Back to Lyrics
Sri Anjaneyam

Sri Anjaneyam

2004 · 5 songs

Telugu

తికమక  మకతిక  పరుగులు  ఎటుకేసి 
నడవరా  నరవరా  నలుగురితో  కలిసి 

శ్రీ  రామ  చందురుని  కోవెల్లో  ఖైదు  చేసి 
రాకాసి  రావణుణ్ణి  గుండెల్లో  కొలువు  చేసి 
తల  తిక్కల  భక్తితో  తైతక్కలా  మనిషి
 
తై  దిదితై  దిదితై  దిదితై  దిదితై  దిదితై  దిదితై  దిదితై
దిదితై  దిదితై  దిదితై  దిదితై  దిదితై

తికమక  మకతిక  పరుగులు  ఎటుకేసి 
నడవరా  నరవరా  నలుగురితో  కలిసి 

వెతికే  మజిలీ  దొరికేదాకా 
కష్టాలు  నష్టాలు  యెన్నొచ్చిన  క్షణమైనా  నిన్నపునా 
కట్టాలి  నీలోని  అన్వేషణ  కన్నీటిపై  వంతెన 

బెదురంటూ  లేని  మది  ఎదురుతిరిగి  అడిగేనా 
బదులంటూ  లేని  ప్రశ్న  లేదు  లోకానా
 
నీ  శోకమే  శ్లోకమై  పలికించార  మనిషి

తై  దిదితై  దిదితై  దిదితై  దిది 
తికమక  మకతిక  పరుగులు  ఎటుకేసి 
నడవరా  నరవరా  నలుగురితో  కలిసి 

అడివె  అయినా  కడలే  అయినా 
ధర్మాన్ని  నడిపించు  పాదాలకి  శిరసొంచి  దారియ్యాదా  
అటువంటి  పాదాల  పాదుకలకు  పట్టాభిషేకమే  కదా 

ఆ  రామ  గాధను  రాసుకున్నదే  కాదా 
అది  నేడు  నీకు  తగుదారి  చూపానందా 
ఆ  అడుగుల  జాడలు  చేరేపొద్దురా  మనిషి 

తికమక  మకతిక  పరుగులు  ఎటుకేసి 
నడవరా  నరవరా  నలుగురితో  కలిసి

English

Tikamaka makatika parugulu yetukesi
nadavaraa narava nalugurito kalisi

sree raama chandurunni kovello khaidu chesi
raakaasi raavanunni gundello koluvu chesi
tala tikkala bhaktito taitakkala manishii

tai diditai diditai diditai diditai diditai diditai diditai
diditai diditai diditai diditai didi

tikamaka makatika parugulu yetukesi
nadavaraa narava nalugurito kalisi

vetike majili dorikedaaka
kashtaalu nashtaalu yennocchina kshaNamaina ninaapunaa
kattaali neeloni anveshaNa kanneetipai vantenaa

bedurantu leni madi yedurutirgi adigenaa
badulantu leni prasna ledu lokaanaa

nee sokame slokamai palikinchara manishii

tai diditai diditai diditai didi

tikamaka makatika parugulu yetukesi
nadavaraa narava nalugurito kalisi

adive ayinaa kadale ayinaa
dharmaanni nadipinchu paadalaki sirasonchi daariiyadaa
atuvanti paadala paadukalaki pattaabhishekame kadaa

aa raama gaadhanu rasukunnade kaadaa
adi nedu neeku tagudaari choopanandaa
aa adugula jaadalu cherapoddura manishii

tikamaka makatika parugulu yetukesi
nadavaraa narava nalugurito kalisi

Community

Like, share, and discuss

to start a discussion.