Back to Lyrics
Osey Ramulamma

Osey Ramulamma

1997 · 4 songs

Telugu

ఓ  ముత్యాల  రెమ్మ  ఓ మురిపాల  కొమ్మ   
ఓ పున్నమి  బొమ్మ  ఓ పుత్త్తడి  గుమ్మా  
ఓ  రాములమ్మ  రాములమ్మ  

ఎం  సూపులోయమ్మ  ఎగు  సుక్కలేనమ్మా   
సిరి  నవ్వులోయమ్మ  సెంద్ర  వంకేలేనమ్మా  
ఓ  రాములమ్మ  రాములమ్మ  

నువ్వు  కడవ  మీద  కడవ  బెట్టి  కదిలితేనమ్మా  
ఓ  ఒసేయ్  రాములమ్మ 
ఆ  కరిమబ్బు  వరిదొబ్బు  కన్ను  గెలిపినమ్మ  
ఓ  ఒసేయ్  రాములమ్మ  
నువ్వు  సింధు  మీద  సిందేసి  సెంగుమంటే  నమ్మ  
ఓ  ఒసేయ్  రాములమ్మ  
ఆ  జింక  పిల్ల  పాదాలకు  జంకు  పుట్టెనమ్మ  
ఓ  ఒసేయ్  రాములమ్మ  
ఓ  ఒసేయ్  రాములమ్మ 

పరుగు  పరుగు  పాయలోన  పైకి  పైకి  తేలుతుంటే   
నురగ  తీరుగా  వున్నవే  
ఓ  రాములమ్మ   
విఛ్చుకొని  మొగ్గవోలె  పచ్చిపాలా  నిగ్గువోలె   
ముచ్చటేసి  పోతున్నవే   
ఓ  రాములమ్మ
ఓ  రాములమ్మ

వాగుల్లో  వంకల్లో  
ఆ  సెల్లాల్లో  ఆఆ  మూలల్లో  
వాగుల్లో  వంకల్లో  ఆ  సెల్లాల్లో  మూలల్లో  
నువ్వు  పచ్చ్చగుండాలె  
నువ్వు  పదిలంగుండాలె  
భూమి  తల్లి  సాక్షిగా  సేమాంగుండాలె  

సూరీడే  నీ  వంక  తేరి  సుసెనమ్మా  
ఓ  ఒసేయ్  రాములమ్మ 
అడుగేస్తే  నెలంతా  అద్ధమాయెనమ్మ  
ఓ  ఒసేయ్  రాములమ్మ 
ఓ  ఒసేయ్  రాములమ్మ 

పసిడి  వన్నె  వొంటి  మీద  పాడు  సూపు  పడకుండా  
పసుపు  పూసినారే  అమ్మలు  
ఓ  రాములమ్మ
సిటీ  వయసు  పారిపోయే  జిగురు  వయసు  చేరినని  
సీర  కట్టినారు  గుమ్మాలు  
ఓ  రాములమ్మ

దొర  గారి  దొరసాని  దీవెనల  కోసమని  
ఆ  దొరగారి  దొరసాని  నిండు  దీవెనల  కోసమని 
కాళ్ళు  మోక్త  బంచానని  వంగినవమ్మా 
మూడు  గుంచాలిస్తే  నిలువెత్తు  పొంగినవమ్మా 

దొరగారి  పై  ఊగే  పంక  వైనవమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
దొరసాని  కాలొత్తే  దూది  వైనవమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
దేవీడునే  వెలిగించే  దివ్వె  వైనవమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
నలుగురికి  తల్లోన్ని  నాల్కవైనవమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
ఓ  ఒసేయ్  రాములమ్మ 

సీకటింట  బిక్కుమంటూ  కలత  పడ్డ  కళ్ళలోన 
బాకు  లాంటి  ఎలుగు  మెరిసిన  
ఓ  రాములమ్మ
మూక  బైట  వెదురులోన  ముచ్చ్చటైన  
రాగాలూదే  ముద్దులయ్య  చెయ్యి  దొరికేనా 
ఓ  రాములమ్మ

కష్టాలు  కన్నీళ్లు  ఉంటాయా  శానల్లు 
కష్టాలు  కన్నీళ్లు  నిలిచి  ఉంటాయా  శానల్లు  
ఇంకా  పొదల  మాటు  పువ్వుల్లాగా  ఒదగాలోయమ్మ 
గుబులే  లేని  గువ్వలాగా  ఎగరాలోయమ్మ 

పచ్చని  అడివి  తల్లి  పందిరవుతుందమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
నీరెండే  నీ  కాళీ  పరానవుతుందమ్మా 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
పూసేటి  పూలన్నీ  పొసే  తలంబ్రాలమ్మ 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
కోయిలలా  సందల్లే  సన్నాయిమేళాలమ్మ 
ఓ  ఒసేయ్  రాములమ్మ 
ఓ  ఒసేయ్  రాములమ్మ

English

O Muthyala Remma O Muripala Komma 
O Punnami Bomma O Puththadi Gumma 
O Ramulamma Ramulamma 

Em Soopuloyamma Egu Sukkalenamma 
Siri Navvuloyamma Sendra Vankelenamma 
O Ramulamma Ramulamma 

Nuvvu Kadava Meeda Kadava Betti Kadhilithenamma 
O Osey Ramulamma
Aa Karimabbu Varidobbu Kannu Gilipenamma 
O Osey Ramulamma 
Nuvvu Sindhu Meedha Sindesi Sengumante Namma 
O Osey Ramulamma 
Aa Jinka Pilla Paadhalaku Janku Puttenamma 
O Osey Ramulamma 
O Osey Ramulamma

Parugu Parugu Paayalona Paiki Paiki Theluthunte 
Nuruga Theeruga Vunnave 
O Ramulamma 
Vichchukoni Moggavole Pachipaala Nigguvole 
Muchatesi Pothunnave 
O Ramulamma
O Ramulamma

Vaagullo Vankallo 
Aa Sellallo Aa Moolallo 
Vaagullo Vankallo Aa Sellallo Moolallo 
Nuvvu Pachchangundale 
Nuvvu Padhilangundale 
Bhoomi Thalli Sakshiga Semangundale 

Sooride Ne Vanka Theri Susenamma 
O Osey Ramulamma
Adugesthe Nelantha Addhamaayenamma 
O Osey Ramulamma
O Osey Ramulamma

Pasidi Vanne Vonti Meedha Paadu Soopu Padakunda 
Pasupu pusinaare Ammalu 
O  Ramulamma
Sitti Vayasu Paripoye Siguru Vayasu Cherinani 
Seera Kattinare Gummalu 
O Ramulamma 

Dora gaari Dorasani Deevenala Kosamani 
Aa Doragari Dorasani Nindu Deevenala Kosamani
Kaallu Moktha Banchanani Vanginavamma
Moodu Gunchalisthe Niluvettu Ponginavamma

Doragaari Pai Ooge Panka Vainavamma
O Osey Ramulamma
Dorasani Kalotthe Dhoodhi Vainavamma
O Osey Ramulamma
Davidene Veliginche Dhivve Vainavamma
O Osey Ramulamma
Naluguriki Thallonni Naalkavainavamma
O Osey Ramulamma
O Osey Ramulamma

Seekatinta Bikkumantu Kalatha Padda Kallalona
Baaku Lanti Elugu Meresena 
O Ramulamma
Mooka Baita Vedhuru Lona Muchchataina 
Raagaludhe Muddulayya Cheyyi Dhorekana
O Ramulamma

Kashtaallu Kannillu Vuntayaa Shaanallu
Kastalu Kannillu Nilichi Vuntaya Shanallu 
Inka Podala Maatu Puvvullaaga Odagaloyamma
Gubule Leni Guvvalaaga Yegaraaloyamma

Pachani Adivi thalli Pandhiravuthundamma
O Osey Ramulamma
Neerende Nee kaali Paranavuthundhamma
O Osey Ramulamma
Puseti Poolanni Pose Thalambralamma
O Osey Ramulamma
Koyilala Sandalle Sannayimelalamma
O Osey Ramulamma

Community

Like, share, and discuss

to start a discussion.