Back to Lyrics

Preyamaina Neku

2001 · 4 songs

Telugu

వేయి  జన్మాల  చెలిమి  నీవే 
తెలుసు  నా  గుండెకీ 
కోటి  దీపాల  వెలుగు  నీవే 
తెలుసు  నా  కంటికీ 
నిను  దాచే  ఈ  నిసీ
నిలిచేనా  ప్రేయసీ 
  
నలువైపులా  నల్లని  చీకట్లే 
ఎదురొస్తూ  వున్నా 
పరుగాపని  పాదం  దూరంతో 
పోరాడుతూ  వున్నా 
కనుపాపకి  ఉప్పని  కన్నీరే 
తేరా  వేస్తూ  వున్నా 
ప్రతి  నిమిషం 
నీ  వైపే  పయనిస్తూ  వున్నా 

వేయి  జన్మాల  చెలిమి  నీవే 
తెలుసు  నా  గుండెకీ 

గాలితో  నువ్వు  పంపిన 
వలపు  వూసేమిటో  
పూలలో  నువ్వు  నింపిన  తీపి  తలపేమిటో 
నిన్న  నా  కళను  చేరలేదని 
నమ్మదా  చెలి  నీ  మౌనం 

నా  శ్వాసతో  రగిలి  గాలులతో 
నిను  వెతికిస్తున్నా 
నా  ప్రేమను  పూల  సువాసనతో  
నీ  కందిస్తూన్నా 
ఎద  సవ్వడులే  ఆ  మువ్వలుగా 
ఎగరేస్తూన్నా 
అవి  నిన్నే  చూడాలీ  నువ్వెక్కడ  వున్నా 

వేయి  జన్మాల  చెలిమి  నీవే 
తెలుసు  నా  గుండెకీ 

ఆశగా  వుంది  నేచ్ఛేలీ 
కలుసుకోవాలనీ  
కోవెలయి  వుంది  కౌగిలి  దేవి  రావాలనీ 
నీవు  కలవని  కలవు  కాదనీ 
రుజువు  చేయనీ  అనురాగం 

నను  నేనే  శిలగా  మోస్తున్నా 
ఎద  బరువై  పోగా   
చిరు  నవ్వులనే  వేలి  వేస్తున్నా  
నిను  చూసే  దాకా 
ప్రతి  రక్త  కణం  వెలిగిస్తున్నా 
పెను  జ్వాలై  పోగా 
యెడ  బాటు  పోరా  బాటు  కరిగించే  దాకా 

వేయి  జన్మాల  చెలిమి  నీవే  
తెలుసు  నా  గుండెకీ 
కోటి  దీపాల  వెలుగు  నీవే 
తెలుసు  నా  కంటికీ 
నిను  దాచే  ఈ  నిసీ
నిలిచేనా  ప్రేయసీ    

నలువైపులా  నల్లని  చీకట్లే 
ఎదురొస్తూ  వున్నా 
పరుగాపని  పాదం  దూరంతో 
పోరాడుతూ  వున్నా 
కనుపాపకి  ఉప్పని  కన్నీరే 
తేరా  వేస్తూ  వున్నా 
ప్రతి  నిమిషం 
నీ  వైపే  పయనిస్తూ  వున్నా 

వేయి  జన్మాల  చెలిమి  నీవే 
తెలుసు  నా  గుండెకీ

English

Veyi Janmaala Chelimi Neeve
Telusu Naa Gundekee
Koati Deepaala Velugu Neeve
Telusu Naa Kantikee
Ninu Daachae Ee Nisi
Nilichaenaa Praeyasee

Naluvaipula Nallani Cheekatlae
Yedurostuu Vunnaa
Parugaapani Paadam Duuram Toa
Poraadutu Vunnaa
Kanupaapaki Uppani Kanneerae
Tera Vaestuu Vunnaa
Prati Nimisham
Nee Vaipae Payanistu Vunnaa

Veyi Janmaala Chelimi Neevae
Telusu Naa Gundekee

Gaalitho Nuvvu Pampina
Valapu Vuusaemitoa
Pulalo Nuvvu Nimpina Teepi Talapaemitoa
Ninna Naa Kalanu Chaeralaedani
Nammadaa Cheli Nee Mounam

Naa Swasato Ragili Gaalulato
Ninu Vetikistunnaa
Naa Premanu Puula Suvaasanatoa
Nee Kandistunnaa
Yeda Savvadule Aa Muvvaluga
Yegaraestunnaa
Avi Ninne Chudaalee Nuvvekkada Vunnaa

Veyi Janmaala Chelimi Neevae
Telusu Naa Gundekee

Aasagaa Vundi Nechchelee
Kalusukovaalanee
Kovelai Vundi Kaugili Daevi Raavalanee
Neevu Kalavani Kalavu Kaadanee
Rujuvu Chaeyanee Anuraagam

Nanu Naenae Silagaa Mostunnaa
Yeda Baruvai Poagaa
Chiru Navvulnae Veli Vestunnaa
Ninu Chusae Daakaa
Prati Rakta Kanam Veligistunnaa
Penu Jwaalai Pogaa
Yeda Baatu Pora Baatu Kariginchae Daakaa

Veyi Janmaala Chelimi Neeve
Telusu Naa Gundekee
Koati Deepaala Velugu Neeve
Telusu Naa Kantikee
Ninu Daachae Ee Nisi
Nilichaenaa Praeyasee

Naluvaipula Nallani Cheekatlae
Yedurostuu Vunnaa
Parugaapani Paadam Duuram Toa
Poraadutu Vunnaa
Kanupaapaki Uppani Kanneerae
Tera Vaestuu Vunnaa
Prati Nimisham
Nee Vaipae Payanistu Vunnaa

Veyi Janmaala Chelimi Neevae
Telusu Naa Gundekee

Community

Like, share, and discuss

to start a discussion.