Back to Lyrics
Vasantham

Vasantham

2003 · 4 songs

Telugu

గాలి  చిరుగాలి
నిను  చూసిందెవరమ్మా 
వెళ్లే  నీ  దారి
అది  ఎవరికి  తెలుసమ్మా

రూపమే  ఉండని
ఊపిరే  నువ్వని 
ఎన్నడూ  ఆగని
పయనమే  నీదని 

గాలి  చిరుగాలి
నిను  చూసిందెవరమ్మా 
వెళ్లే  నీ  దారి
అది  ఎవరికి  తెలుసమ్మా

కనురెప్ప  మూసి  ఉన్నా
నిదరొప్పుకోను  అన్నా 
నిను  నిలువరించేనా
ఓ  స్వప్నమా 

అమవాసలెన్నైనా
గ్రహణాలు  ఏవైనా 
నీ  కలను  దోచేనా
ఓ  చంద్రమా 

తన  ఒడిలో  ఉన్నది
రాయో  రత్నమో
పోల్చదు  నేలమ్మా 

ఉలి  గాయం
చెయ్యకపోతే  ఈ  శిల
శిల్పం  కాదమ్మా 

మేలుకో  మిత్రమా
గుండెలో  జ్వాలలే
జ్యోతిగా  మారగా 
చీకటే  దారిగా
వేకువే  చేరదా 

గాలి  చిరుగాలి
నిను  చూసిందెవరమ్మా 
వెళ్లే  నీ  దారి
అది  ఎవరికి  తెలుసమ్మా

చలి  కంచె  కాపున్నా
పొగమంచు  పొమ్మన్నా 
నీ  రాక  ఆపేనా
వాసంతమా 

ఏ  కొండ  రాళ్ళైనా
ఏ  కోన  ముల్లైనా 
బెదిరేన  నీ  వానా
ఆషాడమా

మొలకెత్తే  పచ్చని
ఆశే  నీలో
ఉంటె  చాలు  సుమా 

కలకాలం  నిన్ను
అనచదు  మన్ను
ఎదిగే  విత్తనామా 

సాగిపో  నేస్తమా
నిత్యమూ  తోడుగా
నమ్మకం  ఉందిగా 
ఓరిమే  సాక్షిగా
ఓటమే  ఓడగా 

గాలి  చిరుగాలి
నిను  చూసిందెవరమ్మా 
వెళ్లే  నీ  దారి
అది  ఎవరికి  తెలుసమ్మా

రూపమే  ఉండని
ఊపిరే  నువ్వని 
ఎన్నడూ  ఆగని
పయనమే  నీదని

English

Gaali chirugaali
ninu choosindevaramma
Velle nee daari
Adi yevariki telusamma

Roopame undani
Oopire nuvvani
Ennadu aagani
Payaname needani

Gaali chirugaali
Ninu choosindevaramma
Velle nee daari
Adi yevariki telusamma

Kanureppa moosi unnaa
Nidaroppu konu annaa
Ninu niluvarinchenaa
O swapnamaa

Amavaasalennainaa
Grahanaalu evainaa
Nee kalanu dochenaa
O chandramaa

Tana odilo unnadi
Raayo ratnamo
Polchadu nelamma

Uli gaayam cheyyakapote
Ee shila shilpam kaadamma

Meluko mitramaa
Gundelo jwaalale
Jyotigaa maaragaa
Cheekate daarigaa
Vekuve cheradaa

Gaali chirugaali
Ninu choosindevaramma
Velle nee daari
Adi yevariki telusamma

Chali kanche kaapunnaa
Pogamanchu pommannaa
Nee raaka aapenaa
Vaasantamaa

Ye konda raallainaa
Ye kona mullainaa
Bedirena nee vaana
Aashaadamaa

Molakette pachchani
Aashe neelo
Unte chaalu sumaa

Kalakaalam ninnu
Anachadu mannu
Edige vittanamaa

saagipo nestamaa
Nityamu todugaa
Nammakam undigaa
Orime sakshigaa
Otame odagaa

Gaali chirugaali
Ninu choosindevaramma
Velle nee daari
Adi yevariki telusamma

Roopame undani
Oopire nuvvani
Ennadu aagani
Payaname needani

Community

Like, share, and discuss

to start a discussion.