Back to Lyrics

Nuvvu Naku Nacchav

2001 · 6 songs

Telugu

ఆకాశం  దిగి  వచ్చి  మబ్బులతో  వెయ్యాలి  మన  పందిరి  

ఆకాశం  దిగి  వచ్చి  మబ్బులతో  వెయ్యాలి  మన  పందిరి  
ఊరంతా  చెప్పుకునే  ముచ్చటగా  జరగాలి  పెళ్ళంటే  మరి  
చెరి  సగమని  మనసులు  కలుపుతూ  తెర  తెరిచిన  తరుణం  
ఇదివరకెరుగని  వరసలు  కలుపుతూ  మురిసిన  బంధుజనం
మా  యిళ్ళ  లేత  మావిళ్ళ  తోరణాలన్నీ  పెళ్లి  శుభలేఖలే  
అక్షింతలేసి  ఆశీర్వదించమను  పిలుపులైనవి  గాలులే  
ఆకాశం  దిగి  వచ్చి  మబ్బులతో  వెయ్యాలి  మన  పందిరి  

చెంపలో  విరబూసే  అమ్మాయి  సిగ్గు  దొంతరలు
ఆ  సొంపులకు  ఎర  వేసే  అబ్బాయి  చూపు  తొందరలు  
ఏ  వరాలో  ఈ  జవరాలై  జతపడు  సమయంలో  
వానవిల్లే  వధువుగ  మారి  ఒదిగిన  వేడుకలో  
తన  సరసన  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకుల  కలువకు  కానుకగా  
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా  

ఆకాశం  దిగి  వచ్చి  మబ్బులతో  వెయ్యాలి  మన  పందిరి  
ఊరంతా  చెప్పుకునే  ముచ్చటగా  జరగాలి  పెళ్ళంటే  మరి

విన్నవారెవరసలు  సన్నాయి  వారి  సంగతులు  
సనసన్నగా  రుసరుసలు  వియ్యాలవారి  విసవిసలు  
సందు  చూసి  చకచక  ఆడే  జూదశిఖామణులు  
పందిరంతా  ఘుమఘుమలాడే  విందు  సువాసనలు  
తమ  నిగనిగ  నగలను  పదుగురి  ఎదురుగ  ఇదిగిదిగో  అని  చూపెడుతూ
తెగ  తిరిగే  తరుణుల  తికమక  పరుగులు  చూడగా  

ఆకాశం  దిగి  వచ్చి  మబ్బులతో  వెయ్యాలి  మన  పందిరి  
ఊరంతా  చెప్పుకునే  ముచ్చటగా  జరగాలి  పెళ్ళంటే  మరి  
చెరి  సగమని  మనసులు  కలుపుతూ  తెర  తెరిచిన  తరుణం  
ఇదివరకెరుగని  వరసలు  కలుపుతూ  మురిసిన  బంధుజనం
మా  యిళ్ళ  లేత  మావిళ్ళ  తోరణాలన్నీ  పెళ్లి  శుభలేఖలే  
అక్షింతలేసి  ఆశీర్వదించమను  పిలుపులైనవి  గాలులే

English

Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri

Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri
Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari
Cherisagamavamani manasulu kaluputhu 
Thera therichina tharunam
Idi varakeragani varasalu kaluputhu 
Murisina bandhujanam
Maa illaletha maavilla thoranaalanni pelli subhaleKhale
Akshintalesi aaseervadinchamanu pilupulainavi gaalule
Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri

Champalo viraboose ammaayi siggudontharalu
aa sompulaku eravese abbaayi choopu thondaralu
Ye varaalo ee javaraalai jathapadu samayamlo o o 
Vaanaville vadhuvuga maari odigina vedukalo
Thana sarasana virisina sirisiri sogasula 
Kulukala kaluvaku kaanukagaa .
Eda sarasuna egasina alajadi alale taakagaa 

Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri
Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari

Vinna vaarevarasalu sannaayi vaari sangathulu
Sanna sannagaa rusarusalu viyyaalavaari visavisalu
Sandhu choosi chaka chaka aade joodha siKhaamanulu uu uu
Pandiranthaa Ghuma Ghumalaade vindu suvaasanalu
Thama niganiga nagalanu paduguri eduruga 
idigidigo ani choopeduthu
Thega thirige tarunula tikamaka parugulu choodagaa 

Aakaasam digi vacchi mabbulutho veyyaali mana pandiri
Oorantha cheppukune mucchatagaa jaragaali pellante mari
Cherisagamavamani manasulu kaluputhu 
Thera therichina tharunam
Idi varakeragani varasalu kaluputhu 
Murisina bandhujanam
Maa illaletha maavilla thoranaalanni pelli subhaleKhale
Akshintalesi aaseervadinchamanu pilupulainavi gaalule

Community

Like, share, and discuss

to start a discussion.