Back to Lyrics
Osey Ramulamma

Osey Ramulamma

1997 · 4 songs

Telugu

చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు 
చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు 

డొనేషన్ల  యుగంలోనే  డబ్బు  లేని  దళితుల్లో 
వందకోకడు  చదువుకుంటే  ఓర్చుకొని  గుణమెందుకు 
అరె  లంచగొండి  దేశంలో  ఎనకబడ్డ  జాతుల్లో 
వెయ్యినొకడు  నౌకారైతే  ఏడ్చుకునే  బుద్ధేందుకు 
పాయసల  జీడిపప్పు  తినేవాళ్ళకి  సామీ 
పాయసల  జీడిపప్పు  తినేవాళ్ళకి 
మా  గంజిలోన  ఉప్పు  చూసి  గొణుగుడేందుకు 

చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు 

పల్లెటూళ్ళ  సర్పెంచుల  పట్టణాల  చైరుమాన్ల 
సగం  మీకే  ఇస్తామని  సంకలెగర  వెయ్యమండ్రు 
సంకలెగర  వెయ్యమండ్రు
శాసన  సభ  సభ్యుల్లో  పార్లిమెంట్  మేమ్బర్లో 
ఆరా  కోరా  సీటులిచ్చి  ఐస్  చేసి  పోతుండ్రు
 
పవర్  లేని  పదవికుండే  రిజర్వేషన్ 
పవర్  లేని  పదవికుండే  రిజర్వేషన్ 
ఆ  ప్రధానమంత్రి  పదవికి  ఎందుకుండదు 
ఆ  ముఖ్యమంత్రి  పదవికైనా  ఎందుకుండదు 

చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు 

పండుతున్న  భూముల్లో  80 శతం  మీదే 
మిల్లుల్లో  మిషనులో  మూడొంతులు  మీకిందే 
మూడొంతులు  మీకిందే 
రూపాయి  కట్టాలని  మీ  ఇనప  పెట్టెలాందే 
బంగారం  వెండి అంతా  మీ  మెడకే  మీ  కాళ్ళకే 
మీ  మెడకే  మీ  కాళ్ళకే 

80 శాతం  మంది  ఎండుకొని  చస్తుంటే 
20 శాతం  మీరు  దండుకొని  బతుకుతుండ్రు 
దండుకొని  బతుకుతుండ్రు 
మా  చదువులు  మా  కొలువులు  మీకు  ఇస్తాము 
మా  చదువులు  మా  కొలువులు  మీకు  ఇస్తాము 
మీ  సంపదలో  రిజర్వేషన్  మాకు  ఇస్తారా 

చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు  

మీ  అబ్బా  పేరేమో  సుబ్బారావు  గారైతే 
మా  అయ్యా  పేరేమో  సుబ్బి  గడు  అయిపోయే 
మీ  అన్న  గారేమో  విమానాల్లో  ఎక్కుతుంటే 
మా  తమ్ముడు  గాడేమో  రిక్షాలు  తొక్కతుండే 
మీ  అమ్మకు  జలుబోస్తే  అపోలోలో  జేరుతుంటే 
మా  తల్లికి  కాన్సర్  ఐతే  ఆకూ  పసరు  మింగుతుండే 
మా  బాధలు  మా  గాధలు  దేవుళ్ళకి  చెబుదామంటే 
దేవుళ్లలో  ఒకడైనా  దళితుడే  లేకపాయె

చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు 
చౌదరి  గారు  ఓ  నాయుడు  గారు 
రెడ్డి  గారు  ఓ  రాజు  గారు 
మీ  పేరు  చివరలో  ఆ  తోకలెందుకు 
ఈ  ఊరు  చివరనే  మా  పాకాలెందుకు

English

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Donationla Yugamlona Dabbu Leni Dalitullo
Vandakokadu Chaduvukunte Vorchukoni Gunamenduku
Are Lanchagondi Deshamlo Enakabadda Jatullo
Veyyikokadu Noukaraite Edchukune Buddenduku
Payasala Jeedipappu Tinevallaki Sami
Payasala Jeedipappu Tinevallaki
Ma Ganjilona Uppu Chusi Gonugudenduku

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Palletulla Sarpenchula Pattanala Chairumanla
Sagam Meke Istamani Sankalegara Veyyamanru
Sankalegara Veyyamanru
Shasana Sabha Sabhyullo Parliment Memberlo
Araa Koraa Seatulichi Ice Chesi Potunru

Power Leni Padavikunde Reservation
Power Leni Padavikunde Reservation
Aa Pradhanamantri Padaviki Endukundadu
Aa Mukhyamantri Padavikaina Endukundadu

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Pandutunna Bhumullo 80 Shatam Mede
Millullo Mishanullo Mudontulu Mekinde
Mudontulu Mekinde
Rupayi Kattalanni Me Inapa Pettelande
Bangaram Vendantaa Me Medake Me Kallake
Me Medake Me Kallake

80 Shatam Mandi Endukoni Chastunte
20 Shatam Meru Dandukoni Batukutundru
Dandukoni Batukutundru
Ma Chaduvulu Ma Koluvulu Meku Istamu
Ma Chaduvulu Ma Koluvulu Meku Istamu
Me Sampadalo Reservation Maku Istaraa

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Me Abba Peremo Subbaravu Garaite
Ma Ayya Peremo Subbi Gadu Ayipoye
Me Anna Garemo Vimanallo Ekkutunte
Ma Tammudu Gademo Rikshalu Tokktunde
Me Ammaku Jaluboste Apololo Jerutunte
Ma Talliki Cancer Aite Aku Pasaru Mingutunde
Ma Badhalu Ma Gadhalu Devullaki Chebudamante
Devullalo Okadainaa Dalitude Lekapaaye

Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku
Chowdary Garu Oo Naidu Garu
Reddy Garu Oo Raju Garu
Me Peru Chivaralo Aa Tokalenduku
Ee Uru Chivarana Ma Pakalenduku

Community

Like, share, and discuss

to start a discussion.