Back to Lyrics
Raja

Raja

1999 · 6 songs

Telugu

ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా   
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా  
నా  చూపుల  దారులలో  చిరుదివ్వెలు  వెలిగేలా     
నా  ఊపిరి  ఊయలలో  చిరు  నవ్వులు  చిలికేలా  

జ్ఞాపకాలే  మైమరపు  జ్ఞాపకాలే  మేల్కొలుపు  
జ్ఞాపకాలే  నిట్టూర్పు  జ్ఞాపకాలే  ఓదార్పు
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా   

అమ్మా  అని  పిలిచే  తొలి  పలుకులు  జ్ఞాపకమే   
రా  అమ్మా  అని  అమ్మే  లాలించిన  జ్ఞాపకమే  
అమ్మ  కళ్ళలో  అపుడపుడు  చెమరింతలు  జ్ఞాపకమే
అమ్మ  చీరనే  చుట్టే  పాప  జ్ఞాపకం   
అమ్మ  నవ్వితే  పుట్టే  సిగ్గు  జ్ఞాపకం 
 
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా   

గుళ్లో  కథ  వింటూ  నిదురించిన  జ్ఞాపకమే   
బళ్ళో  చదువెంతో  బెదిరించిన  జ్ఞాపకమే  
గవ్వలు  ఎన్నో  సంపాదించిన  గర్వం  జ్ఞాపకమే  
నెమలి  కళ్ళనే  దాచే  చోటు  జ్ఞాపకం  
జామపళ్లనే  దోచే  తోట  జ్ఞాపకం  

ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా   
నా  చూపుల  దారులలో  చిరుదివ్వెలు  వెలిగేలా     
నా  ఊపిరి  ఊయలలో  చిరు  నవ్వులు  చిలికేలా  

జ్ఞాపకాలే  మైమరపు  జ్ఞాపకాలే  మేల్కొలుపు  
జ్ఞాపకాలే  నిట్టూర్పు  జ్ఞాపకాలే  ఓదార్పు 
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా   
నాలో  నిదురించే  గతమంతా  కదిలేలా

English

Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa 
Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa 
Naa Choopula Daarulalo Chirudivvelu Veligelaa 
Naa Oopiri Ooyalalo Chiru Navvulu Chilikelaa

Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu 
Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu
Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa

Ammaa Ani Piliche Tholi Palukulu Gnaapakame 
Raa Ammaa Ani Amme Laalinchina Gnaapakame 
Amma Kallalo Apudapudu Chemarinthalu Gnaapakame 
Amma Cheerane Chutte Paapa Gnaapakam 
Amma Navvithe Putte Siggu Gnaapakam 

Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa

Gullo Kadha Vintu Nidurinchina Gnaapakame 
Ballo Chaduventho Bedirinchina Gnaapakame 
Gavvalu Enno Sampaadinchina Garvam Gnaapakame
Nemali Kallane Daache Chotu Gnaapakam 
Jaamapallane Doche Thota Gnaapakam 

Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa  
Naa Choopula Daarulalo Chirudivvelu Veligelaa 
Naa Oopiri Ooyalalo Chiru Navvulu Chilikelaa 

Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu 
Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu
Edo Oka Raagam Pilichindi Vela 
Naalo Nidurinche Gathamantha Kadilelaa

Community

Like, share, and discuss

to start a discussion.