Back to Lyrics
Student No 1

Student No 1

2001 · 6 songs

Telugu

ఒకరికి  ఒకరై  ఉంటుంటే
ఒకటిగ  ముందుకు  వెళుతుంటే
అడిగినవన్నీ  ఇస్తుంటే
అవసరమే  తీరుస్తుంటే
ప్రేమంటారా  కాదంటారా  
ఒకరికి  ఒకరై  ఉంటుంటే
ఒకటిగ  ముందుకు  వెళుతుంటే

దిగులే  పుట్టిన  సమయంలో
ధైర్యం  చెబుతుంటే
గొడవే  పెట్టిన  తరుణంలో
తిడుతూనే  వేడుకుంటే
కష్టం  కలిగిన  ప్రతిపనిలో
సాయం  చేస్తుంటే
విజయం  పొందిన  వేళలలో
వెన్నుతట్టి  మెచ్చుకుంటే

దాపరికాలే  లేకుంటే
లోపాలను  సరిచేస్తుంటే
ఆటాపాటా  ఆనందం
అన్నీ  చెరి  సగమౌతుంటే
ప్రేమంటారా  కాదంటారా
ఒకరికి  ఒకరై  ఉంటుంటే
ఒకటిగ  ముందుకు  వెళుతుంటే

ఓ  మనోహరీ  చెలీ  సఖీ
ఓ  స్వయంవరా  దొరా  సఖా
మనసు  నీదని  మనవి  సేయనా  సఖీ
బ్రతుకు  నీదని  ప్రతినబూననా  సఖా
నినుచూడలేక  నిమిషమైన
నిలువజాలనే  సఖీ  సఖీ
నీ  చెలిమిలేని  క్షణములోన  జగతిని
జీవింపజాలనోయ్  సఖా
ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ

నటనకు  జీవం  పోస్తుంటే
ఆ  ఘటనలు  నిజమనిపిస్తుంటే
అటుపై  శెలవని  వెళుతుంటే
నీ  మనసే  కలవర  పడుతుంటే
ప్రేమంటారా  జౌనంటాను

English

Okariki okarai untunte
okatiga munduku velthunte
adiginavanni isthunte
avasarame theerusthunte
premantaaraa kaadantaraa
okariki okarai untunte
okatiga munduku velthunte

Digule puttina samayamlo
dhairyam chebuthunte
godave pettina tharunamlo
thiduthune vedukunte
kastam kaligina prathi panilo
saayam chesthunte
vijayam pondina velalalo
venu datti mechukunte

Daparikale lekunte
lopalanu sari chesthunte
aata paata anandam
anni cherisagamouthunte
premantaaraa kaadantaraa
okariki okarai untunte
okatiga munduku velthunte

O mano hari cheli sakhi
o swayam vara dora sakha
manasu meeda nee manaviseyana sakhi
brathuku meeda nee prathina boonana sakha
ninu choodaleka nimishamaina niluvajaalane sakhi sakhi
nee chelimi leni kshanamulona jagathini 
jeevimpajaalano sakha
aaaa aaaa aa aa aa 

Natanaku jeevam posthunte
aa ghatanalu nijamanipisthunte
atupai selavani velthunte
nee manase kalavarapaduthunte
premantaaraa avunantanu

Community

Like, share, and discuss

to start a discussion.