Back to Lyrics

Naa Peru Surya, Naa Illu India

2018 · 6 songs

Telugu

సరిహద్దున్న  నువ్వు  లేకుంటే 
ఏ  కన్ను  పాప  కంటి  నిండుగా 
నిధ్రపోదురా  నిధ్రపోదురా 

నిలువెత్తున  నిప్పు  కాంచేవై 
నువ్వుంటేనే  జాతి  బావుటా 
ఎగురుతుందిరా  పైకెగురుతుందిరా 

ఇల్లే  ఇండియా  ఢిల్లీ  ఇండియా  నే  తల్లే  ఇండియా 
తన  భరోసా  నువ్వే  దేశం  కొడకా 

 
సెలవే  లేని  సేవాకా  ఓ  సైనికా 
పనిలో  పరుగే  తీరికా  ఓ  సైనిక 
ప్రాణం  అంత  తేలికా  ఓ  సైనికా 
పోరాటం  నీకో  వేడుకగా  ఓ  సైనిక 

దేహంతో  వెళిపోదీ  కథ 
దేశంలా  మిగిలుంటుందిగా 
సమరం  ఒడిలో  నీ  మరణం 
సమయం  తలచే  సంస్మరణం 
చరితగా  చదివే  తరములకు 
నువ్వో  స్ఫూర్తి  సంతకం 

పస్తులు  లెక్కపెట్టవే  ఓ  సైనికా 
పుస్తెలు  లక్ష్యపెట్టవే  ఓ  సైనిక 
గస్తీ  దుస్తుల  సాక్షిగా  ఓ  సైనికా 
ప్రతి  పూటా  నీకో  పుట్టుకే  ఓ  సైనిక 

బతుకిది  గడవదు  అని  నువ్విటు  రాలేదు 
ఏ  పని  తెలియదు  అని  నీ  అడుగుతూ  పడలేదు 
తెగవాగు  ధీరుడివని  బలమగు  భక్తుడనే 
వేలెత్తి  ఎలుగెత్తి  భూమి  పిల్చింది 
నీ  శక్తిని  నమ్మి 

ఇల్లే  ఇండియా  ఢిల్లీ  ఇండియా 
ఇల్లే  ఇండియా  ఢిల్లీ  ఇండియా  నీ  తల్లే  ఇండియా 
తన  భరోసా  నువ్వే  దేశం  కొడకా 

నువ్వో  మండే  భాస్వరం  ఓ  సైనికా 
జ్వాలా  గీతం  నీ  స్వరం  ఓ  సైనిక 
బతుకే  వందేమాతరం  ఓ  సైనికా 
నీ  వల్లే  ఉన్నాం  అందరం  ఓ  సైనిక

English

Sarihaddhunna nuvvu lekunte
Ye kannu paapa kanti ninduga
Nidharapodhuraa nidharapodhura

Niluvethuna nippu kanchevai
Nuvvuntene jaathi baavuta
Eguruthundhiraa paikeguruthundhira

Ille India dhille India ne thalle India
Thana bharosaa nuvve desham kodaka


 
Selave leni sevakaa o sainikaa
Panilo paruge theerikaa o sainika
Pranam antha thelikaa o sainikaa
Poraatam neeko vedukaa o sainika

Dehamtho velipodhee katha
Deshamlaa migiluntundhiga
Samaram odilo nee maranam
Samayam thalache samsmaranam
Charithaga chadhive tharamulaku
Nuvvo spoorthi santhakam

Pasthulu lekkapettave o sainikaa
Pusthelu lakshyapettave o sainika
Gasthee dhusthula saakshigaa o sainikaa
Prathi pootaa neeko puttuke o sainika

Bathukidhi gadavadhu ani nuvvitu raaledhu
Ye pani theliyadhu ani nee adugitu padaledhu
Thegavagu dheerudivani balamagu bhakthudane
Veletthi elugetthi bhoomi pilchindhi
Nee shakthini nammi

Ille India dhille India
Ille India dhille India nee thalle India
Thana bharosaa nuvve desham kodaka

Nuvvo mande bhaaswaram o sainikaa
Jwaalaa geetham nee swaram o sainika
Bathuke vandhemaatharam o sainikaa
Nee valle unnaam andharam o sainika

Community

Like, share, and discuss

to start a discussion.