Back to Lyrics
A Aa

A Aa

2016 · 5 songs

Telugu

హే  రామ్ములగా  బుగ్గలవాడా  బురుజుగోడ                                                          
నిబ్బరాలా  కండలవాడా                                                        
రాజాంపేటా  లాగుల  కాడా  కలుసుకుంట                                                        
కాసులపేరు  పట్టకరారా                                                        
అల్లాబక్షు  అత్తరు  తెచ్చా                                                          
కొత్తపేట  కోకా  రైకా  కట్టుకొచ్చా                                                        
రంగవెళ్లే  రైలుబండి  రయ్యిమంది                                                          
పెట్టేబేడా  పట్టుకొచ్చా           
                                             
నిద్దర  చాలని  బద్దకమల్లే  ఒళ్ళిరిచిందీ  ఆకాశం                                                        
రాతిరి  దాచిన  రబ్బరు  బంతై  తిరిగొచ్చిందీ  రవిబింబం                                                        
వెలుతురు  మోస్తూ  దిగివస్తున్నది  గాల్లో  గువ్వల  పరివారం                                                        
సెల్యూట్  చేసే  సైనికులల్లే  స్వాగతమందీ  పచ్చదనం                                                        
మౌనంగా  ధ్యానంలో  ఉందీ  మాగాణం          
                                              
చిట్టి  వడ్రంగి  పిట్టల  టిక్కూ    టిక్కూ                                                        
కొమ్మ  రెమ్మల్లో  మైనాల  కుక్కూ  కుక్కూ                                                        
ఇదిపల్లెకి  తెలిసిన  మెలొడీయా                                                                                    
యయా  యయా  యయా  యయా                                                        
యయా  యయా  యయా  యయా  
                                                      
య  యా  ముగ్గులూ  ముంగిళ్ళూ                                                        
య  యా  ప్రేమలూ  నట్టిళ్ళూ                                                        
య  యా  చూడగా  చాలేనా  రెండే  కళ్ళు                                                          
య  యా  పువ్వులూ  పుప్పొళ్ళూ                                                        
య  యా  పంటలూ  నూర్పిళ్లూ                                                        
య  యా  పండగలు  తిరణాళ్లూ                                                        
ఈ  పచ్చిగాలి  జోలలూ  నచ్చనోళ్లు  లేరట  
                                                      
కళ్ళాపి  చల్లాలి  రాయేందె  రంగమ్మా                                                        
కవ్వాలు  తిప్పాలి  కానియ్యె  గంగమ్మా                                                        
కావిళ్లు  మొయ్యాలి  కడవిట్ట  ఇయ్యమ్మా                                                        
పొద్దెక్కి  పోతాంది  ఇంకా  ఆలస్యమా                                                        
యయా  యయా  యయా  యయా                                                        
యయా  యయ   యయా  యయా    
                                                    
కోపాల  గోపాల  అలకేలరా                                                        
దీపాల  వేళాయే  అగుపించరా                                                        
కోపాల  గోపాల  అలకేలరా                                                        
చీకటి  వేళకి  నీ  పంచన                                                        
చేరని  మనసిది  శమించునా                                                        
వెన్నని  మన్నని  దొసములెన్నను                                                        
చెల్లాట  చాలించరా
                                                        
అల్లరి  చేష్టల  దండించనా                                                        
అక్కున  జేరిచి  లాలించనా                                                        
నెమ్మది  చెదిరిన  అమ్మను  చూడగ                                                          
బిరాన  రారా  దొరా                                                        
కోపాల  గోపాల  కోపాల  గోపాల                                                        
కోపాల  గోపాల  అలకేలరా                                                        
దీపాల  వేళాయే  అగుపించరా

English

Hey Ramula ga buggala paata buruju kota
Vippa raada kandala vaada
Rajaampeta labula kada
Kalusukunta gaajula peru pattaka ra ra
Alla bhakshu attharu theccha
Kotthapeta kokaa raika kattu kochaa
Rangavelle railu bandi rayyu mandi
Petta beda pattukochaa 
                  
Niddara chaalani baddakamalle
Vollurichindi aakasham
Rathri daachina rabbaru banthai
Thirigochindi ravi binbam
Veluturu mosthu digivosthunnadi
Gallo guvvala parivaram
Salute chese sainikulalle
Swagathamandhi pachadanam
Mounangaa dyanamlo vundhi                  
Maa ganam 
        
Chitti vadrangi pittala bikku bikku
Bomma rangallo mainaala kuhu kuhu
Idhi palleke thelisina melodiga
Yaa Yaa Yaa Yaa
Yaa yaa Yaa Yaa 

Ayaa moggulu mungillu
Ayaa premalu nattillu
Ayaa  chudara chalena rende kallu
Ayyaa puvvulu puppodlu
Ayaa ayaa pantalu noorpidlu
Ayaa pandagalu thiranallu
Ee pachigalli jolalu nachanollu lerata

Kallapi jallali rayande rangamma
Kavvale thippali kaniye gangamma
Mavillu poyyali kadaminta iyyamma
Poddeki pothandhi inka alasyama
Yaa  Yaa  Yaa Yaa
Yaa Yaa  Yaa Yaa   
Yaa  Yaa  Yaa Yaa
Yaa  yo yaya ya yo

Gopala gopala alakelara                  
Nee paata velaye aagupinchara
Gopala gopala alakelara                  
Cheekati velaki nee panchana
Cherani manasidhi kshaminchuna
Ninnati monnati rosamulellani
Chellata chaalinchara

Allari cheshtala dandichana
Akkuna cherchi laalinchana
Nemmadi chedirina ammanu chudara
Biraga raa radhu ra
Gopala Gopala ah         
Ah Gopala Gopala
Ah Gopala Gopala
Alakelara ah                  
Deepaala velaye agupinchara

Community

Like, share, and discuss

to start a discussion.