Back to Lyrics

Preyamaina Neku

2001 · 4 songs

Telugu

మనసున  ఉన్నది  చెప్పాలనున్నది 
మాటలు  రావే  ఎలా 
మాటున  ఉన్నది  ఓ  మంచి  
సంగతి  బయటికి  రాదే  ఎలా 

అతడిని  చూస్తే  రెప్పలు  వాలిపోయే  
బిడియం  ఆపేదెలా 
ఎదురుగ  వస్తే  చెప్పక  ఆగిపోయే  
తలపులు  చూపేదెలా 
ఒకసారి  దరి  చేరి  ఎదా  గొడవేమిటో  
తెలపకపోతే  ఎలా

మనసున  ఉన్నది  చెప్పాలనున్నది 
మాటలు  రావే  ఎలా 
 
చింత  నిప్పైనా  చల్లగా  ఉందని 
ఎంత  నొప్పైనా  తెలియలేదని  
తననే  తలుచుకునే  వేడిలో 
ప్రేమ  అంటేనే  తియ్యని  బాధని 
లేత  గుండెల్లో  కొండంత  బరువని 
కొత్తగా  తెలుసుకునే  వేళలో 

కనబడుతోందా  నా  ప్రియాయమైన  నీకు  
నా  ఎద  కోత  అని  అడగాలని 
అనుకుంటూ  తన  చుట్టూ  మరి 
తిరిగిందని  తెలపకపోతే  ఎలా
  
మనసున  ఉన్నది  చెప్పాలనున్నది 
మాటలు  రావే  ఎలా 

నీలి  కన్నుల్లో  అతని  బొమ్మని 
చూసి  నాకింకా  చోటెక్కడుందని 
నిదరే  కసురుకొనే  రేయిలో 
మెలుకున్నాయి  లే  వింత  కైపని 
వేళా  ఊహల్లో  ఉరేగు  చూపుని 
కలలే  ముసురుకునే  హాయిలో 

వినబడుతోందా  నా  ప్రియమైన  నీకు  
ఆశల  రాగం  అని  అడగాలని 
పగలేదో  రేయేదో  గురుతే  లేదని  
తెలపకపోతే  ఎలా 

మనసున  ఉన్నది  చెప్పాలనున్నది 
మాటలు  రావే  ఎలా 
మాటున  ఉన్నది  ఓ  మంచి  
సంగతి  బయటికి  రాదే  ఎలా 

అతడిని  చూస్తే  రెప్పలు  వాలిపోయే  
బిడియం  ఆపేదెలా 
ఎదురుగ  వస్తే  చెప్పక  ఆగిపోయే  
తలపులు  చూపేదెలా 
ఒకసారి  దరి  చేరి  ఎదా  గొడవేమిటో  
తెలపకపోతే  ఎలా

English

Manasuna unnadi cheppaalanunnadi
Maatalu raave elaa
Maatuna unnadi o manchi
Sangati bayatiki raade elaa

Atadini chooste reppalu vaalipoye 
Bidiyam aapedelaa
Eduruga vaste cheppaka agipoye 
Talapulu choopedelaa
Okasaari dari cheri yada godavemito 
Telapakapote elaa

Manasuna unnadi cheppaalanunnadi
Maatalu raave elaa

Chinta nippaina challaga undani
Enta noppaina teliyaledani
Tanane talachukune vedilo
Prema antene tiyyani baadhani
Leta gundello kondanta baruvani
Kottagaa telusukune velalo

Kanabadutondaa naa priayamaina neeku 
Naa yada kota ani adagaalani
Anukuntu tana chuttu mari tirigindani 
Telapakapote elaa

Manasuna unnadi cheppaalanunnadi
Maatalu raave elaa

Neeli kannullo atani bommani
Choosi naakinka chotekkadundani
Nidare kasurukone reyilo
Melukunnaayi le vinta kaipani
Vela uhallo uregu choopuni
Kalale musurukune haayilo

Vinabadutondaa naa priyamaina neeku 
Aasala raagam ani adagaalani
Pagaledo reyedo guruteledani 
Telapakapote elaa

Manasuna unnadi cheppaalanunnadi
Maatalu raave elaa
Maatuna unnadi O manchi
Sangati bayatiki raade elaa

Atadini chooste reppalu vaalipoye 
Bidiyam aapedelaa
Eduruga vaste cheppaka agipoye 
Talapulu choopedelaa
Okasaari dari cheri yada godavemito 
Telapakapote elaa

Community

Like, share, and discuss

to start a discussion.