Back to Lyrics
Preyasi Raave

Preyasi Raave

1999 · 3 songs

Telugu

నీకోసం  నీకోసం  జీవించ  చిలకా 
నా  ప్రాణం  నీవేనే  మానితునికా 
నాకోసం  నాకోసం  నిన్నే  నా  జతగా 
ఏ  దైవం  పంపెనో  బహుమతిగా  
 
నిన్నూ  నన్నూ  పెనవేసే  ప్రేమే  సాక్షిగా 
కన్నూ  కన్నూ  కలబోసే  కలలే  పండగా 
మిన్నూ  మన్నూ  ఏకం  చేద్దాం  హరివిల్లుగా 
 
నాకోసం  నాకోసం  నిన్నే  నా  జతగా 
ఏ  దైవం  పంపెనో  బహుమతిగా   

నా  ఊపిరిలో  ఉయ్యాలేసి  నూరేళ్ళ  కాలం 
నిను  లాలించాలి  వెచ్చ్చని  కలల్ని  పంచాలీ 
నీ  స్నేహంలో  స్నానం  చేసి  నా  కన్నె  దేహం 
తరించిపోవాలి  తీయని  స్వరాలూ  పాడాలీ 

పరులకు  ఎన్నడూ  తెలియని  చల్లని  చెలిమితో 
ఈ  నా  అనురాగం  నీ  గుండెనే  మీటనీ  
విరహపు  వేడికి  కనబడకా  విడవని  జోడుగా  ముడిపడగా 
అల్లే  ఈ  బంధం  కలకాలం  ఉండిపోనీ 

నీకోసం  నీకోసం  జీవించ  చిలకా 
నా  ప్రాణం  నీవేనే  మానితునికా 

కాసేపైనా  కల్లోనైనా  నీ  ఊహలేనీ 
క్షణాలు  ఉన్నాయా  ఒంటరి  తనాలు  ఉన్నాయా 
ఎం  చేస్తున్నా  ఎటు  చూస్తున్నా 
నీ  రూపులోనే  ప్రతీది  చూస్తున్నా 
నిన్నే  ప్రపంచమంటున్నా 

మమతలు  చిందిన  మధువుల  విందుకు 
అతిధులుగా  ఆహ్వానిద్దాం  ఆరారు  కాలాలనీ 
అలలకు  అందని  జాబిలినీ  వెన్నెల  వానగా  దించుకునే 
గెలిచే  సంద్రంలా  సంతోషం  పొంగి  పోనీ 

నాకోసం  నాకోసం  నిన్నే  నా  జతగా 
ఏ  దైవం  పంపెనో  బహుమతిగా 
నిన్నూ  నన్నూ  పెనవేసే  ప్రేమే  సాక్షిగా 
కన్నూ  కన్నూ  కలబోసే  కలలే  పండగా 
మిన్నూ  మన్నూ  ఏకం  చేద్దాం  హరివిల్లుగా

English

Neekosam neekosam jeevincha chilakaa
Naa praanam neevene manitunakaa
Naakosam naakosam ninne naa jatagaa
E daivam pampeno bahumatigaa

Ninnoo nannoo penavese preme saakshigaa
Kannoo kannoo kalabose kalale pandagaa
Minnoo mannoo ekam cheddaam harivillugaa

Naakosam naakosam ninne naa jatagaa
E daivam pampeno bahumatigaa

Naa oopirilo uyyaalesi noorella kaalam
Ninu laalinchaali vechchani kalalni panchaalee
Nee snehamlo snaanam chesi naa kanne deham
Tarinchipovaali teeyani swaraalu paadaalee

Parulaku ennadu teliyani challani chelimito
Ee naa anuraagam nee gundene meetanee
Virahapu vediki kanabadakaa vidavani joduga mudipadagaa
Alle ee bandham kalakaalam vundiponee

Neekosam neekosam jeevincha chilakaa
Naa praanam neevene manitunakaa

Kaasepainaa kallonainaa nee oohalenee
Kshanaalu unnaayaa ontari tanaalu unnaayaa
Em chestunnaa etu choostunnaa
Nee roopulone prateedi choostunnaa
Ninne prapanchamantunnaa

Mamatalu chindina maduvula vinduku
Atidhulugaa aahwaniddaam aaraaru kaalaalanee
Alalaku andani jaabilinee vennela vaanaga dinchukunee
Geliche sandramlaa santosham pongi ponee

Naakosam naakosam ninne naa jatagaa
E daivam pampeno bahumatigaa
Ninnoo nannoo penavese preme saakshigaa
Kannoo kannoo kalabose kalale pandagaa
Minnoo mannoo ekam cheddaam harivillugaa

Community

Like, share, and discuss

to start a discussion.