Back to Lyrics
Preyasi Raave

Preyasi Raave

1999 · 3 songs

Telugu

తెంచుకుంటే  తెగిపోతుందా  దేవుడు  వేసిన  బంధం 
తెంచుకుంటే  తెగిపోతుందా  దేవుడు  వేసిన  బంధం 
తెలుసుకో  నీ  జీవిత  గమ్యం  పెంచుకొమ్మ  అనుబంధం 

ఏడూ  అడుగులు  నడిచిన  వాడే  ఏడూ  జన్మలు  తోడుంటాడు 
భర్తగా  నిను  భరించు  వాడే  బ్రతుకు  దీపం  వెలిగిస్తాడు 

అతని  హృదయం  నాతి  చరామి 
అగ్ని  హోత్రమే  అందుకు  హామీ 
అతని  హృదయం  నాతి  చరామి 
అగ్ని  హోత్రమే  అందుకు  హామీ 

తెంచుకుంటే  తెగిపోతుందా  దేవుడు  వేసిన  బంధం 
తెలుసుకో  నీ  జీవిత  గమ్యం  పెంచుకొమ్మ  అనుబంధం

శ్రీవారిని  పూజించాలి  చిరునవ్వుల  హారతితో 
దాంపత్యం  వికసించాలి  తరగని  మురిపాలతో 
దాసీ  నీవై  ప్రేయసి  నీవై  నీవే  తన  ప్రాణమై 
నిండు  ప్రేమను  తనకందించు  నూరేళ్లు  నడిపించు 

పతి  ఆరోగ్యమే  సతి  సౌభాగ్యమై  ఈ  బ్రహ్మముడి  విడిపోదు  తల్లి 
ఎన్ని  జన్మలైనా 
మగని  హృదయం  మమతల  నిలయం  మగువకే  దేవాలయం 
మగని  హృదయం  మమతల  నిలయం  మగువకే  దేవాలయం 

తెంచుకుంటే  తెగిపోతుందా  దేవుడు  వేసిన  బంధం 
తెలుసుకో  నీ  జీవిత  గమ్యం  పెంచుకొమ్మ  అనుబంధం

తెగువతో  తన  ప్రతి  ప్రాణాలే  తిరిగి  తెచ్చుకున్న  ఇల్లాలే 
అడవిపాలై  వెడలిన  పతిని  అనుసరించును  ఇల్లాలే 
చెదిరిపోని  నుదిటి  రాతకు  శ్రీకారం  దాపంతులే 
గాయం  ఏ  ఒక్కరిదైనా  కన్నీళ్లు  ఇద్దరివీ 

పగలు  రేయిగా  బ్రతుకే  హాయిగా 
కలకాలం  నిలవాలి  మీరు  పసుపు  కుంకుమలుగా 

ఆలూమగలే  సృష్టికే  మూలం 
వారికే  తల  వంచును  కాలం 
ఆలూమగలే  సృష్టికే  మూలం 
వారికే  తల  వంచును  కాలం

English

Thenchukunte Thegipothundaa Devudu Vesina Bandham
Thenchukunte Thegipothundaa Devudu Vesina Bandham
Thelusuko Nee Jeevitha Gamyam Penchukomma Anubhandham

Edu Adugulu Nadichina Vaade Edu Janmalu Thoduntaadu
Bharthagaa Ninu Bharinchu Vaade Brathuku Deepam Veligisthaadu

Athani Hrudhayam Naathi Charaami
Agni Hothrame Andhuku Haami
Athani Hrudhayam Naathi Charaami
Agni Hothrame Andhuku Haami

Thenchukunte Thegipothundaa Devudu Vesina Bandham
Thelusuko Nee Jeevitha Gamyam Penchukomma Anubhandham

Sreevaarini Poojinchaali Chirunavvula Haarathitho
Dhaampathyam Vikasinchaali Tharagani Muripaalatho
Daasi Neevai Preyasi Neevai Neeve Thana Praanamai
Nindu Premanu Thanakandhinchu Noorellu Nadipinchu

Prathi Aarogyame Sathi Saubhagyamai Ee Brahmmamudi Vidipodhu Thalli
Enni Janmalaina
Magani Hrudhayam Mamathala Nilayam Maguvake Devaalayam 
Magani Hrudhayam Mamathala Nilayam Maguvake Devaalayam 

Thenchukunte Thegipothundaa Devudu Vesina Bandham
Thelusuko Nee Jeevitha Gamyam Penchukomma Anubhandham

Theguvatho Thana Prathi Praanaale Thirigi Thechhukunna Illale
Adavipaalai Vedalina Pathini Anusarinchunu Illaale
Chedhiriponi Nudhiti Raathaku Sreekaaram Dhapanthule
Gaayam Ye Okkaridhainaa Kanneellu Iddharive

Pagalu Reyigaa Brathuke Haayigaa
Kalakaalamu Nilavaali Meeru Pasupu kumkumalugaa

Aalumagalu Srushtike Moolam
Vaarike Thala Vanchunu Kaalam
Aalumagalu Srushtike Moolam
Vaarike Thala Vanchunu Kaalam

Community

Like, share, and discuss

to start a discussion.