Back to Lyrics

Nuvve Nuvve

2002 · 5 songs

Telugu

ఏచోట  ఉన్నా  నీ  వెంటలేనా
సముద్రమంతా  నా  కన్నుల్లో  కన్నీటి  అలలవుతుంటే
ఎడారి  అంతా  నా  గుండెల్లో  నిట్టూర్పు  సెగలవుతుంటే
రేపు  లేని  చూపు  నేనై  శ్వాస  లేని  ఆశ  నేనై  మిగలనా
నువ్వే  నువ్వే  కావాలంటుంది  పదే  పదే  నాప్రాణం
నిన్నే  నిన్నే  వెంటాడుతు  ఉంది  ప్రతిక్షణం  నా  మౌనం

ఏచోట  ఉన్నా  నీ  వెంటలేనా
సముద్రమంతా  నా  కన్నుల్లో  కన్నీటి  అలలవుతుంటే
ఎడారి  అంతా  నా  గుండెల్లో  నిట్టూర్పు  సెగలవుతుంటే

నేల  వైపు  చూసీ  నేరం  చేశావని
నీలి  మబ్బు  నిందిస్తుందా  వాన  చినుకుని
గాలి  వెంట  వెళ్ళే  మారం  మానుకోమని
తల్లి  తీగ  బంధిస్తుందా  మల్లెపూవుని
ఏమంత  పాపం  ప్రేమ  ప్రేమించడం
ఇకనైనా  చాలించమ్మా  వేధించడం
చెలిమై  కురిసే  సిరివెన్నెలవా  క్షణమై  కరిగే  కలవా
నువ్వే  నువ్వే  కావాలంటుంది  పదే  పదే  నాప్రాణం
నిన్నే  నిన్నే  వెంటాడుతు  ఉంది  ప్రతిక్షణం  నా  మౌనం
రేపు  లేని  చూపు  నేనై  శ్వాస  లేని  ఆశ  నేనై  మిగలనా

వేలు  పట్టి  నడిపిస్తుంటే  చంటిపాపలా
నా  అడుగులు  అడిగే  తీరం  చేరేదెలా
వేరేవరో  చూపిస్తుంటే  నా  ప్రతి  కలా
కంటిపాప  కోరే  స్వప్నం  చూసేదెలా
నాక్కూడ  చోటేలేని  నా  మనసులో
నిన్నుంచగలనా  ప్రేమ  ఈ  జన్మలో
వెతికే  మజిలీ  దొరికే  వరకు  నడిపే  వెలుగై  రావా

నువ్వే  నువ్వే  కావాలంటుంది  పదే  పదే  నాప్రాణం
నిన్నే  నిన్నే  వెంటాడుతు  ఉంది  ప్రతిక్షణం  నా  మౌనం
ఏచోట  ఉన్నా  నీ  వెంటలేనా
సముద్రమంతా  నా  కన్నుల్లో  కన్నీటి  అలలవుతుంటే
ఎడారి  అంతా  నా  గుండెల్లో  నిట్టూర్పు  సెగలవుతుంటే

English

Achota Unnaa  Nee Ventalaenaa
samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutumtae
edaari Amtaa Naa Gumdello Nittoorpu Segalavutumtae
rapu Lani Choopu Nanai Svaasa Leni Aasa Nenai Migalanaa
nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam
ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam

Achota Unnaa Nee Ventalaenaa
samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutumtae
edaari Amtaa Naa Gumdello Nittoorpu Segalavutumtae

Nela Vaipu Choosee Naeram Chaesaavani
Neeli Mabbu Nimdistumdaa Vaana Chinukuni
Gaali Vemta Vellae Maaram Maanukomani
Talli Teega Bamdhistumdaa Mallepoovuni
Aemamta Paapam Praema Praemimchadam
Ikanainaa Chaalimchammaa Vaedhimchadam
Chelimai Kurisae Sirivennelavaa Kshanamai Karigae Kalavaa
Nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam
Ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam
Repu Lani Choopu Nanai Svaasa Leni Aasa Nenai Migalanaa

velu Patti Nadipistumtae Chamtipaapalaa
Naa Adugulu Adigae Teeram Chaeraedelaa
Vaeraevaro Choopistumtae Naa Prati Kalaa
Kamtipaapa Korae Svapnam Choosaedelaa
Naakkooda Chotolaeni Naa Manasulo
Ninnumchagalanaa Praema Ee Janmalo
Vetikae Majilee Dorikae Varaku Nadipae Velugai Raavaa

Nuvve Nuvve Kaavaalamtumdi Padae Padae Naapraanam
Ninne Ninne Ventaadutu Undi Pratikshanam Naa Maunam
Achota Unnaa  Nee Ventalaenaa
Samudramamtaa Naa Kannullo Kanneeti Alalavutuntae
Edaari Antaa Naa Gundello Nittoorpu Segalavutunte

Community

Like, share, and discuss

to start a discussion.