Back to Lyrics
Raja

Raja

1999 · 6 songs

Telugu

కన్నుల  లోగిలిలో  వెన్నెల  విరిసింది   
చల్లని  జాబిలితో  స్నేహం  కుదిరింది   
చెలిమి  తోడుంటే  చాలమ్మ  లేనిది  ఏముంది    
ఆశ  చిటికేస్తే  చాలమ్మ  అందనిదేముంది  

కన్నుల  లోగిలిలో  వెన్నెల  విరిసింది   
చల్లని  జాబిలితో  స్నేహం  కుదిరింది

గున్నమావి  గొంతులో  తేనె  తీపి  నింపుతూ  కోయిలమ్మ  చేరుకున్నది  
ఎండమావి  దారిలో  పంచదార  వాగుల  కొత్త  పాట  సాగుతున్నది 
ఒంటరైన  గుండెల్లో  ఆనందాల  అందెలతో  ఆడే  సందడిది   
అల్లిబిల్లి  కాంతులతో  ఏకాంతల  చీకటిని  తరిమే  బంధమిది 
  
కలతేరగని  కళలను  చూడు  కంటికి  కావలి  నేనుంటా    
కలతరగని  వెలుగులు  నేడు  ఇంటికి  తోరణమనుకుంటా  
కన్నుల  లోగిలిలో  వెన్నెల  విరిసింది   
చల్లని  జాబిలితో  స్నేహం  కుదిరింది

పంచుకున్న  ఊసులు  పెంచుకున్న  ఆశలు  తుళ్ళి  తుళ్ళి  ఆడుతున్నవి   
కంచె  లేని  ఊహలే  పంచ  వన్నె  గువ్వలై  నింగి  అంచు  తాకుతున్నవి  
కొత్త  జల్లు  కురిసింది  బ్రతుకే  చిగురు  తొడిగేలా  వరమై  ఈ  వేళా  
వానవిల్లు  విరిసింది  మిన్ను  మన్ను  కలిసేలా  ఎగసే  ఈ  వేళా  
 
అణువణువును  తడిపిన  ఈ  తడి  అమృతవర్షిణి  అనుకొన్నా  
అడుగడుగునా  పచ్చని  బాటను  పరిచిన  వనమును  చూస్తున్న   

కన్నుల  లోగిలిలో  వెన్నెల  విరిసింది   
చల్లని  జాబిలితో  స్నేహం  కుదిరింది
చెలిమి  తోడుంటే  చాలమ్మ  లేనిది  ఏముంది    
ఆశ  చిటికేస్తే  చాలమ్మ  అందనిదేముంది

English

Kannula Logililo Vennela Virisindi 
Challani Jaabilitho Sneham Kudirindi 
Chelimi Thodunte Chaalamma Lenidi Emundi 
Aasa Chitikesthe Chaalamma Andanidemundi 

Kannula Logililo Vennela Virisindi 
Challani Jaabilitho Sneham Kudirindi

Gunnamaavi Gonthulo Thene Theepi Nimputhu Koyilamma Cherukunnadi 
Endamaavi Daarilo Panchadaara Vaagula Kotha Paata Saaguthunnadi 
Vontaraina Gundello Aanandala Andhelatho Aade Sandadidi 
Allibilli Kaanthulatho Yekaanthala Cheekatini Tharime Bandhamidi 

Kalatheragani Kalalanu Choodu Kantiki Kaavali Nenuta 
Kalatharagani Velugulu Nedu Intiki Thoranamanukunta 
Kannula Logililo Vennela Virisindi 
Challani Jaabilitho Sneham Kudirindi

Panchukunna Oosulu Penchukunna Aasalu Thulli Thulli Aaduthunnavi 
Kanche Leni Oohale Pancha Vanne Guvvalai Ningi Anchu Thaakuthunnavi 
Kottha Jallu Kurisindi Brathuke Chiguru Thodigela Varamai Ee Vela 
Vaanavillu Virisindi Minnu Mannu Kalisela Egase Ee Vela 

Anuvanuvunu Thadipina Ee Thadi Amruthavarshini Anukona 
Adugaduguna Pachani Baatanu Parichina Vanamunu Choosthunna 

Kannula Logililo Vennela Virisindi 
Challani Jaabilitho Sneham Kudirindi 
Chelimi Thodunte Chaalamma Lenidi Emundi 
Aasa Chitikesthe Chaalamma Andanidemundi

Community

Like, share, and discuss

to start a discussion.