Back to Lyrics
Neeku Nenu Naaku Nuvvu

Neeku Nenu Naaku Nuvvu

2003 · 4 songs

Lyricist

Telugu

తెలుగు  భాష  తియ్యదనం
తెలుగు  జాతి  గొప్పతనం 
తెలుసుకున్నవాళ్ళకి 
తెలుగే  ఒక  మూలధనం 

తల్లి  తండ్రి  నేర్పినట్టి  మాతృభాషరా 
తెలుగు  మరచిపోతే 
వాళ్లని  నువు  మరచినట్టురా 
ఇది  మరువబోకురా 

తెలుగు  భాష  తియ్యదనం
తెలుగు  జాతి  గొప్పతనం 
తెలుసుకున్నవాళ్ళకి 
తెలుగే  ఒక  మూలధనం 

తల్లి  తండ్రి  నేర్పినట్టి  మాతృభాషరా 
తెలుగు  మరచిపోతే  వాళ్లని
నువు  మరచినట్టురా 
ఇది  మరువబోకురా 

అమ్మ  అన్న  పిలుపులోన
అనురాగం  ధ్వనిస్తుంది 
నాన్న  అన్న  పదములోన
అభిమానం  జనిస్తుంది 

మమ్మీ  డాడీ  లోన
ఆ  మాధుర్యం  ఎక్కడుంది
మామ  అన్న  మాట
మనసు  లోతుల్లో  నిలుస్తుంది 
అత్తా  అంటే  చాలు
మనకు  ఆదరణే  లభిస్తుంది 

ఆంటీ  అంకుల్  లోన
ఆ  ఆప్యాయత  ఎక్కడుంది 

పరభాషా  జ్ఞానాన్ని  సంపాదించు 
పరభాషా  జ్ఞానాన్ని  సంపాదించు 
కాని  నీ  భాషలోనే  నువ్వు  సంభాషించు 

తల్లి  తండ్రి  నేర్పినట్టి  మాతృభాషరా 
తెలుగు  మాట్లాడి  నువ్వు  వాళ్ళ  ఋణం 
తీర్చరా  కొంత  ఋణం  తీర్చరా 

మా  తెలుగు  తల్లికి  మల్లెపూదండ 
మా  కన్న  తల్లికి  మంగళారతులు 

కొమ్మల్లోన  పక్షులన్నీ
తమ  కూతను  మార్చుకోవు 
భూమి  పైన  ప్రాణులన్నీ
తమ  భాషను  మరువలేవు 

మనుషులమై  మన  భాషకు
ముసుగును  తగిలిస్తున్నాము 
ప్రపంచాన  మేధావులు
మన  పలుకులు  మెచ్చినారు 

పొరుగు  రాష్ట్ర  కవులు  కూడ
తెలుగును  తెగ  పొగిడినారు 
ఆంధ్రులమై  మన  భాషకు
అన్యాయం  చేస్తున్నాము 

అభివృద్ధికి  ఉండాలి  నింగే  హద్దు 
అభివృద్ధికి  ఉండాలి  నింగే  హద్దు 
అది  బాషా  ఆచారాలను  మింగెయ్యొద్దు 

తల్లి  తండ్రి  నేర్పినట్టి  మాతృభాషరా 
ఉగ్గు  పాల  భాష  పలికెందుకు  సిగ్గు 
పడకురా  వెనక్కి  తగ్గమాకురా  

తెలుగు  భాష  తియ్యదనం
తెలుగు  జాతి  గొప్పతనం 
తెలుసుకున్నవాళ్ళకి
తెలుగే  ఒక  మూలధనం 

మమ్మీ  డాడీ  అన్న  మాట  మరుద్దామురా 
అమ్మ  నాన్న  అంటు  నేటి  నుండి 
పిలుద్దామురా  ప్రతిజ్ఞ  పూనుదామురా

English

Telugu bhasha tiyyadanam
Telugu jaati goppatanam
Telusukunnavaallaki
Teluge oka muladhanam

Talli tandri
Nerpinatti matrubhashara
Telugu marachipote
Vaallani nuvu marachinattura
Idi maruvabokuraa

Telugu bhasha tiyyadanam
Telugu jaati goppatanam
Telusukunnavaallaki
Teluge oka muladhanam

Talli tandri
Nerpinatti matrubhashara
Telugu marachipote
Vaallani nuvu marachinattura
Idi maruvabokura

Amma anna pilupulona
Anuraagam dhwanistundi
Nanna anna padamulona
Abhimanam janistundi

Mummy daddy lona
Aa madhuryam ekkadundi

Mama anna maata
Manasu lotullo nilustundi
Atta ante chalu
Manaku aadarane labhistundi

Aunty uncle lona
Aa aapyayata ekkadundi

Parabhasha gnananni sampadinchu
Parabhasha gnananni sampadinchu
Kaani nee bhasha lone
Nuvvu sambhashinchu

Talli tandri
Nerpinatti matrubhashara
Telugu matladi
Nuvvu valla runam teerchara
Konta runam teerchara

Maa telugu talliki mallepoodanda
Maa kanna talliki mangalaratulu

Kommallona pakshulanni
Tama kootanu marchukovu
Bhumi paina pranulanni
Tama bhashanu maruvalevu

Manushulamai mana bhashaku
Musugunu tagilistunnamu

Prapanchana medhavulu
Mana palukulu mechinaru
Porugu rashtra kavulu kuda
Telugunu tega pogidinaru

Andhrulamai mana bhashaku
Anyayam chestunnamu

Abhivruddiki undali
Ninge haddu
Abhivruddiki undali
Ninge haddu
Adi basha acharalanu
Mingeyyoddu

Talli tandri
Nerpinatti matrubhashara
Uggu pala bhasha
Palikenduku siggu padakura
Venakki taggamaakura

Telugu bhasha tiyyadanam
Telugu jaati goppatanam
Telusukunnavaallaki
Teluge oka muladhanam

Mummy daddy
Anna maata maruddamura
Amma nanna antu
Neti nundi piluddamura
Pratigna punudaamura

Community

Like, share, and discuss

to start a discussion.