Back to Lyrics
Pelli

Pelli

1997 · 6 songs

Telugu

అనురాగమే  మంత్రంగా 
అనుబంధమే  సూత్రంగా 
మమతా  కొలువులో  జరుగు  పెళ్ళికి 
మంగళ  వాయిద్యం  పలికింది  ఆహ్వానం
మంగళ  వాయిద్యం  పలికింది  ఆహ్వానం
అనురాగమే  మంత్రంగా 

మూడు  ముళ్లతోనే  పెళ్లి  పూర్తి  కాదు  అని 
మరో  మూడీగా  చేరుకున్న  స్నెహ  బంధమిది 
సప్తపదితో  ఆగరాదు  జీవితం  అని 
అష్టపదిగా  సగమన్న  ప్రాయమా  పదము  ఇది 

నాతిచరామి  మంత్రములో  అర్ధం  తెలిసిన  నేస్తముతో 
అడుగు  కలుపుతూ  వెలుగు  వెతుకుతూ  సాగే  సమయమిది 
ఆగని  పయనమిది 

అనురాగమే  మంత్రంగా 
మమతా  కొలువులో  జరుగు  పెళ్ళికి 
మంగళ  వాయిద్యం  పలికింది  ఆహ్వానం
అనురాగమే  మంత్రంగా 

ఆడదంటె  ఆడదానికి  శత్రువు  కాదు  అని 
అత్తా  గుండెలోన  కూడా  అమ్మ  వున్నదనీ
బొమ్మలాటలాడుతున్న  బ్రహ్మ  రాతలనీ 
మార్చి  రాసి  చూపుతున్న  మానవత్వమిది 

చరితాలు  చదవని  తోలి  కధగా 
మనసులు  ముడి  పడు  మనుగడగా 
తరతరాలకు  నిలిచిపొమ్మని  తల్లిగా  దీవించే 
చల్లని  తరుణమిది 

అనురాగమే  మంత్రంగా 
అనుబంధమే  సూత్రంగా 
మమతా  కొలువులో  జరుగు  పెళ్ళికి 
మంగళ  వాయిద్యం  పలికింది  ఆహ్వానం

English

Anuraagamae mamtramgaa
anubamdhamae sootramgaa
mamata koluvulo jarugu pelliki
mangala vaayidyam palikimdi aahvaanam
mangala vaayidyam palikimdi aahvaanam
Anuraagamae mamtramgaa

Moodu mullatonae pelli poorti kaadu ani
maro mudiga chaerukunna snaeha bamdhamidi
saptapadito aagaraadu jeevitam ani
ashtapadigaa sagamanna praema padamu idi

Naaticharaami mamtramulo ardham telisina naestamuto
adugu kaluputoo velugu vetukutoo saagae samayamidi
aagani payanamidi
Anuraagamae mamtramgaa

Aadadamtae aadadaaniki satruvu kaadu ani
atta gumdelona koodaa amma vunnadani
bommalaatalaadutunna brahma raatalani
maarchi raasi chooputunna maanavatvamidi

Charitalu chadavani toli kadhagaa
manasulu mudi padu manugadagaa
tarataraalaku nilichipommani talliga deevimchae
challani tarunamidi

Anuraagamae mamtramgaa
anubamdhamae sootramgaa
mamata koluvulo jarugu pelliki
mangala vaayidyam palikimdi aahvaanam

Community

Like, share, and discuss

to start a discussion.