Back to Lyrics

Major Chandrakanth

1993 · 7 songs

Telugu

పుణ్యభూమి  నా  దేశం  నమో  నమామి 
ధన్య  భూమి  నా  దేశం  సదా  స్మరామి 

పుణ్యభూమి  నా  దేశం  నమో  నమామి 
ధన్య  భూమి  నా  దేశం  సదా  స్మరామి 
నన్ను  కన్నా  నా  దేశం  నమో  నమామి 
అన్నపూర్ణ  నా  దేశం  సదా  స్మరామి 
మహామహుల  కన్నా  తల్లి  నా  దేశం 
మహోజ్వలిత  చరిత  కన్నా  భాగ్యోదయదేశం  నా  దేశం
 
పుణ్యభూమి  నా  దేశం  నమో  నమామి 
ధన్య  భూమి  నా  దేశం  సదా  స్మరామి 

అదిగో  ఛత్రపతి  ధ్వజమెత్తిన  ప్రజాపతి 
మతోన్మాద  శక్తులు  చురకత్తులు  ఝళిపిస్తే 
మానవతుల  మాంగల్యం  మంట  గలుపుతుంటే  అఅఅఅఅఅ 
ఆ  క్షుద్ర  రాజకీయానికి  రుద్రనేత్రుడై  లేచి 
మాతృ  భూమి  నుదిటిపై  నెత్తుటి  తిలకం   
దిద్దిన  మహా  వీరుడు  సార్వభౌముడు 

అడుగో  అరి  భయంకరుడు  కట్ట  బ్రాహ్మణా   
అది  వీర  పాండ్య  వంశాంకురా  సింహ  గర్జన 
అడుగో  అరి  భయంకరుడు  కట్ట  బ్రాహ్మణా   
అది  వీర  పాండ్య  వంశాంకురా  సింహ  గర్జన 

ఒరేయ్  ఎందుకు  కట్టాలి  రా  శిస్తు 
నారు  పోసావా  నీరు  పెట్టావా 
కోత  కొసావా  కుప్ప  నూర్చవా 
ఒరేయ్  తెల్ల  కుక్కా  కష్ట  జీవుల  ముష్టి  మెతుకులు    
తిని  బ్రతికే  నీకు  సిస్తేన్దుకు  కట్టాలిరా 
 
అని  పెళ  పెళ  సంకెళ్లు  తెంచి  స్వరాజ్య  పోరాటమెంచి   
ఉరికొయ్యల  ఉగ్గు  పాలు  తాగాడు  
కన్నా  భూమి  ఒడిలోనే  ఒరిగాడు
  
పుణ్యభూమి  నా  దేశం  నమో  నమామి 
ధన్య  భూమి  నా  దేశం  సదా  స్మరామి 
నన్ను  కన్నా  నా  దేశం  నమో  నమామి 
అన్నపూర్ణ  నా  దేశం  సదా  స్మరామి 

అదిగదిగో  అదిగదిగో  ఆకాశం  భళ్ళున  తెల్లారీ   
వస్తున్నాడాదిగో  మన  అగ్గి  పిడుగు  అల్లూరీ   
అగ్గి  పిడుగు  అల్లూరీ   

ఎవడురా  నా  భారత  జాతిని  తత్వమడిగిన  తుచ్చుడు   
ఎవడు  ఎవడా  పొగరు  బట్టినా  తెల్ల  దొరగాడెవ్వడు  
బ్రతుకు  తెరువుకు  దేశమొచ్చి  బానిసలుగా  మమ్ముఁనెంచి   
పన్నులడిగె  కొమ్ములొచించిన  దమ్ములేవాడికి  వచ్చేరా   
బడుగు  జీవులు  భగ్గుమంటే  ఉడుకు  నెత్తురు  ఉప్పెనైతే  
ఆ  చంద్ర  నిప్పుల  తాండ్ర  గొడ్డలి  పన్ను  గడతాది  చూడరా  
 
అన్నా  మన్నెం  దొర  అల్లూరిని  చుట్టూ  ముట్టి  మందీ  మార్బలామెట్టి  
మర  ఫిరంగు  లేక్కు  పెట్టి  వంద  గుళ్ళు  ఒక్కసారి  పీల్చితే  
 
వందే  మాతరం  వందే  మాతరం   
వందే  మాతరం  వందే  మాతరం   
వందే  మాతరం  అన్నది  ఆ  ఆకాశం   
 
ఆజాదూ  హిందూ  ఫొఉజు  దళపతి  నేతాజీ   
అఖండ  భారత  జాతి  కన్నా  మరో  శివాజీ   

సాయుధ  సంగ్రామమే  న్యాయమని  
స్వతంత్ర  భారతావని  మన  స్వర్గమని 
ప్రతి  మనిషొక  సైనికుడై  ప్రాణార్పణ  చేయాలని    
హిందూ  ఫొఉజు  జైహింద్  అని  గడిపాడు    
గగన  సిగలకెగసి  కనుమరుగై  పోయాడు
  
జోహార్  జోహార్  సుభాష్  చంద్ర  బోస్  
జోహార్  జోహార్  సుభాష్  చంద్ర  బోస్  

గాంధీజీ  కళలు  గన్న  స్వరాజ్యం   
సాధించే  సమరం  లో  అమర  జ్యోతులై  వెలిగే  
ధ్రువతారల  కన్నది  ఈ  దేశం  
చరితార్థుల  కన్నది  నా  భారత  దేశం  నా  దేశం  

పుణ్యభూమి  నా  దేశం  నమో  నమామి 
ధన్య  భూమి  నా  దేశం  సదా  స్మరామి 
నన్ను  కన్నా  నా  దేశం  నమో  నమామి 
అన్నపూర్ణ  నా  దేశం  సదా  స్మరామి

English

Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami

Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami
Nannu Kanna Naa Desam Namo Namaami
Annapoorna Naa Desam Sadaa Smaraami
Mahaamahula Kanna Thalli Naa Desam
Mahojwalitha Charita Kanna Bhagyodayadesam Naa Desam

Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami

Adigo Chatrapathi Dhwajametthina Prajapathi
Mathonmaada Sakthulu Churakatthulu Jalipisthe
Maanavathula Mangalyam Manta Galuputhunte Aaaaaa
Aa Kshudra Raajakeeyaniki Rudranetrudai Lechi
Mathru Bhoomi Nuditipai Netthuti Thilakam 
Diddina Maha Veerudu Sarvabhoumudu

Adugo Ari Bhayamkarudu Katta Brahmana 
Adi Veera Pandya Vamsamkura Simha Garjana
Adugo Ari Bhayamkarudu Katta Brahmana 
Adi Veera Pandya Vamsamkura Simha Garjana

Orey Enduku Kattali Raa Sistu
Naru Posava Neeru Pettava 
Kotha Kosava Kuppa Nurchavaa
Orey Thella Kukkaa Kashta Jeevula Mushti Metukulu 
Tini Brathike Neeku Sistenduku Kattaaliraa 

Ani Pela Pela Sankellu Tenchi Swaraajya Poraatamenchi 
Urikoyyala Uggu Paalu Taagaadu 
Kanna Bhoomi Odilone Origaadu 

Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami
Nannu Kanna Naa Desam Namo Namaami
Annapoorna Naa Desam Sadaa Smaraami

Adigadigo Adigadigo Aakaasam Bhalluna Thellaaree 
Vasthunnaadadigo Mana Aggi Pidugu Alluree 
Aggi Pidugu Alluree
 
Evaduraa Naa Bharata Jaathini Tatvamadigina Tucchudu 
Evadu Evadaa Pogaru Battina Thella Doragaadevvadu 
Brathuku Teruvuku Desamocchi Baanisalugaa Mammunenchi 
Pannuladige Kommulochchina Dammulevadiki Vaccheraa 
Badugu Jeevulu Bhaggumante Uduku Netthuru Uppenaithe 
Aa Chandra Nippula Tandra Goddali Pannu Gadatadi Chudaraa
 
Annaa Mannem Dora Allurini Chuttu Mutti Mandee Maarbalametti 
Mara Firangu Lekku Petti Vanda Gullu Okkasaari Pelchite 

Vande Maataram Vande Maataram 
Vande Maataram Vande Maataram 
Vande Maataram Annadi Aa Aakaasam 

Aajadhu Hindu Phouju Dalapathi Nethaaji 
Akhanda Bharata Jaathi Kanna Maro Sivaaji
 
Saayudha Sangraamame Nyaayamani 
Swatantra Bhaarataavani Mana Swargamani
Prathi Manishoka Sainikudai Praanaarpana Cheyaalani 
Hindu Phouju Jaihind Ani Gadipaadu 
Gagana Sigalakegasi Kanumarugai Poyadu 

Johaar Johaar Subhas Chandra Bose 
Johaar Johaar Subhas Chandra Bose

Gandhiji Kalalu Ganna Swaraajyam 
Saadinche Samaram Lo Amara Jyotulai Velige 
Dhruvataarala Kannadi Ee Desam 
Charitaardula Kannadi Naa Bhaarata Desam Naa Desam 

Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanya Bhoomi Naa Desam Sadaa Smaraami
Nannu Kanna Naa Desam Namo Namaami
Annapoorna Naa Desam Sadaa Smaraami

Community

Like, share, and discuss

to start a discussion.