Back to Lyrics

Nuvvu Naku Nacchav

2001 · 6 songs

Telugu

ఆ  నీలి  గగనాన  మెరిసేటి  ఓ  దివ్యతార
ఎన్నెన్ని  జన్మాలు  వేచాను  నే  నిన్ను  చేరా
ఏనాటి  స్వప్నం  నీ  దివ్య  రూపం    
శతకోటి  రాగాలు  రవళించె  నా  గుండెలోనా
ఓ  ప్రియతమా  ఇది  నిజమా
ఈ  పరిచయం  ఒక  వరమా
ఇది  మనసు  పడిన  విరహ  వేదనా  
తొలి  ప్రేమలోని  మధుర  భావనా  

ఏ  ముత్యము  ఏ  మబ్బులో  దాగున్నదో  తెలిసేదెలా
ఏ  స్నేహము  అనుబంధమై  ఒడిచేరునో  తెలిపేదెలా
నా  గుండె  పొదరింట  నీ  కళ్ళు  వాలాక  ఏ  ఆశ  చిగురించెనో
వెచ్చని  నీ  శ్వాస  నా  మేను  తడిమాక  ఏ  ఊహ  శృతిమించెనో
ఎన్ని  జన్మాల  బంధాలు  శ్రీ  పారిజాతాలై  వీచాయో  చెప్పేదెలా
ఎన్ని  నయనాలు  నా  వంక  ఎర్రంగ  చూసాయొ  ఆ  గుట్టు  విప్పేదెలా
ఓ  ప్రియతమ  దయగనుమా
నీ  చూపే  చాలు  చంద్రకిరణమా
నా  జన్మ  ధన్యమవును  ప్రాణమా  

చివురాకుల  పొత్తిలిలో  వికసించిన  సిరిమల్లెవో
చిరుగాలితో  సెలయేటిపై  నర్తించిన  నెలవంకవో
నవ్వేమో  నాజూకు  నడుమేమో  పూరేకు  నీ  అందమేమందునే
పలుకేమో  రాచిలుక  నడకేమొ  రాయంచ  ఒళ్ళంతా  వయ్యారమే
నీ  నామాన్నే  శృంగార  వేదంగ  భావించి  జపిస్తున్నానే  చెలి  
నీ  పాదలే  నా  ప్రేమ  సౌధాలుగా  ఎంచి  పూజించనా  నెచ్చెలి
ఓ  ప్రియతమ  అవుననుమ
కనలేవ  ప్రియుని  హృదయవేదనా
కరుణించు  నాకు  వలపు  దీవెనా  

ఆ  నీలి  గగనాన  మెరిసేటి  ఓ  దివ్యతార
ఎన్నెన్ని  జన్మాలు  వేచాను  నే  నిన్ను  చేరా
ఏనాటి  స్వప్నం  నీ  దివ్య  రూపం    
శతకోటి  రాగాలు  రవళించె  నా  గుండెలోనా

English

Aa neeli gaganaana meriseti oo divyataara
Enneni janmaalu vechanu ne ninnu chera
enaati swapnam nee divya roopam  
Sathakoti raagaalu ravalinche naa gundelonaa
Oo priyatamaa idhi nijama
Ee parichayam oka varama
Idhi manasu padina viraha vedanaa 
Tholi premaloni madhura bhavanaa 

ye muthyamu ee mabbulo dhaagunnadho telisedhela
ye snehamu anubhandamai vodicheruno telipedhela
Naa gunde podarinta neekallu vaalaka ee aasa chigurincheno
Vechani nee swasa naa menu thadimaaka ye uha sruthimincheno
Enni janmaala bhaandaalu sree praarijaatalai vichayo cheppedela
Enni nayanaalu naa vanka erranga choosayo aa guttu vippedela
Oo piryatama dayaganumaa
Nee choope chaalu chandrakiranamaa
Naa janma dhanyamavunu pranamaaaa 

Chivuraakula pothilallo vikasinchina sirimallevo
Chirugaalitho selyetipai narthinchina nelavankavo
Navvemo naajukuu nadumemo pooreku nee andame mandunee
Palukemo raa chiluka nadakemo raayancha ollantaa vayyarame
Nee naamanney srungaara vedanga bhaavinchi japiistunaney cheli 
Nee paadale naa premasoudaalugaa enchi poojinchanaa necheli
Oo priyatama oounanumaa
kanaleva priyuni hrudayavedana
Karuninchu naaku valapu deevenaa 

Aa neeli gaganaana meriseti oo divyataara
Enneni janmaalu vechanu ne ninnu chera
enaati swapnam nee divya roopam  
Sathakoti raagaalu ravalinche naa gundelonaa

Community

Like, share, and discuss

to start a discussion.