Back to Lyrics
Sinduram

Sinduram

1997 · 4 songs

Telugu

అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా    
ఆత్మా  వినాసపు  అరాచకాన్ని  
స్వరాజ్యమందామా   
దానికి  సలాము  చేద్దామా  
 
శాంతికపోతపు  కుట్టుక  తెంచి   
తెచ్చ్చిన  బహుమానం  
ఈ  రక్తపు  సింధూరం  
నీ  పాపిటలో  భక్తిగా  దిద్దిన   
ప్రజలను  చూడమ్మా   
ఓ  పవిత్ర  భారతమా
  
అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా  
నిత్యం  కొట్టుకు  ఛచ్ఛే  జనాల   
స్వేఛ్చాను  చూద్దామా  
దాన్నే  స్వరాజ్యమందామా  

కులాల  కోసం  గుంపులు  కడుతూ  
మతాల  కోసం  మంటలు  పెడుతూ   
ఎక్కడలేని  తెగువను  చూపి  తగువుకు  లేస్తారే   
జనాలు  తలలర్పిస్తారే  
సమూహ  క్షేమం  పట్టని  స్వార్ధపు   
ఇరుకుతనంలో  ముడుచుకుపోతూ  
మొత్తం  దేశం  తగలడుతుందని  
నిజం  తెలుసుకోరేం  
తెలిసి  భుజం  కలిపి  రారే  

అలాంటి  జనాల  తరపున  
ఎవరో  ఎందుకు  పోరాడాలీ  
పోరి  ఏమిటి  సాధించాలీ  

ఎవ్వరి  కోసం  ఎవరు  ఎవరితో   
సాగించే  సమరం   
ఈ  ఛిచ్ఛుల  సింధూరం  
జవాబు  చెప్పే  భాద్యత  మరచిన  
జనాల  భారతమా  
ఓ  అనాధ  భారతమా 
 
అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా    
ఆత్మా  వినాసపు  అరాచకాన్ని  
స్వరాజ్యమందామా   
దానికి  సలాము  చేద్దామా   

అన్యాయాన్ని  సహించని  శౌర్యం            
దౌర్జన్యాన్ని  దహించే  ధైర్యం  
కారడవులలో  క్రూర  మృగంలా  
దాక్కుని  ఉండాలా   
వెలుగుని  తప్పుకు  తిరగాలా  
శత్రువుతో  పోరాడే  సైన్యం  
శాంతిని  కాపాడే  కర్తవ్యమ్  
స్వజాతి  వీరుల  అణ్నాచే  వీధిలో   
కవాతు  చెయ్యాలా  
అన్నల  చేతిలో  చావాలా  

తనలో  ధైర్యం  అడవికి  ఇఛ్చి  
తన  ధర్మం  చట్టానికి  ఇఛ్చి  
ఆహ్  కలహం  చూస్తూ  
సంఘం  శిలలా  నిలుచుంటే  
నడిచే  శవాల  సిగలో  
తురిమిన  నెత్తుటి  మందారం  
ఈ  సంధ్యా  సింధూరం  
వేకువ  వైపా  చీకటిలోకా   
ఎటు  నడిపెవమ్మా  
గతి  తోచని  భారతమా
   
అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా    
ఆత్మా  వినాసపు  అరాచకాన్ని  
స్వరాజ్యమందామా   
దానికి  సలాము  చేద్దామా   

తన  తలరాతను  తానే  రాయగల    
అవకాశాన్ని  వదులుకొని  
తనలో  భీతిని  తన  అవినీతిని   
తన  ప్రతినిధులుగా  ఎన్నుకొని  
ప్రజాస్వామ్యాన్ని  తలచే  జాతిని  
ప్రశ్నించడమే  మానుకొని  
కళ్ళు  ఉన్న  ఈ  కబోది  జాతిని  
నడిపిస్తుంది  ఆవేశం   
ఆ  హక్కేదో  తనకే  ఉందని  
శాసిస్తుందట  అధికారం  

కృష్ణుడు  లేని  కురుక్షేత్రమున  
సాగే  ఈ  ఘోరం  
చితి  మంటల  సింధూరం  
చూస్తూ  ఇంకా  నిదురిస్తావా 
విశాల  భారతమా  
ఓ  విషాద  భారతమా  

అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా    
ఆత్మా  వినాసపు  అరాచకాన్ని  
స్వరాజ్యమందామా   
దానికి  సలాము  చేద్దామా   

శాంతికపోతపు  కుత్తుక  తెంచి  
తెచ్చ్చిన  బహుమానం  
ఈ  రక్తపు  సింధూరం  
నీ  పాపిటలో  భక్తిగా  దిద్దిన   
ప్రజలను  చూడమ్మా  
ఓ  పవిత్ర  భారతమా  

అర్ధ  శతాబ్దపు  అజ్ఞానాన్ని   
స్వతంత్రమందామా  
స్వర్ణోత్సవాలు  చేద్దామా    
ఆత్మా  వినాసపు  అరాచకాన్ని  
స్వరాజ్యమందామా   
నిత్యం  కొట్టుకు  ఛచ్ఛే  జనాల   
స్వేఛ్చాను  చూద్దామా  
దాన్నే  స్వరాజ్యమందామా

English

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa 
Aatma Vinaasapu Araachakaanne 
Swaraajyamamdaama 
Daaniki Salaamu Cheddaamaa 

Shantikapotapu Kuttuka Tenchi 
Techchina Bahumaanam 
Ee Raktapu Sindhooram 
Nee Paapitalo Bhaktiga Diddina 
Prajalanu Choodammaa 
O Pavitra Bhaaratamaa 

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa
Nityam Kottuku Chachche Janaala 
Swechchanu Chooddaamaa 
Daanne Swaraajyamamdaama 

Kulaala Kosam Gumpulu Kadutoo 
Mataala Kosam Mantalu Pedutoo 
Ekkadaleni Teguvanu Choopi Taguvuku Lestaare 
Janaalu Talalarpistaare 
Samooha Kshemam Pattani Swaarthapu 
Irukutanamlo Muduchukupotoo 
Mottam Desam Tagaladutondani 
Nijam Telusukorem 
Thelisi Bhujam Kalipi Raare
 
Alaanti Janaala Tarapuna 
Evaro Enduku Poraadaalee 
Pori Emiti Saadhinchaalee
 
Evvari Kosam Evaru Evarito 
Saaginche Samaram 
Ee Chichchula Sindhooram 
Javaabu Cheppe Bhaadyata Marachina 
Janaala Bhaaratamaa 
O Anaadha Bhaaratamaa 

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa 
Aatma Vinaasapu Araachakaanne 
Swaraajyamamdaama 
Daaniki Salaamu Cheddaamaa

Anyaayaanni Sahinchani Shauryam 
Daurjanyaanni Dahinche Dhairyam 
Kaaradavulalo Kroora Mrugamlaa 
Daakkuni Undaalaa 
Veluguni Tappuku Thiragalaa 
Shatruvuto Poraade Sainyam 
Shantini Kaapaade Kartavyam 
Svajaati Veerula Ananache Veedhilo 
Kavaattu Cheyyaalaa 
Annala Chethilo Chaavaalaa 

Tanalo Dhairyam Adaviki Ichchi 
Tana Dharmam Chattaaniki Ichchi 
Aah Kalaham Choostoo 
Sangham Silalaa Niluchunte 
Nadiche Shavaala Sigalo 
Turimina Nettuti Mandaaram 
Ee Sandhyaa Sindhooram 
Vekuva Vaipaa Cheekatilokaa 
Etu Nadipevammaa 
Gati Tochani Bhaaratamaa 

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa
Yuddha Ninaadapu Araachakaanne
Swaraajyamamdaama 
Daaniki Salaamu Cheddaamaa

Tana Talaraatanu Tane Raayagala 
Avakaasanne Vadulukonee 
Tanalo Bheetini Tana Avineetini 
Tana Pratinidhuluga Ennukonee 
Prajasvaamyaanni Talache Jaatini 
Prasnimchadame Maanukonee 
Kallu Unna Ee Kabodi Jaatini 
Nadipistundata Aavesam 
Aa Hakkedo Tanake Vundani 
Shasistundata Adhikaaram 

Krishnudu Leni Kurukshetramuna 
Saage Ee Ghoram 
Chithi Mantala Sindhooram 
Choostoo Inka Niduristaavaa 
Visaala Bhaaratamaa 
O Vishaada Bhaaratamaa 

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa 
Aatma Vinaasapu Araachakaanne 
Swaraajyamamdaama 
Daaniki Salaamu Cheddaamaa 

Shantikapotapu Kuttuka Tenchi 
Techchina Bahumaanam 
Ee Raktapu Sindhooram 
Nee Paapitalo Bhaktiga Diddina 
Prajalanu Choodammaa 
O Pavitra Bhaaratamaa 

Ardha Shathabdapu Agnaanaanne 
Swatantramandaama 
Swarnotsavaalu Cheddaamaaa
Nityam Kottuku Chachche Janaala 
Swechchanu Chooddaamaa 
Daanne Swaraajyamamdaama

Community

Like, share, and discuss

to start a discussion.