Back to Lyrics
Subbu

Subbu

2001 · 4 songs

Singer
Lyricist

Telugu

డూ  యు  హియర్  మీ  యా 
లేడీస్  అండ్  జెంటిల్  మాన్   
డూ యు  లవ్  మీ  యా  
డూ  యు  లవ్  యువర్   
మమ్మీ  అండ్  డాడీ 
వై  నాట్  సో  దట్ 

డూ  లవ్  మదర్  ఇండియా 
యు  టూ  లవ్  ఇండియా 
డూ  లవ్  మదర్  ఇండియా 
యు  టూ  లవ్  ఇండియా 

జనని  జన్మ  భూమిని   
స్వర్గమన్నదొక  కవికులం 
ఏది  అది  ఎక్కడో   
వెతకమంటుంది  గురుకులం 

గుండె  పిండుకొని  తాగిన  గుక్కెడు   
పాల  గురుతులేనప్పుడు 
పోత  పాల  సీసాల  కోసమై   
పరుగులాటలే  ఎపుడు 

సో  దట్  వాట్  యు  సే 

ఐ  లవ్  మై  ఇండియా 
లవ్లీ  మదర్  ఇండియా 
యు  టూ  లవ్  ఇండియా 
డూ  లవ్  మదర్  ఇండియా 

ఆకాశంలో  ఆ  సూర్యుడొక్కడే 
అభ్యుదయంలో  నా  దేశమొక్కటే 

ఆ  సూర్యుడెప్పుడు  తూర్పు  దిక్కునే   
ఎంచుకు  పుడతాడు 
కళ్యాణ  తిలకమై   
కన్నతల్లి  ఒడిలోనే  ఉంటాడు 

అలాంటిదేరా  నా  భారత  దేశం 
సనాతనంలో  సమిష్టి  దేశం 

ఆ  సనాతనం  తన  పునాదిలోనే
సంకరమవుతుంటే 
నా  అభ్యుదయానికి  సభ్య  సమాజమే
సమాధి  కడుతుంటే

తరతరాల  దాశ్యం  తెంచుకున్న   
ఈ  స్వరాజ్య  దేశంలో 
యువతరాలు  మళ్ళీ  పరాయి   
భిక్షకు  పరుగులు  తగునా 

ఐ  లవ్  మై  ఇండియా 
లవ్లీ  మదర్  ఇండియా 
యు  టూ  లవ్  ఇండియా 
డూ  లవ్  మదర్  ఇండియా

పరాయి  దేశంలో  కిరాయి  కోసమని 
స్వదేశ  జ్ఞానం  సవారి  కడుతుంటే 

ఆ  కూలీ  డబ్బు  డాలర్ల  లోనే  
సుఖ  జీవనముందంటే 
ఆ  పాళీ  కాపు  నీ  పాళీ   
శత్రువై  తిరిగి  వెళ్ళమంటే 

కడుపు  తీపీకే  కన్నీళ్ల  రోధనై 
కన్నతండ్రికే  అది  మూగ  వేదనై 

ఆ  నారు  పోసి  నీరెత్తినోళ్లకు   
ఫలితం  ఏముంది 
ఈ  పుణ్య  భూమిలో  పుట్టినందుకు   
ప్రతిష్ట  ఏముంది 

ఆ  కీర్తి  ప్రతిష్టల  హిమాలయాన్నే  
సిగలో  ముడిచిన  తల్లికి 
దురాఘతాల  దురాయి  పువ్వులు   
అలంకరించుట  న్యాయమా  ధర్మమా 

ఐ  లవ్  మై  ఇండియా  ఐ  లవ్  మై  ఇండియా 
ఐ  లవ్  మై  ఇండియా  ఐ  లవ్  మై  ఇండియా 
ఐ  లవ్  మై  ఇండియా  ఐ  లవ్  మై  ఇండియా 
ఐ  లవ్  మై  ఇండియా  ఐ  లవ్  మై  ఇండియా

English

Do you hear me yaa
Ladies and gentleman
Do you love me yaa
Do you love your 
Mummy and daddy
Why not so that

Do love mother india
You too love india
Do love mother india
You too love india

Janani janma bhoomini 
Swargamannadoka kavikulam
Yedhi adhi ekkado 
Vetakamantundi gurukulam

Gunde pindukoni thaagina gukkedu 
Paala guruthulenappudu
Potha paala seesaala kosamai 
Parugulaatale yepudu

So that what you say

I love my india
Lovely mother india
You too love india
Do love mother india

Aakasamlo aa suryudokkade
Abhyudayamlo naa desamokkate

Aa suryudeppudu thoorpu dikkune 
Enchuku pudathadu
Kalyana thilakamai 
Kannathalli odilone untadu

Alaantideraa naa bharatha desam
Sanaathanamlo samishti desam

Aa sanaathanam thana punaadilone
Sankaramavuthunte
Naa abhyudayaaniki sabhya samajame
Samadhi kaduthunte

Tharatharala dhashyam thenchukunna 
Ee swarajya desamlo
Yuva tharalu malli parayi bhikshaku
Parugulu thagunaa

I love my india
Lovely mother india
You too love india
Do love mother india

Paraayi desamlo kiraayi kosamani
Swadesa gnanam savari kaduthunte

Aa coolie dabbu dollerla lone 
Sukha jeevanamundante
Aa paali kaapu nee paali 
Sathruvai thirigi vellamante

Kadupu theepike kanneella rodhanai
Kannathandrike adi mooga vedanai

Aa naaru posi neerettinollaku 
Phalitham emundi
Ee punya bhoomilo puttinanduku 
Prathishta emundi

Aa keerthi prathishtala himalayanne 
Sigalo mudichina thalliki
Duraagathaala duraayi puvvulu 
Alankarinchuta nyayamaa dharmama

I love my india i love my india
I love my india i love my india
I love my india i love my india
I love my india i love my india

Community

Like, share, and discuss

to start a discussion.