Back to Lyrics
Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 · 7 songs

Telugu

వేకువ  లోన  గోదారి  ఎరుపెక్కింది  
ఆ  ఎరుపేమో  గోరింట  పంటయ్యింది  
వేకువ  లోన  గోదారి  ఎరుపెక్కింది  
ఆ  ఎరుపేమో  గోరింట  పంటయ్యింది  

పండిన  చేతికెన్నో  సిగ్గులొచ్చి  
ఆహ  సిగ్గన్త  చీర  గట్టింది  
చీర  లో  చందమామ  ఎవ్వరమ్మా  ఆ  గుమ్మా  సీతమ్మా  

సీతమ్మ  వాకిట్లో  సిరిమల్లె  చెట్టు  
సిరిమల్లె  చెట్టేమో  విరగబూసింది  
కొమ్మ  కదలకుండా  కొయ్యండి  పూలు  
కోసినవణ్ణి  సీత  కొప్పు  చుట్టండి  
కొప్పున  పూలు  గుప్పె  డెందుకండి      
కోదండ  రామయ్య  వస్తున్నాడండి    
రాణే  వచ్చాడోయమ్మా  ఆ  రామయ్య  
వస్తూ  చేశాడమ్మా  ఎదో  మాయ  
రాణే  వచ్చాడోయమ్మా  ఆ  రామయ్య  
వస్తూ  చేశాడమ్మా  ఎదో  మాయ  

సీతకి  రాముడే  సొంతమయే  చోటిది  
నెలతో  ఆకాశం  వియ్యమొందే  వెలిది  
మూడు  ముళ్ళు  వేస్తే  మూడు  లోకాలకి  ముచ్చటచేనమ్మా  ఊఊ    
ఏడు  అంగలేస్తే  ఏడు  జన్మలకి  వీడదీసిందమ్మా 
 
సీతమ్మ  వాకిట్లో  సిరిమల్లె  చేట్టు    
సిరిమల్లె  చెట్టు  పై  చిలక  వాలింది  
చిలకమ్మా  ముద్దు  గ  చెప్పిందో  మాట  
ఆ  మాట  విన్న  మా  రామ  అంటుంది  
రామ  రామ  అన్నది  ఆ  సీత  గుండె  
అన్ననాడే  ఆమెకి  మొగుడయ్యాడే  

చేతిలో  చేతులే  చేరుకుంటే  సంబరం  
చూపులో  చూపులే  లీనమైతే  సుందరం  
జంట  బాగుందంటూ  గొంతు  విప్పాయంట  చుట్టూ  చెట్టు  చేమ  
పంట  పండిందంటూ  పొంగిపోయిందమ్మా  ఇదిగో  ఈ  సీతమ్మ

English

Yekuva Lona godari erupekkindi
a erupemo gorinta pantayyindi
Yekuva Lona godari erupekkindi
a erupemo gorinta pantayyindi

Pandina chethikenno siggulochi
aaha siggantha cheera gattindi
cheera lo chandamama evvaramma aa gumma seetammaa

Seethamma vakitlo sirimalle chettu
Sirimalle chettemo viragabusindhi
Komma kadalakunda koyyandi poolu
Kosinavaanni seetha koppu chuttandi
Koppuna poolu guppe thenthukandi
Kodanda ramayya vasthunnadhandi
Rane vachadoyamma aa ramayya
Vasthu chesadamma edo maaya
Rane vachadoyamma aa ramayya
Vasthu chesadamma edo maaya

Seetaki Ramude Sonthamaye chotidi
nelatho aakasam viyyamonde velidi
mudu mullu vesthe moodu lokalaki muchatochenamma oooo  
yedu angalesthe yedu janmalaki veedadisindamma

Seetamma Vakitlo sirimalle cheetu
sirimalle chettu pai chilaka valindi
chilakamma muddhu ga cheppindo mata
aa mata vinna ma raama antundi
raama raama annadi aa seethe gunde
annanade aameki mogudayyade

Chethilo chethule cherukunte sambaram
chupulo chupule leenamaithe sundaram
janta bagundantu gonthu vippayanta chuttu chettu chema
panta pandindantu pongipoindamma idigo ee seetamma

Community

Like, share, and discuss

to start a discussion.