Back to Lyrics
Dwaraka

Dwaraka

2017 · 5 songs

Telugu

ఎంత  చిత్రం  కదా 
ఒక  చూపుకే  ఒరిగిపోయా 
ఎంత  ఘోరం  కదా 
ఒక  నవ్వుకే  ఓడిపోయా 
తప్పు  ఒప్పు  ఆలోచించే  వీలే  లేదాయె 
తప్పనిసరిగా  తిప్పలు  వచ్ఛే  ప్రేమే  వరదాయే 
ఏ  ముప్పును  తప్పుకుపోయే  వేరే  దారే  కనపడదాయే  

ఎంత  చిత్రం కదా 
ఒక  చూపుకే  ఒరిగిపోయా 
ఎంత  ఘోరం  కదా 
ఒక  నవ్వుకే  ఓడిపోయా  

కంటి  వైపు  రానంది కునుకు 
కత్తి మీద  సామైంది బతుకు 
గుండెల్లోనా  పుట్టింది  ఒణుకు
గొంతు  దాటి  రానంది  పలుకు
ఓరి  దేవుడో  ఇంత  కోపమా  నాపైన  నీకు
చెప్పాలంటే  అంత  సులభమా  శక్తినివ్వు  నాకు 
ఇక  ఒక్క  పూటైనా
నేను  ఓర్చుకోగలనా 
ఏదేమైనా  ఎదో  ఒకటి  చెప్పేస్తా  తనకు  

ఎంత  చిత్రం కదా 
ఒక  చూపుకే  ఒరిగిపోయా 
ఎంత  ఘోరం  కదా 
ఒక  నవ్వుకే  ఓడిపోయా

నన్నే  గుచ్చ్చిపోయింది  సొగసు 
ఒళ్ళే  మరచిపోయింది  మనసు
ఉన్నట్టుండి  లేచింది  వయసు 
ప్రేమో  పిచ్చొ  నాకేమి  తెలుసు 
ఎంత  ఆపినా  ఆగనంది  దూకే  అడుగు 
ఎంత  దూరమో  తెలియకున్నది  తుళ్ళే  పరుగు 
తన  తీరమేదైనా 
ఏ  దారిలోనైనా
చేరే  వరకు  అలుపే  లేదు  పట్టేస్తా  తుదకు  

ఎంత  చిత్రం కదా 
ఒక  చూపుకే  ఒరిగిపోయా 
ఎంత  ఘోరం  కదా 
ఒక  నవ్వుకే  ఓడిపోయా 

తప్పు  ఒప్పు  ఆలోచించే  వీలే  లేదాయె 
తప్పనిసరిగా  తిప్పలు  వచ్ఛే  ప్రేమే  వరదాయే 
ఏ  ముప్పును  తప్పుకుపోయే  వేరే  దారి  కనపడదాయే  

ఎంత  చిత్రం కదా 
ఒక  చూపుకే  ఒరిగిపోయా 
ఎంత  ఘోరం  కదా 
ఒక  నవ్వుకే  ఓడిపోయా

English

Entha chitram kada
Oka choopuke origipoya
Entha goram kada
Oka navvuke odipoya
Thappu oppu alochinche 
Vele ledaye 
Thappanisariga thippalu 
Vachhe preme varadhaye
Ee muppunu thappukupoye
Vere dare kanapadhaye

Entha chitram kada
Oka choopuke origipoya
Entha goram kada
Oka navvuke odipoya

Kanti vaipu ranandhi kunuku
Katthi meeda saamayindhi bathuku
Gundellona puttindhi onuku
Gonthu dati ranandhi paluku
Ori devudo intha kopama
Naapaina  neeku
Cheppalante antha sulabama 
Shakthi nivvu naaku
Ika okka putaina nenu orchukogalana
Edemaina edo okati cheppesta thanku

Entha chitram kada
Oka choopuke origipoya
Entha goram kada
Oka navvuke odigipoya

Nanne guchhi poyindhi sogasu
Olle marachipoyindi manasu
Unnatundi lechindi vayasu
Premo pichho nakemu telusu
Entha apina aganandhi dooke adugu
Entha dooramo telyakunadhi
Tulle parugu
Thana theeramedhayina
E darilonaina chere varaku
Alupe ledu pattesta thudaku
Entha chitram kada
Oka choopuke origipoya

Entha goram kada
Oka navvuke odipoya
Thappu oppu alochinche 
Veele ledaye 

Thappanisariga thippalu 
Vachhe preme varadhaye
Ee muppunu thappukupoye
Vere dare kanapadhaye

Entha chitram kada
Oka choopuke origipoya
Entha goram kada
Oka navvuke odigipoya

Community

Like, share, and discuss

to start a discussion.