Back to Lyrics

Preyamaina Neku

2001 · 4 songs

Telugu

నేలనడిగా  పువ్వులనడిగా 
నీలి  నింగి  చుక్కలనడిగా 
ప్రేమించిన  చెలి  ఏదనీ  
గాలినడిగా  మబ్బులనడిగా 
రామచిలుక  రెక్కలనడిగా 
క్షేమంగా  ఉందా  అనీ 

ఐన  ఇంతవరకు  ఆచూకీ  లేక  
తెగిన  గాలి  పటమై  తిరిగా 
ఎటు  దారి  తోచక  ఆగలేక 
నా  మనసు  దోచిన  ఆ  ప్రేమ 
ఏనాటికి  చూపునో  చిరునామా
 
నేలనడిగా  పువ్వులనడిగా 
నీలి  నింగి  చుక్కలనడిగా 
ప్రేమించిన  చెలి  ఏదనీ  

ఇపుడే  ఇటు  వెళ్ళిందంటూ 
చిరుగాలి  చెప్పింది 
నిజమే  ఇంకా  గాలుల్లో  చెలి  పరిమలముంది 
ఇందాక  చూశానంటూ  సిరిమల్లె  చెప్పింది 
ఇదిగో  అంటూ  తనలో 
చెలి  చిరునవ్వే  చూపింది 

ఈ  గుడి  గంటల్లో  తన 
గాజుల  సడి  వింటుంటే 
తాను  ఈ  కోవెల్లో 
ఇప్పటి  వరకు  ఉన్నట్టే 
ఎటు  చూసిన  తన  జాడలు 
ఎటు  వెళ్లిందో  ఈ  లోపునే 

నేలనడిగా  పువ్వులనడిగా 
నీలి  నింగి  చుక్కలనడిగా 
ప్రేమించిన  చెలి  ఏదనీ

నడయాడే  దీపంలాంటి 
ఆ  రూపం  చూస్తుంటే 
కనుపాపల్లో  కలకాలం  కొలువుండీ  పోతుంది 
నడకైనా  నాట్యంలాగే 
అనిపించే  తన  వెంటే 
దివిలో  ఉండే  మెరుపే  దిగి 
వచ్చిందనిపిస్తుంది 

కొందరు  చూసారో  కలగన్నమనుకున్నారో 
అందుకనే  ఏమో  తాను  నిజం  కాదనుకున్నారో 
బతిమాలినా  బదులివ్వదే 
తాను  ఉందంటే  నను  నమ్మరే 

నేలనడిగా  పువ్వులనడిగా 
నీలి  నింగి  చుక్కలనడిగా 
ప్రేమించిన  చెలి  ఏదనీ  
గాలినడిగా  మబ్బులనడిగా 
రామచిలుక  రెక్కలనడిగా 
క్షేమంగా  ఉందా  అనీ

ఐన  ఇంతవరకు  ఆచూకీ  లేక  
తెగిన  గాలి  పటమై  తిరిగా 
ఎటు  దారి  తోచక  ఆగలేక 
నా  మనసు  దోచిన  ఆ  ప్రేమ 
ఏనాటికి  చూపునో  చిరునామా
 
నేలనడిగా  పువ్వులనడిగా 
నీలి  నింగి  చుక్కలనడిగా 
ప్రేమించిన  చెలి  ఏదనీ

English

Nelanadiga Puvvulanadiga
Neeli Ningi Chukkalanadiga
Preminchina Cheli Yedani
Gaalinadiga Mabbulanadiga
Ramachilaka Rekkalanadiga
Kshemanga Undaa Ani

Aina Inthavaraku Achuki Leka
Thegina Gaali Patamai Thiriga
Etu Daari Thochaka Aagaleka
Naa Manasu Dochina Aa Prema
Yenaatiki Choopuno Chirunama

Nelanadiga Puvvulanadiga
Neeli Ningi Chukkalanadiga
Preminchina Cheli Yedani

Ipude Itu Vellindantu
Chirugaali Cheppindi
Nijame Inka Gaalullo Cheli Parimalamundi
Indaka Choosanantu Sirimalle Cheppindi
Idigo Antu Thanalo
Cheli Chirunavve Choopindi

Ee Gudi Gantallo Thana
Jaajula Sadi Vintunte
Thanu Ee Kovello
Ippati Varaku Unnatte
Etu Choosina Thana Jaadale
Etu Vellindo Ee Lopune

Nelanadiga Puvvulanadiga
Neeli Ningi Chukkalanadiga
Preminchina Cheli Yedani

Nadayaade Deepamlanti
Aa Roopam Choosthunte
Kanupapallo Kalakalam Koluvundi Pothundi
Nadakaina Natyamlaage
Anipinche Thana Vente
Divilo Unde Merupe Digi
Vachindanipisthundi

Kondaru Choosaro Kalagannamanukunnaro
Andukane Emo Thanu Nijam Kaadanukunnaro
Bathimaalina Badulivvade
Thanu Undante Nanu Nammare

Nelanadiga Puvvulanadiga
Neeli Ningi Chukkalanadiga
Preminchina Cheli Yedani
Gaalinadiga Mabbulanadiga
Ramachilaka Rekkalanadiga
Kshemanga Undaa Ani

Aina Inthavaraku Achuki Leka
Thegina Gaali Patamai Thiriga
Etu Daari Thochaka Aagaleka
Naa Manasu Dochina Aa Prema
Yenaatiki Choopuno Chirunama

Nelanadiga Puvvulanadiga
Neeli Ningi Chukkalanadiga
Preminchina Cheli Yedani

Community

Like, share, and discuss

to start a discussion.