Back to Lyrics

Jayammu Nischayammu Raa

2016 · 4 songs

Lyricist

Telugu

కలలు  నావేన   
కధలు  నావేన   
నీకు  చేరింది  శ్యూన్యమా   
తపన  నాదేనా   
తలపు  నాదేనా   
నీకు  నా  ఊహే  దూరమా   
కనులతో  నే  తెలిపిన    
నా  ప్రేమ  నిను  తాక  లేదా  
మనసుతో  నే  పలికిన    
రాగాలు  వినిపించనే   లేదా   

మనసు  నాదేనా 
మమతా  నాదేనా    
నీకు  నేనైతే  దూరమా   
పిలుపు  నాదేనా     
బదులు  నాదేనా   
చలనేమే  లేని  శిల్పమేనా   

నీవు  పలికిన  వేల పదములు     
ప్రేమ  పిలుపులు  కావని   
నాతో  నడిచిన  వేల అడుగులు    
సాగు  గమనము  వేరని   
నవ్వుతూ  నను  చూసిన    
చూపుల  కథ  వేరని    
నేడు  నీ  చిరునవ్వుతో    
తెలిసింది  అంతా  శూన్యమేనని
   
నిన్ను  చూసిన  నాటి  క్షణమున    
నా  యదె  నను  వీడలే   
నేడు  నువ్వు  లేవన్న  మది  నిను    
వీడి  రాలేనందిలే    
నీవు  నన్నలా  చేరితే    
జగమే  మరిచానే   
నేను  నీ  కలలోకి  చేరే    
దారి  ఎదో  తెలియలేదే    

కలలు  నావేన   
కధలు  నావేన   
నీకు  చేరింది  శ్యూన్యమా    
తపన  నాదేనా   
తలపు  నాదేనా   
నీకు  నా  ఊహే  దూరమా   
కడలిలా ఉప్పొంగిన     
గుండెల్లో  నీ  పైన  ప్రేమా   
కడకిలా నీ  మనసులో    
చినుకంటా  కలిగించనేలేదాఅ

English

Kalalu Naavena  
Kadhalu navena  
Neeku cherindi Shyoonyamaa  
Tapana nadena  
Talapu nadena  
Neeku naa oohe dooramaa  
Kanulato ne telipina   
Naa prema ninu taaka ledaaa  
Manasuto ne palikina   
Ragaalu vinipinchane leda 
 
Manasu nadena mamata nadena  
Neeku nenithe dooramaa  
Pilupu nadena badulu nadena  
Chalaneme leni shilpamaaa  

Neevu palikina vela padamulu   
Prema pilupulu kaavani  
Nato nadichina vela adugulu   
Saagu gamanamu verani  
Navvutoo nanu choosina   
Choopula katha verani  
Nedu nee chirunavvuto   
Telisindi anta shoonyamenani
  
Ninnu choosina naati kshanamuna   
Naa yade nanu veedale  
Nedu nuvu levanna madi ninu   
Veedi raalenandile  
Neevu nannala cherite   
Jagame marichaane  
Nenu nee kalaloki chere   
Daari edo teliyalede  

Kalalu Naavena  
Kadhalu navena  
Neeku cherindi Shyoonyamaa  
Tapana nadena  
Talapu nadena  
Neeku naa oohe dooramaa  
Kadalila uppnginaa   
Gundello nee paina premaa  
Kadakila nee manasulo   
Chinukanta kaliginchaneledaaa

Community

Like, share, and discuss

to start a discussion.