Back to Lyrics
Kerintha

Kerintha

2015 · 6 songs

Telugu

ఏ  కథ  ఎటు  పరిగెడుతుందో 
ఏ  అడుగేటు  తడబడుతుందో 
ఏ  మలుపేటుగా  నెడుతుందో  తెలీదే 

ఏ  క్షణమెప్పుడేం  చేస్తుందో 
ఎవరినెలా  నిలబెడుతుందో 
ఎవరినెలా  పడగోడుతుందో  తెలీదే 

మెరిసే  కళలు  తడిసాయి ఎందుకో  విరిసే  లోపుగా 
ఎగసే  అలలు  విరిగాయి  దేనికో  తలవని  తలపుగా 
స్వరమ్  లో  ఆగిందే  కేరింత 
కన్నీరే  ఓదార్పు  ఎంతో  కొంత 

చందమామ  అందలేదని 
తగని  దిగులు  చెందగలమా 
వెన్నెలుంది  చాలులెమ్మని 
వెలుగు  పడిన  కలగా  పయనించలేమా 
బంధమెంత  బలమైనా 
బాధలేని  సమయానా 
దాని  విలువ  తెలిసినా

చిగురు  వగరు  వివరాలు  సులువుగా  తెలియని  వయసులో 
పగలు  రేయి  తేడాలు  పోల్చని  మసకల  మలుపులో 
స్వరమ్  లో  ఆగిందే  కేరింత 
కన్నీరే  ఓదార్పు  ఎంతో   కొంత 

ముందుగానే  తెలియదుగా 
అసలు  సిసలు  బ్రతుకు  నడక 
సమయము  కదలదుగా 
అప్పుడో  ఇప్పుడో  కలత  కనుపానంటకా    
అనుభవాలు  ప్రతిపాఠం 
జరిగినాకే  కనుగొంటాం 
సరే  కానీ  అనుకుంటాం  హాఆఆ 

ఎటుగా  వెళితే  ఎం  దొరుకుతుందని  తెలుపని  జీవితం 
తనతోపాటు  తలవంచి  కదిలితే  పంచదా  అమృతం 
స్వరమ్  లో  ఆగిందే  కేరింత 
కన్నీరే  ఓదార్పు  ఎంతోకొంత

English

Ye kadha yetu parigeduthundo
ye adugetu thadabaduthundo
ye malupetugaa neduthundo thelede

ye kshanamepudem chesthundo
yevarinelaa nilabeduthundo
evarinelaa padagoduthundo thelede

merise kalalu thadisaayi enduko virise lopugaa
yegase alalu virigaayi dheniko thalavani thalapugaa
swaram lo aagindhe kerintha
kanneere odhaarpu entho kontha

Chandamama andhaledhani
thagani digulu chendhagalama
Vennelundhi chaalulemmani
velugu padina kalaga payanichalema
bhandhamentha bhalamaina
badhaleni samayaana
dani viluva thelisena

chiguru vagaru vivaralu suluvuga theliyani vayasulo
pagalu reyi thedalu polchani masakala malupulo
swaram lo aagindhe kerintha
kanneere odharpu yenthokontha

Mundugane theliyadhuga
asalu sisalu brathuku nadaka
samayamu kadhaladhuga
appudo ippudo kalatha kanupapanantaka
anubhavaalu prathipaatam
jariginaake kanugontaam
sare kaani anukuntaam haaaaa

yetugaa velithe em dhorukuthundhani thelupani jevitham
thanathopaatu thalavanchi kadhilithe panchadha amrutham
swaram lo aagindhe kerintha
kanneere odharpu enthokontha

Community

Like, share, and discuss

to start a discussion.