో 
రెండిటిలో  నిజానికున్నది  ఒకటే  అగ్నిగుణం 

ఎండమావిలో  ఎంత  వెతికినా  నీటి  చెమ్మ  దొరికేనా 
గుండె  బావిలో  ఉన్న  ఆశ  తడి  ఆవిరి  అవుతున్నా 
ప్రపంచాన్ని  మరిపించేలా  మంత్రించే  ఓ  ప్రేమా 
ఎలా  నిన్ను  కనిపెట్టాలో  ఆచూకీ  ఇవ్వమ్మా 

నీ  జాడ  తెలియని  ప్రాణం  చేస్తోంది  గగన  ప్రయాణం 
యాదర  ఉండి  నడిరేయన్నది  ఈ  సంధ్యా  సమయం 
ఏ  క్షణాన  ఎలాగ  మారునో  ప్రేమించే  హృదయం 
ఆలయాన  హారతిలో  ఆఖరి  చితి  మంటలలో 
రెండిటిలో  నిజానికున్నది  ఒకటే  అగ్నిగుణం

సూర్యబింబమే  అస్తమించనిదే  మేలుకొని  కల  కోసం 
కళ్ళు  మూసుకొని  కలవరించెనే  కంటిపాప  పాపం 
ఆయువిచ్చి  పెంచిన  బంధం  మౌనంలో  మసి  అయినా 
రేయిచాటు  స్వప్నం  కోసం  ఆలాపన  ఆగేనా  

పొందేది  ఏదేమైనా  పోయింది  తిరిగొచ్చేనా 
కంటిపాప  కల  అడిగిందని  నిదురించెను  నయనం 
ఏ  క్షణాన  ఎలాగ  మారునో  ప్రేమించే  హృదయం 

ఆలయాన  హారతిలో  ఆఖరి  చితి  మంటలలో 
రెండిటిలో  నిజానికున్నది  ఒకటే  అగ్నిగుణం 
ప్రేమ  అనే  పదాన  ఉన్నది  ఆరని  అగ్నికణం 
దీపాన్ని  చూపెడుతుందో  తాపన  బలిపెడుతుందో 
అమృతమో  హాలాహలమో  ఏమో  ప్రేమ  గుణం 
ఏ  క్షణాన  ఎలాగ  మారినో  ప్రేమించే  హృదయం 

ఆలయాన  హారతిలో  ఆఖరి  చితి  మంటలలో 
రెండిటిలో  నిజానికున్నది  ఒకటే  అగ్నిగుణం

English

Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Prema ane padaana unnadi aarani agnikanam
Deepaanni choopedutundo taapaana balipedutundo
Amrutamo haalaahalamo emo prema gunam
E kshanaana elaaga maaruno preminche hrudayam

Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam

Endamaavilo enta vetikinaa neeti chemma dorikenaa
Gunde baavilo unna aasa tadi aaviri avutunnaa
Prapanchaanni maripinchela mantrinche o premaa
Elaa ninnu kanipettaalo aachookee ivvammaa

Nee jaada teliyani praanam chestondi gagana prayaanam
Yadara undi nadireyannadi ee sandhyaa samayam
E kshanaana elaaga maaruno preminche hrudayam
Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam

Sooryabinbame astaminchanide melukoni kala kosam
Kallu moosukoni kalavarinchene kantipaapa paapam
Aayuvicchi penchina bandham mounamlo masi ayinaa
Reyichaatu swapnam kosam aalaapana aagenaa

Pondedi edemainaa poyindi tirigocchenaa
Kantipaapa kala adigindani nidurinchenu nayanam
E kshanaana elaaga maaruno preminche hrudayam

Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Prema ane padaana unnadi aarani agnikanam
Deepaanni choopedutundo taapaana balipedutundo
Amrutamo haalaahalamo emo prema gunam
E kshanaana elaaga maaruno preminche hrudayam

Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam

Community

Like, share, and discuss

to start a discussion.