Back to Lyrics
Lakshyam

Lakshyam

2007 · 3 songs

Telugu

గుళ్లో  దేవుడు  ఎదురై
ఒక  వరమే  కోరెనుగా 
ఈ  ఇంట్లో  మనిషిగ  మసలే
అవకాశం  అడిగెనుగా 

అలుపే  రాని  కేరింతలు
తను  మురిసి 
మరుపే లేని  ఈ  మమతలు
రుచి  తెలిసి 

మనరాగాలలో  అను రాగాలలో
తను  కూడ  మనలాగే  మురిసి  

గుళ్లో  దేవుడు  ఎదురై
ఒక  వరమే  కోరెనుగా 
ఈ  ఇంట్లో  మనిషిగ  మసలే
అవకాశం  అడిగెనుగా

ఇందరుండగా  ఇరుకైన  ఇంటిలో
కష్ఠాలకింక  చోటు  లేక  చేరుకోవుగా

కాంతులుండగా  ప్రతివారి  కంటిలో
ఆ  రంగు  దాటి  కంటి  నీరు  పొంగిరాదుగా

సెలవులు  లేని  సంతోషం
అలకలు  వున్నా  అరనిమిషం 
ఎన్నెన్నో  వున్నాయి
లేనిదొకటే  కల్మషం 

గుళ్లో  దేవుడు  ఎదురై
ఒక  వరమే  కోరెనుగా 
ఈ  ఇంట్లో  మనిషిగ  మసలే
అవకాశం  అడిగెనుగా

అమ్మ  వాకిలి  నాన్నేమో  లోగిలి
ఈ  చిన్ని  పాప  చంటి  నవ్వు  ఇంటి  జాబిలీ

అన్న  గోపురం  వదినమ్మ  గుమ్మమై
ఇక  తమ్ముడేమో  కోట  గోడలాంటి  కావలి

మనసే  వున్నా  మా  ఇల్లు
మమకారాల  దోసిళ్లు   
లేవంట  ఏ   తిధులు
లోకాలే  అతిధులు 

గుళ్లో  దేవుడు  ఎదురై
ఒక  వరమే  కోరెనుగా 
ఈ  ఇంట్లో  మనిషిగ  మసలే
అవకాశం  అడిగెనుగా

English

Gullo devudu edurai
Oka varame korenuga
Ee intlo manishiga masale
Avakaasam adigenuga

Alupe rani kerintalu
Tanu murisi
Marupe leni ee mamatalu
Ruchi thelisi

Manaragalalo anuraagalalo
Thanu kuda manalage murisi

Gullo devudu edurai
Oka varame korenuga
Ee intlo manishiga masale
Avakaasam adigenuga

Indarundaga irukaina intilo
Kasthalakinka chotu leka cherukovuga

Kaantulundaga prati vari kantilo
Aa rangu daati kanti neeru pongiraadugaa

Selavulu leni santhosham
Alakalu vunna aranimisham
Ennenno vunnayi
Lenidokate kalmasham

Gullo devudu edurai
Oka varame korenuga
Ee intlo manishiga masale
Avakaasam adigenuga

Amma vaakili naannemo logili
Ee chinni papa chanti navvu inti jaabili

Anna gopuram vadinamma gummamai
Ika thammudemo kota goda lanti kavali

Manase vunna ma illu
Mamakaaraala dosiilu
Levanta a tidulu
Lokale atidulu

Gullo devudu edurai
Oka varame korenuga
Ee intlo manishiga masale
Avakaasam adigenuga

Community

Like, share, and discuss

to start a discussion.