Back to Lyrics
Seetayya

Seetayya

2003 · 3 songs

Telugu

సమయానికి  తగు  సేవలు
సేయని  నీ  శ్రీవారిని   
సమయానికి  తగు  సేవలు
సేయని  నీ  శ్రీవారిని   

ఇన్నాళ్ళుగా  శ్రమియించిన  ఇల్లాలిని
ఇక  సేవించని  ఈ  శ్రీవారిని   

సమయానికి  తగు  సేవలు
సేయని  నీ  శ్రీవారిని 

నాకు  నువ్వు  నీకు  నేను
అన్న  తీపి  మాటతో  
చెవిలోన  గుసగుసల
చిలిపి  వలపు  పాటతో   
శ్రీమతికి  జరిగేను
సుప్రభాత  సేవ  

బంగారు  నగలమించు
బాహు  బంధాలతో   
చలువ  చందనాలు  మించు
చల్లని  నా  చూపుతో  
అర్ధాంగికి  జరిగేను
అలంకార  సేవ  

అమ్మలోని  బుజ్జగింపు
కలిపిన  ఈ  బువ్వతో  
నాన్నలోని  ఊరడింపు
తెలిసిన  ఈ  చేతితో  
నా  పాపకు  జరిగేను
నైవేద్య  సేవ  నైవేద్య  సేవ

సమయానికి  తగు  సేవలు
సేయని  శ్రీవారిని 

కలతలేని  లోకంలో
దిష్టి  పడని  దీవిలో   
చెడు  చేరని  చోటులో
ప్రశాంత  పర్ణశాలలు  
ఈ  కాంతకు  జరిగేను
ఏకాంత  సేవ   

అనుబంధమే  బంధువై
మమతలే  ముత్తైదువలై  
ఆనందబాష్పాలై
అనుకోని  అతిధులై   
సీతమ్మకు  జరిగేను
సీమంతపు  సేవ  

నులివెచ్చని  నా  ఎదపై
పరిచేటి  పాన్పులో   
కనురెప్పల  వింద్యామర
విసిరేటి  గాలితో  
చూలాలికి  జరిగేను
జోలాలి  సేవ  జో  జోలాలి  సేవ  

శ్రీవారికి  ఒక  మనవిని
సేయని  ఈ  ప్రియ  దాసిని  
శ్రీవారికి  ఒక  మనవిని
సేయని  ఈ  ప్రియ  దాసిని  

కను  తెరవగ  మీ  రూపే  చూడాలని   
మీ  కౌగిళ్ళలో  కను  మూయాలని  
ఈ  కౌగిళ్ళలో  కలిసుండాలని

English

Samayaniki tagu sevalu
Seyani nee srivaarini 
Samayaniki tagu sevalu
Seyani nee srivaarini 

Innalluga sramiyinchina illaalini
Ika sevinchani ee srivaarini 

Samayaniki tagu sevalu
Seyani nee srivaarini

Naaku nuvvu neeku nenu
Anna teepi maatatho 
Chevilona gusagusala
Chilipi valapu paatatho 
Srimathiki jarigenu
Suprabhaatha seva 

Bangaaru nagalaminchu
Baahu bandhaalatho 
Chaluva chandanaalu minchu
Challani naa chooputho 
Ardhaangiki jarigenu
Alankaara seva 

Ammaloni bujjagimpu
Kalipina ee buvvatho 
Naannaloni ooradimpu
Thelisina ee chetitho 
Naa paapaku jarigenu
Naivedya seva naivedya seva 

Samayaniki tagu sevalu
Seyani srivaarini

Kalathaleni lokamlo
Dishti padani deevilo 
Chedu cherani chotulo
Prasaantha parnasaalalu 
Ee kaanthaku jarigenu
Ekaantha Seva 

Anubandhame bandhuvai
Mamathale muttaiduvale 
Aanandabaashpaale
Anukoni atidulai 
Seetammaku jarigenu
Seemantapu seva 

Nulivecchani naa edapai
Paricheti paanpulo 
Kanureppala vindyaamara
Visireti gaalitho 
Choolaaliki jarigenu
Jolaali seva jo jolaali seva 

Srivaariki oka manavini
Seyani ee priya daasini 
Srivaariki oka manavini
Seyani ee priya daasini 

Kanu teravaga mee roope choodaalani 
Mee kougillalo kanu mooyaalani 
Ee kougillalo kalisundaalani

Community

Like, share, and discuss

to start a discussion.