Back to Lyrics
Nuvvu Vastavani

Nuvvu Vastavani

2000 · 7 songs

Telugu

కలలోనైన  కలగనలేదే  నువు  వస్తావని
మెలుకువలోనైన  అనుకోలేదే  నువు  వస్తావని
కలలోనైన  కలగనలేదే  నువు  వస్తావని
మెలుకువలోనైన  అనుకోలేదే  నువు  వస్తావని
ఆ  దేవుడు  కరుణించి  ఈ  దేవత  కనిపించి
ఆనందం  కలిగించి  ఈ  బంధం  కదిలొచ్చి
ప్రేమపైన  నమ్మకాన్ని  నాలో  పెంచుతున్నది
నను  కమ్మనైన  అమృతాల  నదిలో  ముంచుతున్నది

కలలోనైన  కలగనలేదే  నువు  వస్తావని
మెలుకువలోనైన  అనుకోలేదే  నువు  వస్తావని

చిన్ని  పెదవిపైన  పుట్టుమచ్చ  కానా
చిన్నుతున్న  నవ్వులలోన  స్నానాలాడనా
కన్నె  గుండెపైన  పచ్చబొట్టు  కానా
మోగుతున్న  సవ్వడి  వింటూ  మోక్షం  పొందనా
జానకి  నీడే  రాముని  మేడ
నీ  జారిన  పైట  నే  కోరిన  కోట
తెలుగు  భాషలోని  వేల  పదములు  తరగుతున్నవి
నా  వలపు  భాషలోన  చెలియ  పదమే  మిగిలి  ఉన్నది

కలలోనైన  కలగనలేదే  నువు  వస్తావని
మెలుకువలోనైన  అనుకోలేదే  నువు  వస్తావని

కాళిదాసు  నేనై  కవిత  రాసుకోనా
కాలి  గోటి  అంచులపైన  హృదయం  ఉంచనా
భామదాసు  నేనై  ప్రేమ  కోసుకోనా
బంతిపూల  హారాలేసి  ఆరాధించనా
నాచెలి  నామం  తారక  మంత్రం
చక్కని  రూపం  జక్కన  శిల్పం
వందకోట్ల  చందమామలోకటై  వెలుగుతుండగా
ఈ  సుందరాంగి  చూపు  సోకి  కాదా  బ్రతుకు  పండగ

కలలోనైన  కలగనలేదే  నువు  వస్తావని
మెలుకువలోనైన  అనుకోలేదే  నువు  వస్తావని
ఆ  దేవుడు  కరుణించి  ఈ  దేవత  కనిపించి
ఆనందం  కలిగించి  ఈ  బంధం  కదిలొచ్చి
ప్రేమపైన  నమ్మకాన్ని  నాలో  పెంచుతున్నది
నను  కమ్మనైన  అమృతాల  నదిలో  ముంచుతున్నది

English

Kalalonaina kalaganalede nuvu vasthavani
Melakuvalonaina anukolede nuvu vasthavani
Kalalonaina kalaganalede nuvu vasthavani
Melakuvalonaina anukolede nuvu vasthavani
Aa devudu karuninchi ee devatha kanipinchi
Aanandam kaliginchi ee bandham kadilocchi
Prema paina nammakanni naalo penchuthunnadi
Nanu kammanaina amruthala nadilo munchuthunnadi

Kalalonaina kalaganalede nuvu vasthavani
Melakuvalonaina anukolede nuvu vasthavani

Chinni pedavi paina puttumaccha kaanaa
Chinduthunna navvulalona snanalaadanaa
Kanne gunde paina paccha bottu kaanaa
Moguthunna savvadi vintu moksham pondanaa
Jaanaki neede raamuni meda
Nee jaarina paite ne korina kota
Telugu bashaloni vela padamulu karuguthunnavi
Naa valapu bashaloni cheliya padame migili unnadi

Kalalonaina kalaganalede nuvu vasthavani
Melakuvalonaina anukolede nuvu vasthavani

Kaalidaasu nenai kavitha raasukona
Kaaligoti anchula paina hrudayam unchanaa
Bhamadaasu nenai prema kosukona
Banthi poola haaraalesi aaradhinchana
Naa cheli naamam tharaka manthram
Chakkani roopam jakkana shilpam
Vanda kotla chandamamalokatai velugu thundagaa
Ee sunraangi choopu soki kaadaa brathuku pandagaa

Kalalonaina kalaganalede nuvu vasthavani
Melakuvalonaina anukolede nuvu vasthavani
Aa devudu karuninchi ee devatha kanipinchi
Aanandam kaliginchi ee bandham kadilocchi
Prema paina nammakanni naalo penchuthunnadi
Nanu kammanaina amruthala nadilo munchuthunnadi

Community

Like, share, and discuss

to start a discussion.