Back to Lyrics
Postman

Postman

1999 · 6 songs

Telugu

రాజహంస  చీర  కట్టి  రాజా  గుమ్మాది
రాణి  గాజులు  తొడగాలింకా  రావే  అమ్మాడి
రాజహంస  చీర  కట్టి  రాజా  గుమ్మాది
రాణి  గాజులు  తొడగాలింకా  రావే  అమ్మాడి
పన్నీటిలో  పసుపు  కలిపి
పాదాలకు  పూయండమ్మా
ఈ  మేని  కురులకు  సాంబ్రాని  వేయండి
ఈ  పాల  బుగ్గలకు  సిరి  చుక్క  దిద్దండి
ఈ  జన్మ  మరు  జన్మ  మా  బావే  నీకు  తోడు  నీడమ్మా

రాజహంస  చీర  కట్టి  రాజా  గుమ్మాది
రాణి  గాజులు  తొడగాలింకా  రావే  అమ్మాడి

అరవిందాలంటి  కాళ్ళు  అలసి  పోకుండా
అరచేతులపైన  నిన్ను  నడిపించే  వాడు
చూడమ్మా  నీ  వాడమ్మ
కడిగిన  ముత్యమంటి  మంచి  మనసు  ఉన్నోడు
కళ్ళల్లోనా  నీకు  ఇల్లు  కట్టుకున్నడు

నీ  పెదవిపైన  చిరునవ్వు  చదరిపోకుండ  చూసుకుంటాను
క్షణమైన  నీకు  ఎడబాటు  లేక  ఎదలోన  దాచుకుంటాను
నీ  కంటి  చెమ్మ  రాకుండా  కాపాడుకుంటా  రావమ్మా
పందిట్లో  నీకోసం  ఆ  పెళ్ళి  పీటలు  సిద్దంగున్నాయి  ఓ  ఓ  ఓ

రాజహంస  చీర  కట్టి  రాజా  గుమ్మాది
రాణి  గాజులు  తొడగాలింకా  రావే  అమ్మాడి

ఆ  భగవంతుడ్ని  నేను  మీలో  చూస్తున్నా
ఈ  జన్మకు  మీకు  ఎంతో  రుణపడి  పోతున్నా
చాలండి  ఇంక  మీ  చలవా
పుట్టిన  ఫలమే  లేని  ఇంక  నీటి  బొట్టుకు
పసుపు  తాడు  కట్టి  నుదుట  బొట్టు  ఎందుకు

ఎవరెవరి  అడుగులెటువైవు  పడునో  ఎరిగింది  లేరమ్మా
ఏ  నల్లపూసలే  పసుపు  తాడు  జత  పడునో  తెలిసినది  ఆ  బ్రహ్మ
విధి  చేతిలోని  పావురం  ఎదురాడలేని  జీవులం
నీవైన  నేనైనా  ఆ  దేవుడు  తీర్పు  మన్నించాలమ్మా

రాజహంస  వరుని  మెడలో  దండ  వేస్తుంది
రంగ  రంగ  వైభోగంగా  పెళ్లి  అవుతుంది
రాజహంస  వరుని  మెడలో  దండ  వేస్తుంది
రంగ  రంగ  వైభోగంగా  పెళ్లి  అవుతుంది

English

Rajahamsa cheera katti raajaa gummaadhi
raani gaajulu thodagalinka raave ammadi
Rajahamsa cheera katti raajaa gummaadhi
raani gaajulu thodagalinka raave ammadi
pannitilo pasupu kalipi
paadhalaku puyandamma
ee meni kurulaku sambrani veeyandi
ee paala buggalaku siri chukka dhidhandi
ee janma maru janma maa baave niiku thodu niidamma

Rajahamsa cheera katti raajaa gummaadhi
raani gaajulu thodagalinka raave ammadi

Aravindhanlanti kaalu alasi pokunda
arachethulapyna ninnu nadipinche vadu
chudamma nii vaadamma
kadigina mutyamanti manchi manasu unnodu
kallalona niiku illu kattukunnodu

Nii pedhavipyna chirunavvu chadharipokunda chusukuntanu
kshenamyna niiku edabatu leka edhalona dhachukuntanu
ni kanti chemma rakunda kaapadukuntaa ravamma
pandhitlo nikosam a pelli pitalu sidhangunnayiii oo ooo ooo
Rajahamsa cheera katti raajaa gummaadhi
raani gaajulu thodagalinka raave ammadi

A bagavanthudni nenu milo chusthunna
e janmaku miku entho runapadi pothunna
chalandi enka mii chalava
puttina palame leni enka neeti bottuku
pasupu thadu katti nudhuta bottu endhuku

evarevari aduguletuvypu paduno erigindhi leramma
ee nallapusale pasupu thadu jatha paduno thelisinadhi a bramma
nidhi chethiloona pavuram edhuraadaleni jivulam
nivyna nenyna a devudu thirchu mannichalmma

Rajahamsa varuni medalo dhanda vesthundhi
ranga ranga vybhoganga pelli awthundhi
rajahamsa varuni medalo dhanda vesthundhi
ranga ranga vybhoganga pelli awthundhi

Community

Like, share, and discuss

to start a discussion.