Back to Lyrics
Naa Autograph

Naa Autograph

2004 · 5 songs

Telugu

మౌనం  గానే  ఎదగమని  మొక్క  నీకు   చెపుతుంది 
ఎదిగిన  కొద్దీ   అడగమని  అర్ధమందులో  ఉంది 

మౌనం  గానే  ఎదగమని  మొక్క  నీకు   చెపుతుంది 
ఎదిగిన  కొద్దీ   ఒదగమని  అర్ధమందులో  ఉంది 

అపజయాలు  కలిగిన  చోటే  గెలుపు  పిలుపు  వినిపిస్తుంది 
ఆకులన్నీ  రాలిన  చోటే  కొత్త  చిగురు  కనిపిస్తుంది 

మౌనం  గానే  ఎదగమని  మొక్క  నీకు  చెపుతుంది 
ఎదిగిన  కొద్దీ  ఒదగమని  అర్ధమందులో  ఉంది 
అపజయాలు  కలిగిన  చోటే  గెలుపు  పిలుపు  వినిపిస్తుంది 
ఆకులన్నీ  రాలిన  చోటే  కొత్త  చిగురు  కనిపిస్తుంది 

దూరమెంతో  ఉందని  దిగులు  పడకు  నేస్తమా 
దరికి  చేర్చు  దారులు  కూడా  ఉన్నాయిగా  
భారమెంతో  ఉందని  బాధపడకు  నేస్తమా  
బాధ  వెంట  నవ్వుల  పంట  ఉంటుందిగా
 
సాగర  మధనం  మొదలవగానే  విషమే  వచ్చింది 
విసుగే  చెందక  కృషి  చేస్తేనే  అమృతమిచ్చింది  

అవరోధాల  దీవుల్లో  ఆనంద  నిధి  ఉన్నది 
కష్టాల  వారధి  దాటినా  వారికి  సొంతమవుతుంది  
తెలుసుకుంటే  సత్యమిది  తలచుకొంటే  సాధ్యమిది 

మౌనం  గానే  ఎదగమని  మొక్క  నీకు  చెపుతుంది 
ఎదిగిన  కొద్దీ   ఒదగమని  అర్ధమందులో  ఉంది

చెమట   నీరు  ఛిన్దగా  నుదుటి  రాత   మార్చుకో 
మార్చలేనిదేది  లేదని  గుర్తుంచుకో 
పిడికిలి  బిగించగా  చేతి  గీత  మార్చుకో 
మారిపోని   కధలే  లేవని  గమనించుకో 
 
తోచినట్టుగా   అందరి  రాతలు  బ్రహ్మే  రాస్తాడు 
నచ్చ్చినట్టుగా  నీ  తలరాతను  నువ్వే  రాయాలి
  
నీ  ధైర్యాన్ని  దర్శించి  దైవాలే  తలా  దించగా 
నీ  అడుగుల్లో  గుడికట్టి  స్వర్గాలే  తరియించగా 

నీ  సంకల్పానికి  ఆ  విధి  సైతం  చేతులెత్తాలి 
అంతులేని  చరితాలకి  ఆది  నువ్వు  కావలి 

మౌనం  గానే  ఎదగమని  మొక్క  నీకు  చెపుతుంది 
ఎదిగిన  కొద్దీ  ఒదగమని  అర్ధమందులో  ఉంది
అపజయాలు  కలిగిన  చోటే  గెలుపు  పిలుపు  వినిపిస్తుంది 
ఆకులన్నీ  రాలిన  చోటే  కొత్త  చిగురు  కనిపిస్తుంది

English

Mounam Gaane Edagamani Mokka Neeku Cheputundi
Edigina Koddi Odagamani Ardhamandulo Undi

Mounam Gaane Edagamani Mokka Neeku Cheputundi
Edigina Koddi Odagamani Ardhamandulo Undi

Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipistundi
Aakulanni Raalina Chote Kotta Chiguru Kanipistundi

Mounam Gaane Edagamani Mokka Neeku Cheputundi
Edigina Koddi Odagamani Ardhamandulo Undi
Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipistundi
Aakulanni Raalina Chote Kotta Chiguru Kanipistundi

Duramento Undani Digulu Padaku Nestamaa
Dariki Cherchu Daarulu Kuda Unnaayigaa
Bhaaramento Undani Baadhapadaku Nestamaa
Baadha Venta Navvula Panta Untundigaa

Saagara Madhanam Modalavagane Vishame Vachchindi
Visuge Chendaka Krushi Chestene Amrutamichindi

Avarodhaala Deevullo Aananda Nidhi Unnadi
Kashtaala Vaaradhi Daatina Vaariki Sontamavutundi
Telusukunte Satyamidi Talachukonte Saadhyamidi

Mounam Gaane Edagamani Mokka Neeku Cheputundi
Edigina Koddi Odagamani Ardhamandulo Undi

Chemata Neeru Chindagaa Nuduti Raata Maarchuko
Maarchalenidedi Ledani Gurtunchuko
Pidikili Biginchagaa Cheti Geeta Maarchuko
Maariponi Kadhale Levani Gamaninchuko

Tochinattugaa Andari Raatalu Bramhe Raastadu
Nachchinattuga Nee Talaraatanu Nuvve Raayaali

Nee Dhairyaanne Darsinchi Daivaale Tala Dinchagaa
Nee Adugullo Gudikatti Swargaale Tariyinchagaa

Nee Sankalpaaniki Aa Vidhi Saitam Chetulettali
Antuleni Charitalaki Aadi Nuvvu Kaavali

Mounam Gaane Edagamani Mokka Neeku Cheputundi
Edigina Koddi Odagamani Ardhamandulo Undi
Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipistundi
Aakulanni Raalina Chote Kotta Chiguru Kanipistundi

Community

Like, share, and discuss

to start a discussion.